Wednesday 15 April 2015

దళిత గానం



దళిత గానం
అన్న అన్న మా అన్న , ఓ దళితన్న
గోంతేత్తినే పాడుతూనే , మనసు విప్పి వినమన్న ,
కంచికచర్లలో కోటెశువు అయినావు,
నీరుకోండలో నిలువేల్ల మాడావుమాడావు ,
పదిరికుప్పంలోన పోదిలి పోదిలి ఏడ్చావు , 
న్యాయం జరగాలని కోర్టుల చుట్టూ తిరిగావు ,
కోర్టులకేక్కి ఏక్కి ఏక్కి ఏడ్చావు , 
దండాలు పేట్టావు , దయ చూడమన్నావు , 
ఏన్నాళ్ళు ఏడ్చిన , ఏన్ని తిప్పలు బడ్డ , 
కోర్టుల న్యాయం నీకు కనికరించదు అన్న ,
తోడేళ్ళు మేకలకు తోడు రావు అన్న ,
జిల్లేడూ పోదలకేమో మల్లిపూలు పూయవన్న , 
ఏ ఇతర కులమైన మోసం చేస్తారు అని , 
మన కులపోడు అయితే మనకు మేలు చేస్తాడూ అని ,,,,
దళితనేత్తురున్న దళితపులిని నేను అన్నావుఅన్నావు , 
మైకులు అదిరేలా మాయామాటలు ఏన్నో చేబుతారు, 
భూస్వాములందరిని ఓడిస్తానంటావు , 
పదండి పోదామంటే తోదరోద్దంతావు , 
తేగించి పోరాడెవాళ్ళు తేగబడి ఖతం చేస్తే , 
ఘోరం ఘోరం అని గుండేబాదుకుంటావు , 
రాష్ట్రంలో దేశంలో తేగ భాదలు పడే జనం , 
నువు ఓక్కడీవే కాదు , చాలమంది వున్నారు , 
దోరల దోపిడికి గురుఅవుతున్నారు , 
అందరి భాదలకు కారణం ఓక్కటే , 
వాళ్ళే భూస్వాములు , దళారీలోళ్ళు , 
మనమంత కట్టూగావుంటే వాడి ఆట కట్టూ అన్న , 
కులం కులం అని ఓటరివి కామాకు అన్న , 
పదిమంది నడిస్తేనే పడుతుంది బాట అన్న , 
బాబా సాహేబ్ అలోచన విధానాన్ని,
పల్లే , పల్లేకు తీసుకుపోదాము అన్న ,
ఆయన కన్న కలల సమాజానికి కట్టుబడీ వుందాము అన్న, 
అన్న అన్న మా అన్న దళీతన్న , 
గోంతేత్తి పాడూతున్న మనసు విప్పి వినమన్న.....



జోహార్ బాబా సాహేబ్ అంబేడ్కర్
అందుకో దండాలు బాబా సాహేబ్ అంబేడ్కరా ,
అంబరానా ఉన్నట్టి చుక్కలు గురవంగో ,
ముందుగా నిను తలచి పాటలు పాదేము , 
నీ తల్లి భీమాబాయి , 
నీ తండ్రి రాంజీ , 
నీ ఊరు అంబవాడ , 
నీ జిల్లా రత్నగిరి , 
ఏప్రిల్ 14 నీ పుట్టిన రోజంటా ,
దళిత జాతి పీడితులకు పండుగ రోజంటా ,
మనుస్మ్రుథిని తగులబేట్టి , 
మనువాదాన్ని మంటగలిపి ,
కుల రక్కసి విషపు కోరలపై , 
నీవు జరిపిన పోరాటం..చిరస్మరణీయం..
-
అందుకోండి మా విప్లవ నీరాజనాలు...!!!



దళిత పాటలు
Dec-06 , బాబా నీ నామాస్మరణలో ,,,, భారతావని ఓడిలో ,,,
బాబా నీకు వందనం ,
సాహేబా నీకు వందనం ,
మల్లేపూల వందనం ,
మరువలెము ఏక్షణం ,
            “ బాబా నీకు వందనం “
అసమానతను ఏదిరించి
అమ్మ ప్రేమను పంచి
అవనిలోని జ్నానమంత
అనువనువును గాలించి ,
జాతిని బ్రతికించిన్నట్టి ,
నీతిని అందించినట్టి ,
                 “ బాబా నీకు వందనం “
మనువాదుల మేడలు వంచి ,
మానవతను ప్రజలకు పంచి ,
ప్రపంచాన్ని రంగరించి ,
రాజ్యాంగం అందించి ,
హక్కులను ఇఛినట్టి ,
అడిగే స్వేఛను తేఛినట్టి ,
                 “ బాబా నీకు వందనం “
బాబా నీకు వందనం ,
సాహేబా నీకు వందనం ,
మల్లేపూల వందనం ,
మరువలేము ఏక్షణం....

                   “ 14th  april 1891-06th december 1956 “


                ఇట్లు 
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment