Monday 20 April 2015

పంచముల చరిత్ర : 1 వ భాగం




      పంచముల చరిత్ర : 1 వ భాగం
భారత దేశం లో షుమారు ఐదు లక్షల ఏళ్ళ క్రితం నుండి ఆదిమ మానవులు నివసించారు. కాని, నిర్మాణాత్మక రూపములో చరిత్ర మనకు 3000బి.సి. లో నెలకొని ఉన్న సింధూ నాగరికత నుండి మాత్రమే లభ్యమైంది. ఉత్తరాన పంజాబ్, దక్షిణాన గుజరాత్, పడమరన పాకిస్థాన్, తుర్పున ఉత్తరప్రదేష్ (మీరట్) వరకు ఈ సింధూ నాగరికత కలిగిన ప్రాంతం గా గుర్తించవచ్చు.

* ఈ కాలములో, ప్రజల దేవుళ్ళుపశుపతి, అమ్మతల్లిగా పిలవబడేవారు. విరి ప్రతిమలు శివుని పోలికలున్నాయి.

* ఇదే సమయం లో మిగతా భారత దేశం లో, ఆయా ప్రాంతాలలో, ప్రాంత ప్రజలు నివసించారు.వీరిని, ఆ ప్రాంత మూల వాసులుగా చరిత్ర గుర్తించింది.

* ఆఫ్ఘనిస్థాన్ ఆవతల ఉన్న మద్య ఆసియా లో ఉన్న ఆర్యులు 2000 బి.సి కాలములో,పైన చెప్పబడిన సింధూ ప్రాంతంలోకి ప్రవేశించారు. దీనితో వైదిక సాహిత్యం, వేదాలు, ఊపనిషత్తులు అందులో నెలకొని ఉన్న జీవన విధి విధానాలతో ప్రజా వ్యవస్థ సాగించబడేది.

* ఋగ్వేద పదో పుస్తకంలో సమాజంలోని ప్రజలు బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య,శూద్ర అనే చతుర్వర్ణ విభజన జరిగినట్లు స్పష్టంగా పేర్కొనబడినది.ఇందులో, ఏ వర్ణం లో కూడా స్థానం నోచుకోని వ్యకులను పంచములు లేదా చండాలులు అని పేర్కొనడమైనది.

* మన దైనందిన భాషలో చెప్పాలంటే, శూద్రులు అంటే కమ్మ,రెడ్డి,కాపు,సాలి,గౌడ,చాకలి,మంగలి మొ11.చండాలులు అంటే, మాల,మాదిగ,మాతంగి,చమర్, పాకి, మెహర్,రెల్లి మొ11.

*
అయితే,సింధు నాగరికత, ఆర్య సంస్కృతి కి వెయ్యేళ్ళు ముందే జరిగినట్లుగా చెప్పబడుతున్న మహాభారత,రామాయణముల లో నే, ఈ విభజన మరియు చెండాలుల ప్రస్తావన అనేక సార్లు ఉన్నది కావున,పుట్టుక తో వచ్చే కులం, దాని తాలుక వివక్ష అనేది షుమారు 4000బి.సి. నుండే ఉన్నదని నిర్ధారించవచ్చు.

*రామాయణం లో వశిష్ఠుని శాపానికి గురైన అయోధ్యను పరిపాలించిన ఇక్ష్వాకు రాజు త్రిశంకుడు చెండాలడవుతాడు. త్రిశంకుడు చేసిన తప్పు ఏమంటే, ఊపిరి ఉండగానే స్వర్గానికి చేరాలని ఒక యాగం చెయ్యటం, ఇది వశిష్ఠుని కుమారులకు నచ్చకపోవటం..అలాగె, విశ్వామిత్రుని శాపానికి గురైన వశిష్ఠుని కుమారులు చెండాలులవుతారు.

*వాల్మికి రామాయణం లో శంబుకుడి కధ ద్వార, శూద్ర ఉనికి, వివక్ష ఎంతో చక్కగా చెప్పబడింది.ఇంకా, రాముడు ఒక చాకలి మాటలు వినే, సీత ను అడవికి పంపినట్లు చూస్తున్నాము.వాలి,సుగ్రీవుడు,హనుమంతుడు,తాటకి,సూర్పణక,రావణుడు అందరూ శూద్ర వంశస్థులే.

*మహాభారతం లో శాంతిపర్వం లో చండాలుల జీవన శైలి గురించి చాల విపులీకరించి చెప్పబడినది.కృష్ణుడు గొల్ల వాని ఇంట్లో పెరగటం బట్టి చూస్తే, కుల ప్రస్తావన, వివక్ష అనాటి నుండే ఉన్నదని చెప్పవచ్చు.
*దీన్నిబట్టి చుస్తే, వశిష్ఠుడు,విశ్వామిత్రుడు వైగైరా మునులకు ఏ మాత్రం చిన్న కోపం వచ్చినా, అవతలి వాళ్ళు వందల తరాల వరకు చండాలులు, పంచములు అయిపోవాల్సిందే. ఇలా పుట్టిన,ఈ చండాలులు,పంచములు ఆ తరువాతి కాలము [ ఆర్య సంస్కృతి ]లో చతుర్వర్ణ వ్యవస్థ రూపము లో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుచూ వచ్చినది.
* ఇక్కడ, ఇంకో ముఖ్యమైన విషయం: రామాయణ కాలము నుండి సింధూ నాగరికత కాలము వరకు, క్షత్రియ రాజుని కాదని,ఆర్యుల ఆధిపత్యాన్ని కాదని ఎదురు తిరిగిన ప్రతి రాజుని, చక్రవర్తిని [ దేశములో ఎక్కడైనా] సంహరించి, వారి మిగతా సంతతిని, “శూద్రులుఅని ముద్ర వేసి, వారిని సమాజములోకి వదిలేసారు.ఈ సంధర్భములో, సదరు ఆర్య,వైశ్య,క్షత్రియ ఆధిపత్యాని బాగా తీవ్రంగా ధిక్కరించిన వాళ్ళని అతి శూద్రులులేదపంచములులెద చండాలులుఅని ముద్ర వేసి అంటరాని వాళ్ళని చేసి వారికి తరతరాలైనా పరిష్కారం గాని అతి దారుణమైన శిక్ష ను [ జీవిత ఖైదు కన్నా దారుణమైన ] విధించారు.

* ఇలా, శూద్రులు,పంచములు తయారయ్యారు.  ( రాజు పాగోలు )

                                      ఇట్లు
                   మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

6 comments:

  1. నాయన.... చివరి వాక్యం ద్వారా మీరు వొప్పుకున్నా నిజం శూద్రులు పంచములు అయ్యారు అని...... మరి ఇప్పుడు శూద్రులు ఎవరు పంచములు ఎవరు ? కనుక.... మీకు ఎవరు పంచములు అని ఎవరు కితాబు ఇవ్వలేదు.... మన వృత్తిని బట్టి వ్యాపరులా ? ఉద్యోగులా అనేది ముఖ్యం... అంతేగాని ఇలా మీకు మీరే చండాలులు అని దూరం అవకండి...

    ReplyDelete
  2. అన్న జైబీమ్ నా పేరు ప్రభాకర్ నేను మీతో కలిసి పని చెస్తాను మీ కిష్ఠమైతే ఇది నా పొన్ నా నెంబర్ 9985857095,,7013746273 పొన్ చెయండి

    ReplyDelete