Monday 20 April 2015

పంచముల చరిత్ర : 2 వ భాగం




                పంచముల చరిత్ర : 2 వ భాగం       

*ఋగ్వేదము పదో పుస్తకంలో సమాజంలోని ప్రజలు బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య,శూద్ర అనే చతుర్వర్ణ విభజన జరిగినట్లు స్పష్టంగా పేర్కొనబడినది.ఇందులో, ఏ వర్ణం లో కూడా స్థానం నోచుకోని వ్యకులను పంచములులేదా చండాలులుఅని పేర్కొనడమైనది.
*రామయణము లో ఈ విధముగా ఇవ్వబడినది. చండాలులు ఎల్లప్పుడు నల్లని రంగు తో, శరీరమంతా బూడిద పూసుకొని, విరబోసుకున్న జడలు కలిగి, శ్మశానం లో దొరికిన మట్టి కొట్టుకున్న బట్టల తో, అక్కడ పారవేసిన దండలు ధరించి, చూసేవారికి భీతి గొల్పేటట్లు గా ఉండాలి. ఇది అప్పటి ప్రభుత్వాలు పంచములకు ఫిక్స్ చేసిన డ్రస్ కోడ్.
*అగ్రవర్ణాలవారు తమ పితృదేవతలకు పెట్టే పిండాకూడును ఈ పంచములు చూస్తే, పితరులు పిండాకూడు ను స్వీకరించరని విష్ణుపురాణం చెపుతుంది. ఇ పిండాకూడు నైనా, పంచములకు పెట్టె అన్నమైనా నేల మీదనే పారవేయాలి, ఆ తరువాతే, పంచమ జాతి బిడ్డలు ఆ అన్నాన్ని తినాలి. ఇది అప్పటి ప్రభుత్వాలు పంచములకు ఫిక్స్ చేసిన ఫుడ్ మెను.
*పంచములు, ఎప్పుడూ ఉరికి వెలుపల, అంటే శ్మశాననికి దగ్గర (లేదా) శ్మశానము లోనే నివాసం ఉండాలి. (లేదా) ఉరికి ఊరికి మధ్యలో ఉన్న అడవుల నట్ట నడుమ అతి కౄర మృగాల మధ్యనే బిక్కు బిక్కుమనే బతుకులు బతకాలని అప్పటి ప్రభుత్వాలు పంచములకు ఫిక్స్ చేసినస్వగృహ స్కీం.
*మహాభారత సమయములో కూడా వీళ్ళ జీవితం ఇంతే హినాతి హీనముగా ఉన్నట్లు తెలుస్తుంది
* సభ్య సమాజానికి దూరంగా ఇలాంటి అధమాతి అధమ జీవితాన్ని గడుపుతూ వస్తున్న పంచములు కాలానుగుణంగా, చతుర్వర్ణాలకు వెట్టి,చాకిరి,కూలీ పనుల నిమిత్తమై అవసరపడి, క్రమేపి సమాజములోనికి షరతులతో కూడిన అనుమతిఇచ్చారు.
* ఇది కాకుండా, 540బి.సి. నుండి 468 బి.సి. మధ్యలో మహావీరుడు,గౌతముడు మొదలగు పరిపాలనల వలన పంచముల జీవన శైలి లో కొంచెం మార్పు వస్తుంది అనుకున్న తరుణములో మనువు [ఋషి] రూపములో వచ్చిన ఒక వ్యక్తి [ మొత్తం 14 మంది మనువులలో ఒకరు] 300 బి.సి. లో మనుస్మృతిఅని ఒక శాస్త్రాన్ని మానవ సమాజములోకి జొప్పించి మళ్ళి పంచముల జీవితాన్ని వెయ్యి సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఈ మనువు గురించి ౠగ్వేదము,మహాభారతము లోని కూడ పేర్కొనబడినది. ఈ మనుస్మృతి అనేది మానవ జీవనానికి సంభంధించిన నియమావళి అని చెపుతూ ఉంటారు కాని, ఈ శాస్త్రం కేవలం పంచముల జీవితం పై కక్కిన నిప్పులులేద చిమ్మిన విషంఅని చెప్పవచ్చు.
* “మనుస్మృతి 1-91” లో స్ఫస్టంగా ఇవ్వబడినది.
"ఏకమేవతు శూద్రస్య ప్రభుః కర్మసమాదిసత్
ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషా మనసూయయా!"
అర్ధం : అసూయ లేకుండా ఆర్య,వైశ్య,క్షత్రియ వర్ణాల వారికి సేవ చేయడమే శూద్రుల విధి అని బ్రహ్మ శూద్రులను అదేశించారు.
*మనుధర్మ శస్త్రము పదవ అధ్యాయం లో 51 వ శ్లోకం:
* "వాసాంసీ మృతచేలాని భాన్నభాండేషు భోజనం,
కార్ణ్షాయసమలంకారః పరివ్రజ్యా చ నిత్యశః
* అర్ధం: చండాలులు,పంచములు గ్రామం వెలుపలనే నివాసం, విరికి వంటపాత్రలుండవు. కుక్కలు-గాడిదలే విరికి ధనం. పినుగ బట్టలే విరికి వస్త్రాలు. పగిలినకుండ పెంకులే పళ్ళెరములు. దేశ సంచారం చేస్తూ జీవిస్తుంటారు.
* 53:"రాత్రౌ న విచరేయుస్తే గ్రామేషు నగరేషు చ"
అర్ధం:రాత్రుల్లో కూడా వీరు ఊరిలో తిరగరాదు.
* మనుధర్మ శస్త్రము ప్రకారం, తప్పులు,సాక్షాలు,శిక్షలు విషయములలో బ్రాహ్మణులకు ఒక విధముగా, వైశ్య,క్షత్రియ,శూద్రులకు ఒక విధంగా, పంచములకు మరొక విధంగా ఉండేవి. పంచముల విషయములో "అనుమతి లేకుండా ఊళ్ళోకి ప్రవేశిస్తే, ఒక పంచముడికి విధించే శిక్ష అనేది, ఒక బ్రాహ్మణుడు నరహత్య చేస్తే విధించే శిక్ష కన్నా కఠినంగా ఉండేది.
* 320 బి.సి. నుండి 1947 ఎ.డి. వరకు పరిపాలించిన మౌర్యులు,గుప్తులు,గజిని మహ్మద్, మహ్మద్ బిన్ తుగ్లక్, కుతుబిద్దిన్,మొఘల్,బ్రిటిష్ పరిపాలన ల లో చండాలులు,పంచముల జీవన శైలి ని మెరుగుపరిచే ప్రయత్నము ఎంఇ చేయలేదు. ఎందుకంటే, ఈ నిచ్చెన మెట్ల కులాలు శిస్తు వసూళ్ళకు, మత మార్పిడులకు పైన చెప్పిన పాలకులకు అనుకూలించింది.
* 2500 సంవత్సరములలో దళిత జాతి బిడ్డల పరిస్థితి:
* దళితులు ఊరిలోకి ప్రవేశించ బోయే ముందు, ఒక డప్పు లాంటి వస్తువు తీసుకొని, దానితో శబ్దం చేస్తూ ఊళ్ళొకి రావాలి. దీనివలన ఊళ్ళొ ఉన్న మిగతా జనాభ లోపలికి వెళ్ళి జాగ్రత్త పడుతుంటారు.ఇంతా చేసి, ఉళ్ళోకి వచ్చేది, వీళ్ళ తాలుక వెట్టి చాకిరి చెయ్యటానికి.ఇలా ఊళ్ళొ సంచరించేటప్పుడు నిరంతరం నోటికి ఒక తొట్టి ని కట్టుకొని ఉండాలి. పొరపాటున ఉమ్మి వంటిది వస్తే, దానిలోనే ఉమ్మాలి.
* అంటరానివాడు నడిచిన దారి లో పడిన పాద ధూళి మరొకరికి అంటకుండా, అతను నడుముకి తాటాకు కట్టుకొని నడిచి, ఆ పాద ధూళి ని ఊడ్చుకుంటూ వేళ్ళాలి.
* ఈ మనుష్యులకు పుట్టుక తో వచ్చిన కులం ను అధారం చేసుకొని, ఆ మనుష్యులను తాకనే తాక కూడదు అని, విద్యాశాల లకు, వైద్య శాలలకు, దేవాలయములకు ప్రవేశము నిశేధం అని, స్వచ్చమైన నీరు దొరికే బావుల దగ్గరకు రాకూడదు అని, చెప్పులు కుట్టడం, కాటికాపరి,వెట్టి,కళాసి, చాకిరి మరియు పెద్ద కులపోళ్ళ ఫేమిలి, పేమిలీ కి సకల సపర్యలు మొదలగునవి ఏ జీతం లేకుండా చెయ్యాలి అని, పెద్ద కులపోళ్ల తో వొరేయ్, వొశేయ్ అనిపిచ్చుకోవాలి అని, పెద్ద కులపోళ్ల కి కోపం వచ్చినా, కామం వచ్చినా వాళ్ళ చే అనుభవించబడాలి అని, ఇలా అనేక బాదలు, అవమానములు కు గురి చేసేవారు. ఇలా చేయబడుటకు, వాళ్ళు చేసిన గొప్ప తప్పు దొంగతనమో, అత్యాచారమో, హత్యో కాదు. వాళ్ళు చేసిన ఏకైక తప్పు ఆ దళిత కులము లో పుట్టడం.
*ఈ దళితుల సుధీర్ఘ బాదాతప్తమైన చీకటి మయమైన జీవితములలోకి వెలుగు కిరణములతో ఉన్న కాంతి పుంజమై వచ్చారు 19 , 20 వ శతకములో జ్యోతిరావు ఫులే, అంబేద్కర్ వంటి కారణ జన్ములు.
* వీరి కృషి ఫలితముగా దళితుల జీవితములలో కొంత మార్పు వచ్చింది.సరిగ్గా, అంతే స్థాయిలో మన దేశము కూడా అంతే స్థాయి లో ముందంజ వేసింది.
* కాని, అంబేద్కర్ నిష్క్రమణ తరువాత, కులరక్కసి తన రూపము మార్చుకొంది.( రాజు పాగోలు )
                  
