Monday 20 April 2015

దళిత మిత్రులారా మన అస్తిత్వం

దళిత మిత్రులారా మన అస్తిత్వం
ఒక అగ్రకుల రాజకీయ నాయకుని మాయలో పడి మన మాదిగ సోదరులు రాజ్యాంగ విరుద్దమైన వర్గీకరణ కోరుతున్నారు.ఒకవేళ వర్గీకరణ జరిగితే కొన్ని రోజుల తరువాత మాదిగ ఉపకులాల నుండి ఎవరో ఒకరు ఉన్న రిజర్వేషన్ మెత్తం మాదిగలే వాడుకుంటున్నారు, మేము వారితో పోటి పడి చదవలేము, ఉద్యోగాలు సంపాదించలేము కాబట్టి ఉన్న రిజర్వేషన్ ను వర్గీకరించి మాకే ఎక్కువ భాగం ఇవ్వండి అని మన మాదిగ సోదరులు ఇప్పుడు అడుగుతున్నట్టు రేపు వారు కూడ అడుగుతారు.
ఈవిధంగా దలితులంతా వర్గీకరణ పేరుతో ముక్కలు ఐతే మరల మనం అందరం మూతికి ముంతలు,ముడ్డికి చీపుర్లు కట్టుకుని తిరిగే పరిస్థితి వస్తుంది.
మహానుబావుడు భారతరత్న డా"బి.ఆర్.అంభేద్కర్ గారు మనలను ఏ బందనాల నుండి విముక్తుల్ని చేశారో అదే ఊబిలోకి మళ్ళీ వెళ్ళిపోతాము.
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని రోజులైనా దళితుల జీవితాల్లో మార్పు లేదు.
ఐక్యమత్యమే మహాబలం...ఆ బలంతోనే దలితులు అందరం కలసి మహానుభావుడు అంభేద్కర్ గారి ఆశయమైన రాజ్యాధికారం సాధిద్దాం.
జై భీమ్ జైజై భీమ్



దళితం అనే పదం నిషేదించడమైనది:


 దళిత్ అనే పదం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన ఏ ఉపన్యాసంలోను ఉపయోగించ లేదు. తన ఏ గ్రంతంలోను తన ఏ రచనలోను వాడలేదు. మరి మనం ఎందుకు ఈ దళిత అనే పదం వాడుతున్నాం. రాజ్యాంగంలో కూడా దళిత అనే పదం ఉపయోగించ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు Scheduled Castes, depressed classes, oppressed classes, untouchables, bahishkruth అనే పదాలను ఉపయోగించారు. మనం దళిత అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. దళిత అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా మనం మైనారిటీ లో పడిపోతున్నాం. మనకు రాజ్యాది కారాన్ని. సాధించాలంటే ప్రపంచంలో ని ఏ దేశంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా మైనారిటీ లో పడిపోయి రాజ్యాధికారాన్ని సాధించలేము. అంటే కాదు మన మహా పురుషులైన బుద్దుడు కూడా బహుజన అనే పదాన్ని ఉపయోగించారు. కన్శిరాం గారు కూడా అదే పదాన్ని ఉపయోగించారు. దళిత్ అనే పదం మనల్ని మెజారిటి ప్రజల నుండి విడదీస్తుంది. 3% ఉన్న బ్రాహ్మడు రాజకీయం కోసం తనని తానూ హిందూ అని చెప్పుకొని మెజారిటి లో కన్వర్ట్ అవుతుంటే 25% SC, 7% ST, 52% OBC, 12% Minority కలిసి కులాల పెరుతోని మతాల పెరుతోని విడిపోయి ఉన్నాం అందుకే ఈనాడు మనం ఉపయోగించే పదం మూలవసులం బ్రాహ్మణా వాదాన్ని మననుంచి విడదీసే పదం మూలవాసి అందుకే దయ చేసి దళితులం అనే పదం ఉపయోగించరాదు మనల్ని మనం మైనారిటీ గా మర్చుకోవద్దు.


        ఇట్లు 
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment