Wednesday 2 September 2015

సామాజిక తత్వం-డా.అంబేడ్కర్

సామాజిక తత్వం-డా.అంబేడ్కర్


                               
                       తాత్విక చింతన అనేది “ ఏ విషయాన్నైనా కూలంకషంగా ఆలొచించి నిర్ధారించేందుకు పట్టుదలగా సాగే క్రుషి “.అందువలన తాత్విక చింతనను సామాజిక , రాజకీయ తాత్విక చింతనలు మొదలైన విభాగాలుగా చూడడం , విభజించడం సాధ్యం కాదు.ఏదైనా ఒక అంశం అర్ధ్హవంతమైనది అని స్వయంగా నిర్ధారణ చేసుకోవడానికి వీలుగా ఆలోచనా పరులైనవారు తమ జీవితాలను బౌద్ధిక పరమైన క్రమశిక్షణలో పేట్టుకోవలసిన అవసరం నుండే ఈ తాత్విక చింతన పుట్టుకోస్తుంది.తాత్విక చింతన ఏప్పుడు పరిపూర్ణమైనదిగా ఉండాలి.మానవ జీవితాలలోని ప్రతి అంశాన్ని అందుకు సంభంధించిన ప్రతి ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలి.
అందువల్ల ఏ సామాజిక తత్విక చింతన అయినా తప్పనిసరిగా “ సమాజ స్వభావాన్ని , సమాజ అస్తిత్వాన్ని నిర్దేశించే సూత్రాలను , సామాజిక జీవనాన్నీ, కార్యచరణను విశ్లేషించేందుకు ప్రయత్నం కేస్తూ సమాజాన్నీమొత్తం పరిశోధించేదిగా వుండాలి.యావత్ సామాజిక జీవనానికి మనిషే మూలం.అన్ని సామాజిక కార్యకలాపాలు మనిషి వల్లనే ఆరంభమవుతాయి.అతడికి తనవైనా లక్ష్యాలు , విలువలు ఉన్నాయి.మానవజీవనానికి అంతిమగమ్యం ఏమిటనేది కనుగోనడమే సామాజిక తాత్విక చింతన ధ్యేయం , కర్తవ్యం.భారతీయ సామాజిక నేపథ్యంలో డా.అంబేడ్కర్ గారు ఈ లక్ష్యాఅధనకి పూనుకున్నారు.


                                 
                         తీక్షణమైన బుద్ది , ఆమాజిక నాడిని పసిగట్టే నేర్పు గల అంబేడ్కర్ గారు సాంప్రదాయాలకి కట్టుబడి  , చాంధస భావాలను , మార్పుకంగీకరించని నైజాన్ని కలిగిన హైందవ సామాజిక వ్యవస్థను లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు.అంటరానివారిని నిరాశ , నిశ్ప్రుహలుముప్పిరిగోనే దుస్థితికి నెట్టిన హైందవ సామాజిక వ్యవస్థ, మతాచారాలు అమానుషం , అశాస్త్రీయం , నిర్హేతుకమని అంబేడ్కర్ గారు విమర్శించారు.తత్ఫలితంగానే అంటరానివారు , అణగారినవారు , అసంఘటిత ,బీద ప్రజలుగా మిగిలిపోయారు.ఈ పరిస్థితులే డా.అంబేడ్కర్ క్రూరమైన , అంటరానితనం , ఆవిర్భవానికి , అభివ్రుద్దికి కల చారిత్రక ఆధారాలను కనుగోనేందుకు , కుల వ్యవస్థ గురించి , శూద్రుల గురించి పరిశోధింక్చేందుకు ప్రేరేపించాయి.

                               సామాజికంగా తమకుగల థాన బలంతో క్రూరమైనవీ ,అశాస్త్రీయతతో నిర్హేతుకమైనవి , నమ్మశక్యం కానివి ,ఆమాజిక మతాచారాలను రూపోంధించి , షేడ్యూల్డ్ కులాల వారి సామాజిక , ఆర్ధిక , సాంస్క్రుతిక జీవనంపై అమానుషంగా దాడిచేసిన అగ్రవర్ణ హైందవ తత్వవేత్తల కుట్రలను ,నయవంచనను ఆయన సరిగా గుర్తించగలిగారు.వీరివల్లనే అంటరానివారు యుగయుగాలుగా హైందవ సామాజిక జీవనంలో అణచివేతకు గురి అవుతూ వఛారు.అసంఘటిత వర్గంగా , బీధలుగా మిగిలిపోయి దారితోచక కొట్టు మిట్టాడుతున్నారు.బహుహ ఇందువల్లనే డా.అంబేడ్కర్ గారు శూద్రులపైన అస్ప్రుశ్యతలపైన , కుల వ్యవస్థపైన కొన్ని గ్రంధాలు రాశారు.ఆయన చేప్పిన కొన్ని ముఖ్య అంశాలు :
1.భారతదేషంలోను కులం ఆవిర్భావం , అభివ్రుద్ది , పనిచేసే తీరు.
2.కుల నిర్మూలన
3.శూద్రులెవరు ??భారతీయ –ఆర్య సమాజంలో వారు చతుర్ద వర్ణస్తులెందుకయ్యారు.
4.అంటరానివారు ఏవరు ?వారు ంటరాని వారు ఏందుకయ్యారు ??
5.బుద్దుడు-ఆయన ధమ్మ ప్రబోధం.
డా.అంబేడ్కర్ అభిప్రాయాలు ఎంత సమంజామైనవి , చరిత్ర బద్దమైనవి , ఎంత కాలనుగుణమైనవి అనేది తెలుసుకోవాలంటే ఆయన ప్రతిపాధింఛిన సిద్దాంతాలను అధ్యయనం చేయడం తప్పనిసరి...!!

ఇట్లు

వలపర్ల సన్ని మహర్