Wednesday 15 April 2015

మైల మతం , ద్రోహి కులాలు

మైల మతం , ద్రోహి కులాలు

డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కొలంబియా యునివర్సిటి నుండి తన ఉన్నత చదువు పూర్తి చేసుకుని భారత దేశానికి తిరిగి వచ్చినప్పుడు తన కుటుంబం మహారాష్ట్రలోని సాతారా లో ఉంటుంది.కావున డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు సాతారా రైల్వేస్టషేన్ లో దిగుతారు.తనతో రెండు పెద్ద పెద్ద షూటుకేసుల నిండా పుస్తకాల బరువు ఉంటుంది.రైల్వే స్టేషన్ నుండి తన ఇల్లు 6 కి.మీ. దూరంలో ఉంటుంది.కావున డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అక్కడ ఉన్న టాంగా(గుర్రపు స్వారీ) ని , 4 పైసలకీ ఇంటీ వరకు మాట్లాడుకుంటారు.టాంగా వాడు 2 కి.మీ.దూరంలో వెల్లీన తర్వాత, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి కులం అడుగుతాడు , డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మహార్ అని చెప్పడంతో టాంగా వాలా షూట్-బూట్ లో బాబాసాహెబ్ అంబేడ్కర్ ను చూసి నమ్మలేదు , మరియు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారితో ఇలా అన్నాడు ఎందుకు అబద్ధం చెబుతున్నావు నిజం చెప్పు నీ కులం ఎంటి ? అప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు నేను నిజమే చెబుతున్నాను , అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు అన్నారు. వెంటనే టాంగా వాలా టాంగా దిగి బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి తిట్టడం మొదలు పెట్టాడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అంటరాని వాడివని, నీ వలన నేను మైల అయిపోయాను.ఇప్పుడు నా టాంగా కు గో మూత్రంతో శుద్ధి చెయ్యాలి , అయినా అంటరాని వాడివి నీకెందుకురా షుటు-బుటు, (వాడు మాసిపోయిన చిన్న గోసి , చిరిగిపోయిన బనియాన్ వేసుకుని ఉంటాడు ) నా డబ్బులు నాకు ఇవ్వు నేను తిరిగి వెలతానూ అన్నాడు.సాయంత్రం సమయం మరియు బరువు గల రెండు పెద్ద షూట్- కేసులు ఉండడంతో , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు టాంగా వాలా తో బతిమాలారు ఈ సమయంలో ఇంత పెద్ద బరువులతో ఎలా వెళ్లగలను.నీకు రెట్టింపు పైసలు ఇస్తాను ఇంటివరకు దించమన్నారు. రెట్టింపు పైసలకీ ఆశపడ్డ టాంగావాలా రావడానికి ఒప్పుకున్నాడు కాని ఒక షరతు అన్నాడు , వస్తాను కాని టాంగాను నువ్వు నడపాలన్నాడు , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు తప్పనిసరి పరిస్థితులో ఒప్పుకున్నారు.కాని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారికి టాంగా ను నడిపిన అనుభవం లేకపోవడంతో ఓ 2 కి.మీ.దూరం పొయిన తర్వాత టాంగా ఒక గుంతలో బొర్ల పడింది , టాంగావాలా దూకేసాడు , కాని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి మొకాలుకు బలమైన గాయమైంది ఇక టాంగావాలా ఎంత చెప్పిన వినకుండా తన డబ్బులు తిసుకుని అక్కడి నుండి తిరిగి వెళ్ళి పోయాడు, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాత్రం తప్పని పరిస్థితుల్లో నెత్తి మీదా ఒక షూట్-కేసు , చేతిలో ఒక షూట్-కేసు పట్టుకుని , మొకాలి గాయంతో కుంటుకుంటు ఇంటి వరకు వెళ్ళి , రమాబాయి కి పిలిచారు చీకటి ఉండడంతో రమాబాయి దీపం తీసుకొని బయటకు వస్తుంది, బాబాసాహెబ్ అంబేడ్కర్ గారినీ ఆ పరిస్థితిలో చూసి రక్తం కారుతున్నా మొకాలిని చూసి , కుంటుకుంటు వస్తున్న బాబాసాహెబ్ గారినీ చూసి కంటినిండా నీళ్ళతో "ఎమయింది సాహేబ్ " అని అడిగింది , బాబాసాహెబ్ గారు దుఖ పూరితమైన కంఠంతో " ఎం చెప్పమంటావు రాము నేను ఏ దేశం నుండి వస్తున్నానో అక్కడి ప్రజలు నా జ్జానాన్ని చూసి , నా విద్దతను చూసి గర్వ పడుతుంటే నా దేశం మాత్రం నాకు కులం పేరిట ఈ విధంగా అవమాన పరుస్తోంది".అని సమాధానం ఇచ్చారు.
