Wednesday 15 April 2015

వీరుడు అంబేడ్కర్

వీరుడు అంబేడ్కర్



వీరుడు అంబేడ్కర్
వీరులు విగ్రహాల్లో కాదు , ప్రజల గుండేల్లో ఉంటారు,
ప్రజల గుండేచప్పుళ్ళలో వీరులు గర్వంగా నవ్వుతుంటారు ,
విగ్రహాలను ద్వంసంచేస్తే వీరులు మాయమైపోరు,
అది మరో విస్పోటనానికి నిప్పంటిస్తుంది ,
విగ్రహాలు కూల్చెస్తే వీరులు చఛిపోరు ,
ఆ విగ్రహాలను తమ రక్తంతో నిర్మించుక్కున్న జాతి జనుల ఊపిరిలో ఉంటారు.
అణగదోక్కటం , అవమానించటం , 
మీ సంస్క్రుతు కావోఛు.
రెఛగోట్టడం , చిఛుపేట్టడం , మీకు చేతనైన విధ్య కావోఛు.
కూలిన విగ్రహాల్లోచి...కోట్ల పిడికిళ్ళు మొలకేత్తటం ఇక అందరం చూస్తాం.
వీరులు జనంలో ఉంటారు..జనం జరిపే రణంలో ఉంటారు...వీరుడు అంబేడ్కర్
      
భవిష్యత్తును జ్యోతిష్యుడి చేతిలో పెట్టే ' ఖర్మ' బతుకు
బతకొద్దు
తనని తాను శాసించుకొనే ఆత్మవిశ్వాసం కలిగుండాలి
ఇంకొకడు నీ జీవితాన్ని నామరూపాల్లేకుండా ధ్వంసం
చేసే హక్కెక్కడిది
జీవితం అంటే ఊడిగం
చేయడం కాదు - ఉద్యమించటమనీ
స్వప్నాల్లో పరిబ్రమించటం కాదు - శ్రమిస్తూ
సంఘటితమవటమనీ
నీరు కారిపోవటం కాదు - నెత్తురు దారుల్లో నడవటమనీ
త్వరగా తెల్సుకో -
రోజురోజుకో రక్తపాతం
రక్తసిక్తమైన చరిత్ర పుటలూ
మనిషిని భయపెట్టవు..
అడుగడుగునా దళిత విప్లవ జ్వాల
నిన్నింకా రగుల్కొల్పటం లేదా....?
               ఇట్లు

మీ అంబేడ్కర్ యువత

No comments:

Post a Comment