Monday 20 April 2015

భారతీయ బౌద్ద మహసభ





                                  భారతీయ బౌద్దమహాసభ;

భారతదేశంలో కులము అనునది హిందువులకు ప్రాణతుల్యము ,ఈ దుష్టమైన కుల వ్వవస్త ఒక్క హిందూ సమాజమునే కాకుండా మొత్తం భారతీయ వాతావరణమును కలుషితం చేసింది, ఈదేశంలో పుట్టుకతోనే కులం ఆధారంగా కొందరికి గౌరవాలు, అధికారులు దక్కుతుంటే , మరికొందరు అవమానాలు, అత్యాచారాలు, నగ్న ఊరేగింపులు......మొద.అనుభవిస్తున్నారు.కులం అడ్డు గోడలు మానవవీయ విలువల్నీ ధ్వంసం చేస్తున్నాయి.వాటిని తివ్రతరం చేస్తు ఈ దేశంలో హిందూ మతం బలపడుతున్నది.అనాదిగా ఆర్థిక, సామాజిక దోపిడీ, అణిచివేతలకు గురై బడికి, కూటికి , గూటికి దురమై అంటరానితనముతో పెనవేసుకున్న వేసుకొని, ప్రాణాలతో మాత్రమే మీగిలి ఉన్న దలితులు ఈ సమాజంలో కనీసం మనిషిగా గుర్తింపు పొందడం కోసం ఎం చెయ్యాలి....?
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అనుభవపూర్వకంగా తెల్సుకున్నారు , మనం హిందుమతములో ఎన్ని యుగాలూ ఉన్నప్పటికీ మన స్థితి గతులు మారవు ఎందుకంటే హిందూ మతం వ్వక్తికి ప్రాధాన్యత ఇచ్చే మతం కాదు అది జాతి మరియు వర్గ ప్రాధాన్యత ఇచ్చే మతము.హిందుమతములో వ్వక్తి వికాసానికి అవకాశాలు లేవు అందుకే డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు 13 అక్టోబర్ 1935 ఎవూలా సభలో సింహా గర్జన చేయడం జరిగింది " నేను హిందూ ధర్మం లో పుట్టాను ఇది నా చేతిలో లేదు కాని నేను హిందూ ధర్మం లో మరణించను"ఈ దిశలోనే ప్రయాణిస్తూ 14 అక్టోబర్ 1956 అశోక విజయ దశిమి రోజున 6లక్షల మంది అనుయాయులతో బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించారు.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 15 ఆగస్టు 1947రోజు కాని అప్పుడు మనం మానసికదాస్యం, అంటరానితనం , కుల వివక్ష నుండీ విముక్తి పోందలేదు.మనకు వూర్తిగా మానసిక స్వాతంత్ర్యం వచ్చింది 14/10/1956. రోజు కాని ఆ నాటి మహోన్నతమయిన ధమ్మ క్రాంతిని నేడు గొప్ప అంబేడ్కర్ వాదులం అని చెప్పుకుంటున్న కొందరు మేధావులు బౌద్ధ ధమ్మాన్ని ఎందుకు స్వీకరించడం లేదు...? వారిని అనుసరించే వారి అనుచరులు ఎలాంటి సంకెతాల్ని గ్రహించాలి....?
భౌతిక సుఖాలను వెంబడిస్తూ మనము ఈ రోజు సామాజిక బాధ్యత మానవ విలవలన్నింటిని మరిచి వ్వక్తిగత స్వార్థాలకే పరిమితమైపోయం.డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి అకుంఠితమైన దీక్ష, పట్టుదల, త్యాగముతో సాధించిన విజయ పుణ్యముతో మనం గొప్ప గొప్ప చదువులు చదవి ఉద్యోగాలలో , అధికారలలో వచ్చాం , వస్తుందనే ఉన్నాం చాలా సంతోషం కాని మనం మన గత చరిత్ర ను మరచి మన సమాజము పట్ల మనవంతు కనీస బాధ్యతను విష్మరించాం.
ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోక తప్పదు...మనం డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని పూర్తిగా అంగీకరించలేదు .కొందరు రిజర్వేషన్ లాభాలకొరకైతే , కొందరు ఉద్యోగాలలో ప్రమోషన్ పొందే వరకు మాత్రమే అంబేడ్కర్ అంటున్నాం.ఇది నిజం అలా కానిచో ఇంతమంది దిగ్గజాలయిన అంబేడ్కర్ అనుయాయులం దేశమంతటా ఉండి బాబాసాహెబ్ కనిన కలల పూర్తి కోసం 60సంవత్సరాలు పూర్తి అయిన సరిపడడంలేదు ఎందుకు ? భర్త ఒక మతమైతే భార్య ఒక మతం ,భార్య భర్తలు ఒకమతమైతే పిల్లలు మరోకమతం ఈ విధంగా బౌద్ధ ధమ్మం పట్ల మరియు సిద్ధాంతం పట్ల మన ఆచరణ కొనసాగుతోంది.అందుకే మన పరిస్థితి తిరిగి అధేవిదంగా ఉంది.
దేశమంతటా మన సమాజము మీదా జరిగే అమానుషమైన దాడులు, అన్యాయాలు , అత్యాచారాలు, దౌర్జన్యాలు, అరచకాలు చూస్తుంటే రాజ్యాంగములో పొందుపర్చిన జీవించే హక్కు ను కూడా పోగొట్టుకుఉన్నాము అనిపిస్తుంది.
సహచరులారా ! బాబాసాహెబ్ అంబేడ్కర్ 57 సం,,ల ముందు "ధర్మపరివర్తన" చేశాడు .
కాని ఏ లక్ష్యాం కోరకు చేశాడు అనే విషయంలో మాత్రం మన ప్రజల మానసిక జాగరణ జరుగలేదు.
ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేదావులుగా మనం ప్రయత్నం చేయలేదు.
మేధావి వర్గాలు ఈ ప్రయత్నం చేయవలసి వుండే కాని చేయలేదు.
నేను "నిస్సహయత" తో విధిలేని పరిస్థితిలో ఈ పని చేస్తున్నాను .
నేను వ్యక్తిగతంగా "బుద్దిస్టు"డను కాని స్వేచ్చా , స్వతంత్రం , సమానత్వం , సౌభ్రాతృత్వము , సోదర భావం , సమ న్యాయముతో కూడన సమాజ నిర్మాణం కోరకు జరుగుతున్నా దేశవ్యాప్త మూలవాసుల ప్రజా ఉద్యమ నిర్మాణంలో నేను ఒక ప్రచారకుడను .
నేను ఈ ఉద్యమ లక్ష్యం కొరకు పని చేస్తున్నాను.
వీరికి ఉద్యమ లక్ష్యం కొరకు శిక్షణ ఇస్తున్నాము.
ఈ... లక్ష్యం కొరకు అందరము కలసి పని పనిచేస్తున్నాము .
కాబట్టి సహచరులారా..!
బుద్దుడు తన లక్ష్యం కొరకు ఏ ప్రణాళికనైతే తయారు చేసి ఉద్యమించాడో అ లక్ష్యం కొరకు మనము ఉద్యమిస్తన్నాము.
బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు కూడా ఈ లక్ష్యం కొరకు మాత్రమే ఉద్యమం చేశాడు.

మనకు మన స్వంత ఉద్యమం అంటూ ఏదీ లేదు.



ఇట్లు 
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు


No comments:

Post a Comment