Monday 20 April 2015

హిందుకోడ్ బిల్లు



హిందుకోడ్ బిల్లు :
ఆలోచనకు మార్గం వేసింది బాబాసాహెబ్ గారు 1955 లోనే మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కావాలని హిండుకోడ్ బిల్ తాయారు చేశారు దానిని మనువాద పురుషాధిక్య సమాజం పార్లమెంట్లో వీగిపోయేల చేసింది నాడు పార్లమెంట్లో మహిళా ప్రతినిధులు తక్కువ ఆనాటి పురుష ఎంపి లు పూర్తిగా అగ్రవర్ణాల వారు ఈ బిల్లును చట్టంగా రూపొందించాలని ఆనాడు అంబేద్కర్ కు మద్దత్తుగా దుర్గాబాయి దేశ్ముఖ్ పెద్ద ఉద్యమం నడిపారు ఇది మన ప్రజలు తెలుసుకోవాలి.
మన దేశం లో ఉన్న మహిళ లందరూ, దళిత, బి.సి.,ఎస్.టి. పౌరుల కంటే, అత్యధికంగా, వివక్ష, అణిచివేత కు గురయ్యారు, గురవుతున్నారు. అలా వివక్ష, అణిచివేత లకు ఎందుకు,ఎప్పుడు,ఎలా గురవుతున్నారు!, దానికి పరిష్కారములేమిటి?
దేశ చరిత్ర వెయ్యేళ్ళ వెనుకకు వెళితే, మహిళ ల పై వేదింపులు, వివక్ష, అణిచివేత లే సాక్షాత్కరిస్తాయి. సతీ సహగమనం, పరదా పద్దతి, బాల్య వివాహాలు, చదువులకు దూరంగా ఉంచడం. అది ఏకులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా! ఎమున్నది గర్వ కారణం, చరిత్ర అంతా, మహిళ ల పై దౌర్జన్యాలు, దాష్టీకాలు తప్ప. ఛ! తలుచు కుంటుంటే, బాదేస్తుంది.
ఇదంతా, ఒకప్పటి మాట. మరి ఇప్పుడు, నాకనిపిస్తుంది., కాలం మనకేమి నేర్పించలేదని. ఎన్నో విషయాలలో మార్పు వచ్చినా, మహిళ ల ను ఎలా అణిచివెయ్యాలి అనే విషయం లో మాత్రం అదే స్టేటస్-ఖొ మైంటైన్ అవుతుంది అని అనుకుంటున్నాను.
* సతీ సహగమనం బదులుగా, భర్త మరణించిన స్త్రీ ని గౌరవంగా చూసుకోకుండా, ఇక్కడే మానసికంగా, సజీవంగా, చంపేయడం. అలా భర్త మరణించిన స్త్రీ కి మనం పెట్టిన పేరేమిటి?, ఇది సతీ సహగమనం కంటే ఎక్కువ బాద కాదా?
* భర్త బతికున్నపుడే, " దీర్ఘ సుమంగళీ భవ!" అనే ఆశిర్వచనాలు. ఎక్కడున్నాం మనం!
* ఒక కుటుంబం లో కొడుకు, కూతురు ఉంటే, కొడుకు ని మాత్రం బాగా చదివించడం, కార్పోరేట్ స్కూల్ లో చదివించడం. కూతురిని మాత్రం ఏదో ఒక చిన్న బడి లో చిన్న చదువు చదివించి ఒక అయ్య చేతిలో పెట్టి చేతులు దులుపుకోవటం, అబద్దమంటారా?, ఇప్పుడదేమి లేదులే అనుకోవడనికి లేదు ఫ్రెండ్స్!
* పెళ్ళి కాని ఆడ పిల్లలను గడప దాటనీయరు. పెళ్ళి అయిన ఆడపిల్లల్లో అయితే ఏ ఫేమిలి ఆర్దిక స్థితి కి తగ్గట్టు ఆ ఫెమిలి మహిళ ల పై మానసిక అణిచివేత, వివక్ష.
* మన దేశం లో, 55% , age between 15-35 గ్రూప్ వాళ్ళు. చైనా లో అయితే ఎక్కువ భాగం 80%, age between 45-85 గ్రూప్ వాళ్ళు . అంటే, మన దేశం లో ఉన్న యవ్వన వయస్సు లో ఉన్న యువతుల సంఖ్య, ప్రపంచం లో మరే దేశం లో లేరనమాట. కాబట్టి, మన దేశం లో అశ్లీలత, మీడియా,సినేమా, ఇంటర్నెట్, సెల్ల్ ఫొన్ ల విషయం లో, ప్రభుత్వం, పెరెంట్స్ కొంచెం జాగ్రత్త గా వ్యవహరించవలసిన అవసరం ఉంది.
* మన దేశం లో, ఎక్కువ పని జరిగేది, జరుగుతుంది., వ్యవసాయ క్షేత్రం లో, ఇంటి లో., ఈ రెండింటి లో ఎక్కువ పని చేసి, సత్ఫలితాలను అందించేది, మహిళలే. మిగతా రంగాలలో ఎలాగు మహిళలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, మన దేశం లో క్రియాశీలక శక్తి గా వ్యవహరించి, ఎక్కువ పని భారాన్ని మోస్తూ, దేశాన్ని, కుటుంబాన్ని ముందుకు తీసుకు వెళ్ళేది మహిళ మాత్రమే అనే విషయాన్ని గమనించాలి
* ఇన్ని చేసినా, మహిళ అబలఅని, “రెండవ తరగతి పౌరురాలిగానె మిగిలి పోవటం నిజంగా విచారించదగ్గ విషయం.
* అందుకనే, నా కంక్లుజన్, బి.సి.,ఎస్.సి., ఎస్.టి., ల కంటే వెనుక బడ్డ జాతి, స్త్రీ జాతి. వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వక పోతే చరిత్ర మనలను క్షమించదు. అదేంటో, కేంద్ర ప్రభుత్వం, సొనియా అమ్మ గారికి, ఈ వెతలు కనపడ లేదేమో, ఈ బిల్లు తప్ప అన్ని బిల్లు లు పార్లమెంట్ లో పాస్ చేయించు కొంది. కాబట్టి, “మోడి సాబ్! మహిళా బిల్లు త్వరగా ప్రవేశ పెట్టి, బిల్ పాస్ చేయించండి. లేక పోతే, మీరు కూడా, సోనియా లాగా, రెస్ట్ తీసుకోవల్సి వస్తుంది.
* ఈ విషయం లో హేట్స్-ఆఫ్ టు ఎన్.టి.ఆర్., ఆయన పుణ్యమా అని, రాష్ట్ర ప్రభుత్వ జాబ్స్ లో మహిళ రిజర్వేషన్ (33%) ఇచ్చారు. ఇవ్వాళ్ళ బిల్ పెట్టలన్నాడు, నెక్స్ట్ డే బిల్ల్ అసెంబ్లీ లో పాస్ అయింది. అది ఎన్.టి.ఆర్. అంటే.

* సో, మహిళ బిల్ల్ ప్రవేశ పెట్టి కేంద్రం లో పాస్ చెపిస్తేనే, నిజమైన రక్షా బంధన్, నిజమైన రాఖీ పండుగ.

                    ఇట్లు 
          మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment