Wednesday 15 April 2015

డా.బి.ఆర్.అంబేడ్కర్ లక్షణం

                అంబేడ్కర్ లక్షణం

అంబేడ్కర్ లక్షణం ???
కన్నీటికి కాపలా కాయడం కాదు
దు:ఖాన్ని అమ్ముల పోది చేయటం
అణచివేతల సమాజాన్ని 
ఎగిసి ఎడమ కాలితో తన్నడం
నరకబడ్డ చోట 
నిప్పుల గుండం నుంచి
ఏగిరి దూకడం
కాలం పరివేధనని చెవొగ్గి విని 
మర ఫిరంగులు ధరించి యుద్దం చేయడం
నంగి నంగి మాటలు చేప్పడం కాదు 
సాహీత్య పీటాల ముటాల అడుగులకు 
మడుగులోత్తడం కాదు
వీరుల పాదాల గురుతులను తలకేత్తుకోవడం
అట్లా నిటారుగా 
నిలబడాలనుకుంటున్న మనిషి
నిప్పుల గుండేల నుండి దూకి బయటలు వస్తున్న 
దైవమే మన బాబా సాహేబ్ అంబేడ్కర్ గారు...!!!
         ఇట్లు

మీ అంబేడ్కర్ యువత

No comments:

Post a Comment