చిన్నప్పుడు కటింగు తియ్యనని అవమానం పర్చిన మంగలాయన, టాంగావాలా....వీరు వెనుకబడిన కులాల వారే వీరీ ప్రగతి కొరకు బి.సి.కమీషన్ ను నియమించనందకు తన న్యాయశాఖ మంత్రి పదివికి సైతం రాజినామా చేశారు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షతో అన్నిరంగాలలో ముందుకు వస్తున్న వెనకబడిన కులాలు మాత్రం బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని అంటరానివాడుగా మాత్రమే చిత్రికరిస్తున్నారు...!!!               
               స్వేచ్ఛా, సమానత్వం, సోదరభావం కలిగి ఉన్న, మానవీయ విలువలు కలిగి ఉన్న బౌద్ధ ధమ్మాన్ని, 1800 సంవత్సరాల పాటు తక్షశీల, నలందా , విక్రమశీల, దంతపురి , వల్లాభి ...మెద. బౌద్ధ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచ దేశాలకు జ్జాన బిక్ష పెట్టిన బౌద్ధ ధమ్మాన్ని మాతృ భూమి నుండి తిరష్కరించి, బ్రహ్మణ వాదము భారత దేశమును ఈశ్వరవాదం , కర్మవాదం , పిండదానము , పునర్జన్మ, అజ్ఞానం, అంధవిశ్వాసములో నెట్టేసి , కులమతాల అసమానతలతో దేశాన్ని వేల కులాలుగా విభజించి, చాతుర్వర్ణ సిద్దాంతం హిందూ ధర్మానికి పునాదిగా బ్రాహ్మణీయవాదము బలపడింది.        
             బ్రాహ్మణీయులను ఎదురించి నిలచిన వారిని అస్పృశ్యులుగా వెలవేసి వారిని అంటరానివారిగా , చూడరానివారిగా చిత్రికరించి వారికి బడిని , గుడిని నిషేధించారు, అత్యధిక శాతం ప్రజలను శుద్రులుగా చిత్రికరించి వారిని బానిసలుగా మార్చి కుల వృత్తులకు పరిమితం చేశారు.కులమతాల కుళ్ళు కంపును జనం నర నరాల్లో ప్రవహింపజేసి అసమానతలను శాశ్వతం చేస్తు బ్రహ్మణవాదము ఈ దేశములో బల పడింది.
                      బ్రాహ్మణీయవాదము యొక్క కుట్రలను ధ్వంసం చేయడానికి 19వ శతాబ్దం చివరిలో 14 ఎప్రిల్ 1891 సంవత్సరములో భీంరావు రాంజీ అంబేడ్కర్ అనే మహా సూర్యుడు ఉదయించాడు.అగ్రకుల మనువాద కుట్రల్నీ ఎడమకాలితో తన్ని నిత్య అవమానాలకు , అణచివేతకు, అవహేళనకు గురవుతున్న ప్రజల బ్రతుకుల్లో వెలుగును తెచ్చారు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.
                       బ్రాహ్మణవాద కుట్రలు వలన భారతదేశము లక్షల కులాలుగా, వేల జాతులుగా, వందల మతాలుగా , లెక్కలేనన్ని భాషలుగా , చిన్న చిన్న రాజ్యలుగా చీలిపోయిన భారత సమాజాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామ్య దేశముగా రూపొందించడానికి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగము కారణము.కుల, మత, లింగ, భాషా, భేదము లేకుండా ఈ దేశములో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ను కల్పించి పౌరులుగా సమాజములో గుర్తింపు ఇచ్చి రాహుల్ గాంధికైన, లింగడికైన, రామయ్యకైనా ఒకే ఓటు ఒకే విలువ కల్పించింది బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాత్రమే.
               ఈ రోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, జమిందారులు కూడు గుడ్డలేని సామాన్యుడికి కూడా వంగి వంగీ దండాలు పెడుతున్నారంటే ఆ ఓటు హక్కు కల్పించిన డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కారణం. భారతదేశంలో కార్మిక చట్టాల రూపశిల్పి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు.
                    డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మహిళలకు ఆస్తి లో సమాన హక్కుల కొరకు ఆ రోజు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఆనాటి ఫ్యూడల్ పాలకులు వ్యతిరేకించడముతో తన న్యాయ శాఖా పదివికి రాజీనామా చేసినా మహిళొద్ధారకుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఒకటి కాదు రెండు కాదు ఈ దేశంలో తెచ్చిన సామాజిక రక్షణ చట్టాలు , హక్కులు చాలానే అనుభవిస్తున్న మనందరికీ తెలుసు ఇవి డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు పెట్టిన బిక్షా అని కాని ఈ బ్రహ్మణవాద హిందూ వ్యవస్థ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని కేవలం దలిత నాయకుడిగా ప్రచారం చేస్తున్నారు.
భారత దేశానికి రాజ్యాంగం అందించి అంటరాని కులాల విముక్తి కొరకై అనేక చట్టాలను తెచ్చిన దార్శనికుడు ఈ దేశంలో ఆర్థికంగా , సామాజికంగా , అణచివేతకు గురవుతున్న, దోపిడీకి గురవుతున్న కులాల, జాతుల ప్రజల ప్రధాన శత్రువు బ్రహ్మణవాదం అని ప్రకటించి ఈ దేశాన్ని స్వేచ్ఛా,సమానత్వం, సౌబ్రాతృత్వం నీడ కింద తెచ్చిన నిజమైన దేశ భక్తుడు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు. 
 మనకోసం......
                      కులమతాల వలలో చిక్కబడి ఉన్నా ఈ అస్పృశ్య బాంధవులను ఉద్ధరించడంలో నేను అసఫలీకృతమైతే నన్ను నేను తుపాకీతో కాల్చుకొని అంతమైపోతాను అంటు తన జాతి నిర్మాణం కోసం , తన జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రం కొరకు పోరాటం చెస్తున్నప్పుడు.....ఎన్ని యాతనల గాయలను సహించాడు మన కోసం ! ఎన్ని రాత్రులు మేల్కొన్నాడు మన కోసం ! ఎన్ని కష్టాలు సహించాడు మన కోసం ! కష్టాలతో కృంగిపోయిన తన భార్య శిరస్సు కింద ఏ ఒడినైతే ఇవ్వాలో ఆ ఒడిని అతను దుఖగ్రస్తులైన మన తల్లి తండ్రుల నెత్తి కింద ఇచ్చాడు ! పిడకలు చేసి పగలు రాత్రి సంసారపు పోయిలో పొగను ఊదే తన భార్య కన్నీళ్లను తుడవటానికీ ఏ చేతులైతే ఎన్నడు పనికిరాలేదో , ఆ చేతులు మన తల్లిదండ్రుల ఆనంత కన్నీళ్లను తుడవడంలో వ్యస్తమై ఉండేను.కష్ట జీవితమైన తన భార్య యొక్క పిడికెడంత శరీరాన్ని కప్పడానికి ఒంటీనిండా వస్త్రం ఇవ్వలేని ఈ మన తండ్రి తన సర్వ జీవితాన్ని మాహా వస్త్రంగా మార్చి మన చిరిగిన దేహం పై కప్పుతుండేను ఈ విధంగా తన పిల్లలు రమేష్ పొయాడు , గంగాధర్ పొయాడు, అమ్మాయి ఇందు కూడా మరణించింది , ఇంకా ఒడిలోనే రాజరత్న జారుకున్నాడు ఇంతటి దుఖాలనూ సహించాడు మన కోసం.
                         మృత్యువు చేతిలో ఊయ్యాల దారానిఛ్చి జీవితపు జోలపాట పాడే ఈ తల్లిదండ్రులు ఎవరికోసం త్యాగం చేశారు ? ఎవరికోసం వారి జీవితాలను హోమం చేశారు? ఎకైక తనయుడైనమో యశ్వంత్ రావు కోసం ఎక్కడ సిఫారసు చేయలేదు. వ్యాధిగ్రస్త వయస్సు లో కూడా ఓర్పును పాటించే సంయమాల దీపం ఎవరికోసం కాలింది..? ఒక్క బ్రెడ్ ముక్క తిని 18గంటలు అభ్యాసం చేసి గ్రంథాలను రచించిన ఈ యుగంధరుడు ఎవరికోసం కష్టపడ్డాడు..?
ఎందుకు జోహార్లు కొట్టే మన చేతుల్నీ బంధన విముక్తి చేశారు...? ఇందుకొరకే కదా మనషి మానవత్వాన్ని ధిక్కరించే నాలుకల్నీ పీకేయగలం అని , దీనికొరకే కదా మన మీదా అన్యాయాలు, అత్యాచారాలు చేసే వారి గొంతను కోయగలం అని ,......మరి ఈ చేతులు ఈ రోజు ఏమి చేస్తున్నాయి...? ఈ చేతుల్నీ మనం ఎక్కడ కుదవ పెట్టినాము...? ఈ చేతుల్నీ మనం ఎవ్వరి పాదాలకు అర్పించినామము....? ఈ చేతులు కావాలి ఆకాశంలో పతాకంల ఎగరడానికి , ఈ చేతులు కావాలి పడికెల్నీ బిగించి యుధ్ధపూరిత నినాదాల్నీ ఇవ్వడానికి, ఈ చేతులు కావాలి శత్రువుల, నిర్దయుల దౌడల్ని బద్ధలు కొట్టడానికి...
జై భీమ్ .. 
                          ఇట్లు

           మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

1 comment:

  1. sir,
    Don't discourage. Every educated and professional B.Cs are always with Dr.Ambedkar, but illiterate and under graduates are still in darkness and it is the sacred duty of all professionally educated B.Cs to bring these people from the darkness. This process is started with Mandal Reservation Act. Soon in coming years you will see all the B.Cs, SCs & S.Ts will come into same umbrella and conquer the Political Power which is master key of all the power as said by Dr. Baba Saheb Ambedkar.
    Vijay

    ReplyDelete