Thursday 9 April 2015

మనువాదులకు డా.బి.ఆర్.అంబేడ్కర్ వాదుల లేఖ


మనువాదులకు మా లేఖ ;
v  మనువాదానికి ...
మనువాదానికి మరణ శాసనం
రాస్తున్నా మిదిగో ...
కౌటిల్యానికి పాడెకట్టెలు
మోస్తున్నా మిదిగో ...
కులాలు మతాలు కట్టిన గోడలు
కూల్చేస్తా మిదిగో ...
సామ్యవాదపు అంబేద్కరులై
వస్తున్నా మిదిగో ...
తలలో పుట్టిన బ్రాహ్మణులంతా
చదవాలంటిరిరో ...
భుజములో పుట్టిన క్షత్రియులంతా
ఏలాలంటిరిరో ...
తొడలో పుట్టిన వైశ్యులు దోపిడి
చెయాలంటిరిరో ...
పాదాలల్లో పుట్టిన వాళ్ళని
పాతరేస్తిగదరో
ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డల
ఒకటై వస్తున్నాం
నీ బ్రహ్మకు దిమ్మతిరిగేటట్లు
రాతను మార్చేస్తాం
శవాలమీద కప్పిన బట్టలు
కట్టాలంటిరిరో ...
వేదాలింటే చెవుల్లో సీసం
పోసినారు గదరో ...
శాస్రం చదివితే నాలుక లెన్నో
కోసినారు గదరో
వేసిన శిక్షకు బదులందిస్తే
ఏమైపోతరు రో ...
ఆణిగి ఉంటే మేమధముల మనుకొని
అణచి వేసినారు...
ఎదురు తిరిగితే తోక ముడిచి మరి
పరుగు తీసినారు ...
సమతా మమతల రాజ్యం పంచే
హృదయం మాకుంది
కులాల మతాల ఎల్లలెరుగని
స్ఫూర్తి బహుజనులది......జై భీం,,,జై బాబా సాహేబ్

v  మూఢ నమ్మకం మనషికి అందత్వన్నిస్తుంది వాస్తవం.
కుల మతాల రోంపిలో పడి కలుషిత మౌతున్నవి
లేత మొగ్గలు.
యువతరం
జఢత్వ మవుతోంది
కుల తోకలతో మూఢ భక్తి
చీడ పురుగై పట్టిందిగా .
కుల తోకల సిరియల్ల
బాదుడేక్కువయ్యింది
బహుజన ఉద్యమాన్ని
దారిమల్లించడానికి.
మూలవాసులకు
కుల పిచ్చి పెరిగే కొద్ది
బహుజన నేత్రం గ్రుడ్డిదవుతోంది.
కుల పూనదులు
బలపడె
వర్ణశ్రామ దేశమందు
బహుజన రాజ్యధీకరం శూన్యమేగా !

v  అసుర శకం
భూమి పుత్రులమే మేము
కానీ భూదేవి కనలే మమ్ముల
రాత్రి రంగులో మెరిసే రాజులం మేం
నిజమిది రాక్షస బుద్ధులు తాకలే మమ్ముల
అధర్మపు ధర్మ యుద్ధంలో నేలకొరిగిన వీరులం మేం
వర్తమానంలో ఒరిగిన చోటే మొలకెత్తి మహావృక్షాలమైతున్నాం
బుద్ధుని యుద్ధపు సైనికులం మేం
ఆలస్యమైనా విశ్వాన్ని ఏలుతూ ప్రశాంతపరుస్తాం
డిల్లిలో ఉన్న ఎర్రకోట సాక్షిగా
మన నీలిరంగు పతాకాన్ని ఎగురవేస్తాము
v  నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ..
మరో రాత్రి
మనుషుల్ని మర్చిపోతున్నప్పుడు
మనసుల్ని జ్ఞప్తికి తెస్తూ
గతానికి వేలాడదీస్తుంది
అది మారని రాత్రి
మారిన జీవితాన్ని ఆనందిస్తున్నప్పుడు
చెల్లిపోయిన కాలాన్ని తిరిగి చూపిస్తూ
చెల్లని మనిషినని ఎగతాళి చేస్తుంది
అది నమ్మలేని రాత్రి
రాత్రి లక్షణాలను పరీక్షిస్తున్నప్పుడు
పగటిలా పగలబడి నవ్వుతూ
పున్నమిలా వెన్నెలను విరజిమ్ముతుంది
అది తెల్లారని రాత్రి
తీరని కోరికలను తిరగేస్తున్నప్పుడు
ప్రకృతిపై తిరగబడుతూ
ప్రశాంతంగా నిద్రపోతుంది
అది నాలా నల్లని రాత్రి
రంగులు మార్చిన వైనాన్ని వర్ణిస్తున్నప్పుడు
రాగాల కోసం తపించే రోగిని చేస్తూ
తొందరగా తనలో కలిపేసుకుంటుంది
       రాత్రుళ్ళూ , రాత్రుళ్ళతో వచ్చే చీకట్లూ నావే
రాతి గాయాలను చాతి వెనుక దాచుకున్న హృదయాలూ
కఠిన హృదయుడనైన నావే
అమావాస్యలూ , పున్నాలూ నావే
లెక్కలు వేసుకుంటూ వాటితో వచ్చే ప్రపంచపు పాపపుణ్యాలూ
పట్టించుకున్నా, పట్టించుకోకున్నా నావే
అందములు , అందవిహీనములు అన్నీ నావే
ఆనందాన్ని పంచే అరుదైన ప్రకృతి ఆకృతులూ
ప్రాణాలతో పరిగెడుతున్న ప్రతిమనైన నావే
అక్షరాలూ , వాటి లక్షణాలూ నావే
ఆకాశానికి పయనమైన అక్షరాయుధాల ఆశయాలూ
అక్షరాలా విశ్వనరుడనైన నావే

నిశ్శబ్దాలన్నీ నీ శబ్దాలే
నీలోని అబద్ధాలను అంతం చేసే ఆయుధాలే
కలాల కళలన్నీ నీ కలలే
నీలోని కలవరాలను చూపించే పదయుద్ధాలే
గతాలన్నీ హతమైన నీ కాలాలే
నీలోని నిస్పృహను పెంచి పోషించే యధార్ధాలే
రాత్రుళ్ళన్నీ రాళ్ళపైని నీ రంగులే
నీలోని సింగిడికి నిలువెత్తు సాక్ష్యాలే
వెన్నెళ్ళన్నీ వెర్రివైన నీ నవ్వులే
నీలోని నిష్కల్మషత్వానికి నిర్దారణలే
మరణాలన్నీ మారని నీ గుణాలే
నీలోని మృగత్వానికి మారుపేర్లే

జననాలన్నీ జాలిపడిన నీ జాగ్రత్తలే
నీలోని బానిసత్వాన్ని నిందించే నినాదాలే

No comments:

Post a Comment