Monday 20 April 2015

విజయదశిమి వేనికవున్నటువంటి చారిత్రక రహస్యం




                 విజయదశిమి వేనికవున్నటువంటి చారిత్రక రహస్యం:
విజయ దశమి వెనుక ఉన్న చారిత్రక రహస్యం ఏమిటి .....?
బాబా సాహెబ్ అంబేద్కర్ విజయ దశమి రోజునే బౌద్ధ దమ్మ దీక్ష ఎందుకు స్వీకరించారు..?
వీటికి అన్నిటికి సమాధానం కావాలంటే మన మెదడును పదునుగా ఉపయోగించాలి మన ఆలోచన శక్తిని ఉరికించాలి. మన మెదడును పద్మవ్యుహాలు చేదించేలాగా తాయారు చేయాలి. ఇప్పుడు అదే చేద్దాం ఇది దసరా గడియలు అసలు దసరా ఏంటి....? దీనినే విజయ దశమి అని అంటారు. మరి విజయ దశమి అని ఎందుకు అంటారు...? దసరా ముందా..? విజయ దశమి ముందా ...?

ఈసారి విజయ దశమి (దసరా) అక్టోబర్ 3 న వస్తుంది వచ్చే సంవత్సరం మరో తేదిన వస్తుంది. పోయినేడు ఇంకో తేదిన వచ్చ్చింది తేది ముఖ్యం కాదు విజయ దశమి ముఖ్యం. బాబాసాహెబ్ అక్టోబర్ 14 నాడు దమ్మ దీక్ష స్వీకరించాడు ఎందుకంటే ఇక్కడ తేది ముఖ్యం కాదు ఆ సంవత్సరం అంటే 1956 లో దసరా అక్టోబర్ 14 వచ్చింది. మరి అక్టోబర్ 14 1956 ఎందుకు ఎంచుకున్నారు.......? అంతకు ముందు సంవత్సరం 1955 దానికి ముందు 1954 ఎందుకు స్వీకరించలేదు...? ఎందుకంటే ఆరోజుకు అంటే 1956 అక్టోబర్ 14 కు విజయదశమి ప్రారంభమై 2500 సంవత్సరాలు పూర్తీ అయింది. అంటే బాబాసాహెబ్ ఈ దేశ మూలవాసులైన మన అందరిని ఆ మహత్తర ఘట్టానికి జోడించారు వాస్తవానికి చెప్పాలంటే ఈ సమాజం బలవంతంగా మరిపించ బడ్డ ఒక సంస్కృతిని తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఈ దేశ మూలవసులకు చాల చారిత్రాత్మక మైన ప్రాధాన్యత గల పండగ. ఇదే దినాన 2500 సంవత్సరాలకు ముందు సామ్రాట్ అశోకుడు తన ఆయుధాలు వొదిలేసి బౌద్ధ దంమాన్ని స్వీకరించాడు దీనికి పదిరోజుల ముందు కళింగ యుద్ధం చేశాడు ఆయుద్ధం లో విజయం సాధించాడు. కాని దానికి సరిగా 10 రోజుల తర్వాత విజయోత్సవ సంబరాలు జరుపుకోకుండా బొద్ద దీక్ష స్వీకరించాడు. ఆనాడు ఇది కళింగ యుద్ధ జరిగిన పదవరోజు. ఆనాటినుంచే చూడండి బాబాసాహెబ్ పరిశోధన. అయన దేశ భక్తీ. అశోకుడు బౌద్ధ దంమాన్ని స్వీకరించి దేశాన్ని మొట్ట శాంతి అహింస లుగల దేశంగా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాడు. అశోకుని మరణానంతరం అయన మనవడైన బృహదత్తున్ని, పుష్య మిత్ర శుంగుడు అనే బ్రాహ్మడు చంపి. బౌద్ధుల సాముహిక. దమన కాండకు, బౌద్ధ విధ్వంసానికి పూనుకున్నాడు. విజయ దశామిని ప్రజలు సామూహిక పండుగగా జరుపుకునేవారు. దసరా అనేది మరాటి పదం. హిందీలో దీనిని దశ హరా అంటారు. అనగా పది తలలు ఉన్న రావణుడు రాముడి ద్వారా చంపబడినాడు అని అర్ధం. ఈ చంపబడిన దాన్ని దశహర అని విజయదశమి స్తానంలో దీనిని ప్రారంభించారు ఇది విజయదశమి అనే దాన్ని సమాప్తం చేసి దాని స్తానంలో దశ హర ను తీవ్రంగా ప్రచారం చేశారు. దీనివల్ల అశోకుని మహత్తరమైన లక్ష్యం ప్రజలకు తెలియకుండా దాచబడినది. ఈ రోజున పది తలలు ఉన్న రావణాసురుని బొమ్మను దహనం చేయడం ప్రారంబించారు. ఇది ప్రతీఘాత విప్లవం జరిగిన తరవాత, బ్రాహ్మణుల యొక్క దురుద్దేశ పూరిత కుట్రలో భాగమే. తర్వాత రామాయణం రాయబడింది. రామాయణం ఒక కల్పిత మైన కధ. అంతకు ముందు రాముడు లేదు రామాయణం లేదు. రామాయణ కధలో రావణున్ని రాక్షసుడిగా చిత్రీకరించారు. రావణున్ని పది తలలున్న రాక్షసునిగా చూపించారు. ఎందుకంటే ఈ పదితలలు బౌద్ధం లోని పది పారమితలకు (గొప్ప శీలాలు) గుర్తు. అందుకే రావణున్ని తొమ్మిది తలలున్న వానిగా లేక ఎనిమిది తలలున్న వానిగా లేక పదకొండు తలలున్న వానిగా చూపించలేదు. దీన్ని మనం ఆలోచించాలి. రావణుని పదితలలున్న వానిగా, రాక్షసునిగా చూపించి దానిని దహనం చేయడం ప్రారంభించారు దాన్ని మన ప్రజలు సామూహికంగా ఘనంగా జరిపేల ప్రోత్సవించారు ఇది ప్రతిఘాత విప్లవంలో భాగమే.



ఇట్లు 
మీ అంబేద్కర్ యువసేన ఐనఓలు





No comments:

Post a Comment