Wednesday 15 April 2015

మనువాదులకు లేఖ

                           మనువాదులకు లేఖ


నా పేరు కంచికచర్ల కోటేశు ఏప్పుడు పుట్టాను తేలియదు కాని  యెళ్ళ యేల్లకు మునుపే పుట్టాను , నాకు ఖర్మ సిద్దాతం తేలియదు కాని , మన్ను సిద్దాంతం తేలుసు దోంగతనం నేరం మీద కంచికచర్లలో సజీవ దహనానికి గురైయ్యాను
ఏ చుండూరులో చుట్టూముట్టారో ,
ఏ కారంచేడులో నీ కళ్ళు పోడిచారో ,
ఏ లక్ష్మీపేటలో నువ్వు కుమిలిపోయావో ,
ఏ పదిరి కుప్పంలో పోదిలి పోదిలి ఏడ్చావో ,
ఏ నీరుకోండలో నిలువేల్లా మాడావో ,
ఒక రోంపిచర్లలో మళ్ళి క్రూరంగా కోట్టబడావో ,
ఒక వేంపేట , ఒక ఖైర్లాంజీ ,
ఇలా ఏని పేర్లతో
 అవమానలకు , అవహేళనలకు గురిఅవుతావు ,
 నన్ను భాదితుడు అని పిలవకండి ,
నేను అమరుడిణ్ణి  ,
ఏగిరే ధిక్కార పతాకన్ని
రా ఇంకనైన మరుగున పడ్డ మన జాతి పక్షానా నిలబడదాము...!!!
దేశానికి రక్షణ కవచం అంబేడ్కర్ తత్వం రా , దరువేద్దాం హోయ్ దరువేద్దాం రారండోయ్ , పల్లే పల్ళేకు పోదాం , అంబేడ్కర్ గురించి గడప గడపకు చేబుదాము , రారండోయ్...

ఇన్నాళ్ళు ఊరికి చివరనే బ్రతికికాను ,
నన్ను ఊరికి దూరంగా వేలివేశారు ,
ఏన్ని అసమానతలను ,
ఏన్ని అవహేళనలు అనుభవించానో నాకు తేలుసు ,
ఇప్పుడు ఆ అసమానతలన్నంటిని ,
ఆ అవహేళనలను అన్నింటీణీ దాటుకోని ,
ఊరిమీదకి దాడి సై అంటూన్నాను...
నా మీద , నా జాతి ప్రజల మీద దాడి చేసిన వారి ,
మీద ముప్పేట తేగబడి నరకడానికి సిద్దమైయ్యాను ,
ఊరికి చివరన ఉన్న నా గుడీసే సాక్షిగా ,
రగులుతున్న నా గుండే మంట సాక్షిగా ,
గోడకు మౌనంగా ఉన్న డప్పును చండ్ర నిప్పులో కాపుదాం ,
జేబులో ప్రశాంతంగా నిద్రిస్తున్న కలాన్ని తట్టి లేపుదాం ,
 రిజర్వేషన్ ఆత్మ సాక్షిగా ,
డిల్లో ఉన్న ఏర్రకోట సాక్షిగా ,
నా దేవుడి కల సాకరమైన బహుజన రాజ్యాధికారం కోసం ,  
పార్లమేంటుపై దండోరా వేస్తున్నాను ,
కదలిరండి డా.అంబేడ్కర్ వారసుల్లారా...!!!

                 ఇట్లు
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు




No comments:

Post a Comment