                   ఇట్లు 
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు
       



1 comment:

  1. ఒరేయ్ పిచ్చినాకొడక.పోస్ట్ delete చెయ్.ఆర్యులచే ఓడించబడినవారిని శూద్రులుగా(దాసులు)గా చేసుకున్నారు.ఎదురు తిరిగినవారిని వెలేసారు.చెప్పులుకుట్టడం నీచమైనది ఎలా అవుతుందిరా బేవర్స్ నాకొడక.ఆర్యులు ఇండియాకు రాకముందు సింధునాగరికతా కాలంలో(క్రీపూ3000)కులవ్యవస్థలేదు.ఆర్యులు వచ్చినతరువాత వర్ణవ్యవస్థ వచ్చింది.బ్రాహ్మణతల్లికి శూద్ర పురుషునికి పుట్టినవాడు చండాలుడు.వీరు వర్ణసంకరం చేసారు కాబట్టి పంచమవర్ణం సృష్టించారు.కానీ అంటరానితనం రామాయణంలో లేదు.బుద్దునికాలంలో లేదు.బుద్దుని కాలంలో పంచములు కూడా రాజ్యాలేరారు.మగదరాజ్యం,కోసలరాజ్యాలు పంచములు ఏలినట్టు శాసనాలు వున్నాయి.అంటరానితనం క్రీశ 400 కాలంలో గుప్తులు గోహత్య నిషేదించడం వల్ల పుట్టింది.

    ReplyDelete