Wednesday 15 April 2015

బౌద్ధ ధమ్మ మార్గం

బౌద్ధ ధమ్మ మార్గం 

బుద్ధుడు తన ధమ్మంలో చెప్పడం జరిగింది....తానన్వేషించిన ధర్మ సిద్దాంతం లో దేవుడు, ఆత్మ కు స్థానం లేదు.కర్మలు , క్రతువులకు తన ధర్మం లో స్థానం లేదు.తన ధర్మం మానవుడే కేంద్ర బిందువుగా ఎంచుకుని ఉన్నదనీ , ఈ భుమి పై మానవుడు బ్రతికి ఉన్నంతకాలం తనకు , సాటిమానవుడికి మధ్య ఎలాంటి సంబంధాలుండాలన్న విషయం మాత్రమే తన ధర్మం తెలుపుతుందన్నాడు.నా ధర్మం లో ఇది మొదటి అంశం.
మానవుడు దుఖితుడై దైన్యతలోను , పేదరికంలోను , జీవిస్తున్నాడు అనేది రెండవ అంశం , ప్రపంచం దుఖ భాజనమై యున్నది గనక ఆ బాధలను వైదొలగించడం ఎలాగన్నదే తన ధర్మం యొక్క పరమావధి.అంతకుమించిన దేది ధర్మం కాజాలదు.బాధలున్నవని (దుఃఖము) గుర్తించడం , అలాగే వాటి నుండి బయట పడడానికి గల ఉపాయమే ధర్మానికి వునాది కావలేనని చెప్పాడు.ఈ మౌలిక విషయాన్ని విష్మరించేదేది ధర్మమని చెప్పడానికి వీలుకాదన్నాడు.
దుఖాన్ని తొలగించే మార్గం వివరిస్తూ.....
1)
నిర్మలమైన జీవనం
2)
సద్దర్మ విధానం
3)
సౌశీల్యవంతమైన మార్గం లో ప్రతి ఒక్కరు పయనించగలిగితే దుఖం అంతమైపోతుందని బుద్ధుడు చెప్పాడు
నిర్మలమైన జీవన విధానానికి బుద్ధుడు ప్రతిపాదించిన సూత్రాలు
1)
ఎవరికి హానికలిగించడం గాని , చంపడం గాని కూడదు.
2)
దొంగలించడంగాని లేక ఇతరుల ఆస్తులను వంశం చేసుకోవడం తగదు
3)
అసత్యమాడరాదు.
4)
వ్యభిచారం చేయరాదు 
5)
మత్తు పధార్థాలను సేవించడం రాదు.
సద్ధర్మ మార్గం....
1)
సమ్యక్ దృష్టి అనగా సరియైన దృష్టి కోణం కలిగి ఉండడం. మూఢ విశ్వాసాలను , అసత్యములను , గుర్తించి తర్కం తో , హెతుబద్ధమైన విషయాలను అంగీకరించడం.
2)
సమ్యక్ సంకల్పం అనగా సరియైన ఆలోచనలను కలిగి ఉండటం.ఆలోచనలు జీవితాన్ని శాసిస్తాయి.ఉన్నతమైన ఆలోచనలు ఔనత్యానికి లేవనెత్తగా, నీచపు ఆలోచనలు జీవితానికి అధోస్తాయికి త్రోసివేస్తాయి.
3)
సమ్యక్ వచనం అనగా సరియైన మాటను కల్గి ఉండటం.అబద్ధాలు , చాడీలు , వదురబోతుతనం లేనిదై ఉండటం
4)
సమ్యక్ కర్మ అనగా మంచి కర్మను కలిగి ఉండటం.
5)
సమ్యక్ అజీవికా అనగా సరియైన వృత్తి.
6)
సమ్యక్ వ్యాయామం అనగా సరియైన ప్రయత్నం 7) సమ్యక్ స్మృతి అనగా చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టు గా చూడటం
8)
సమ్యక్ సమాధి అనగా మొదటి ఏడు అంగాల పట్ల సరియైన జాగురుకతను కలిగి ఉండటం…!!!

                       ఇట్లు
               మీ అంబేడ్కర్ యువత


No comments:

Post a Comment