Wednesday 2 September 2015

సామాజిక తత్వం-డా.అంబేడ్కర్

సామాజిక తత్వం-డా.అంబేడ్కర్


                               
                       తాత్విక చింతన అనేది “ ఏ విషయాన్నైనా కూలంకషంగా ఆలొచించి నిర్ధారించేందుకు పట్టుదలగా సాగే క్రుషి “.అందువలన తాత్విక చింతనను సామాజిక , రాజకీయ తాత్విక చింతనలు మొదలైన విభాగాలుగా చూడడం , విభజించడం సాధ్యం కాదు.ఏదైనా ఒక అంశం అర్ధ్హవంతమైనది అని స్వయంగా నిర్ధారణ చేసుకోవడానికి వీలుగా ఆలోచనా పరులైనవారు తమ జీవితాలను బౌద్ధిక పరమైన క్రమశిక్షణలో పేట్టుకోవలసిన అవసరం నుండే ఈ తాత్విక చింతన పుట్టుకోస్తుంది.తాత్విక చింతన ఏప్పుడు పరిపూర్ణమైనదిగా ఉండాలి.మానవ జీవితాలలోని ప్రతి అంశాన్ని అందుకు సంభంధించిన ప్రతి ఆలోచనను పరిగణనలోకి తీసుకోవాలి.
అందువల్ల ఏ సామాజిక తత్విక చింతన అయినా తప్పనిసరిగా “ సమాజ స్వభావాన్ని , సమాజ అస్తిత్వాన్ని నిర్దేశించే సూత్రాలను , సామాజిక జీవనాన్నీ, కార్యచరణను విశ్లేషించేందుకు ప్రయత్నం కేస్తూ సమాజాన్నీమొత్తం పరిశోధించేదిగా వుండాలి.యావత్ సామాజిక జీవనానికి మనిషే మూలం.అన్ని సామాజిక కార్యకలాపాలు మనిషి వల్లనే ఆరంభమవుతాయి.అతడికి తనవైనా లక్ష్యాలు , విలువలు ఉన్నాయి.మానవజీవనానికి అంతిమగమ్యం ఏమిటనేది కనుగోనడమే సామాజిక తాత్విక చింతన ధ్యేయం , కర్తవ్యం.భారతీయ సామాజిక నేపథ్యంలో డా.అంబేడ్కర్ గారు ఈ లక్ష్యాఅధనకి పూనుకున్నారు.


                                 
                         తీక్షణమైన బుద్ది , ఆమాజిక నాడిని పసిగట్టే నేర్పు గల అంబేడ్కర్ గారు సాంప్రదాయాలకి కట్టుబడి  , చాంధస భావాలను , మార్పుకంగీకరించని నైజాన్ని కలిగిన హైందవ సామాజిక వ్యవస్థను లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశారు.అంటరానివారిని నిరాశ , నిశ్ప్రుహలుముప్పిరిగోనే దుస్థితికి నెట్టిన హైందవ సామాజిక వ్యవస్థ, మతాచారాలు అమానుషం , అశాస్త్రీయం , నిర్హేతుకమని అంబేడ్కర్ గారు విమర్శించారు.తత్ఫలితంగానే అంటరానివారు , అణగారినవారు , అసంఘటిత ,బీద ప్రజలుగా మిగిలిపోయారు.ఈ పరిస్థితులే డా.అంబేడ్కర్ క్రూరమైన , అంటరానితనం , ఆవిర్భవానికి , అభివ్రుద్దికి కల చారిత్రక ఆధారాలను కనుగోనేందుకు , కుల వ్యవస్థ గురించి , శూద్రుల గురించి పరిశోధింక్చేందుకు ప్రేరేపించాయి.

                               సామాజికంగా తమకుగల థాన బలంతో క్రూరమైనవీ ,అశాస్త్రీయతతో నిర్హేతుకమైనవి , నమ్మశక్యం కానివి ,ఆమాజిక మతాచారాలను రూపోంధించి , షేడ్యూల్డ్ కులాల వారి సామాజిక , ఆర్ధిక , సాంస్క్రుతిక జీవనంపై అమానుషంగా దాడిచేసిన అగ్రవర్ణ హైందవ తత్వవేత్తల కుట్రలను ,నయవంచనను ఆయన సరిగా గుర్తించగలిగారు.వీరివల్లనే అంటరానివారు యుగయుగాలుగా హైందవ సామాజిక జీవనంలో అణచివేతకు గురి అవుతూ వఛారు.అసంఘటిత వర్గంగా , బీధలుగా మిగిలిపోయి దారితోచక కొట్టు మిట్టాడుతున్నారు.బహుహ ఇందువల్లనే డా.అంబేడ్కర్ గారు శూద్రులపైన అస్ప్రుశ్యతలపైన , కుల వ్యవస్థపైన కొన్ని గ్రంధాలు రాశారు.ఆయన చేప్పిన కొన్ని ముఖ్య అంశాలు :
1.భారతదేషంలోను కులం ఆవిర్భావం , అభివ్రుద్ది , పనిచేసే తీరు.
2.కుల నిర్మూలన
3.శూద్రులెవరు ??భారతీయ –ఆర్య సమాజంలో వారు చతుర్ద వర్ణస్తులెందుకయ్యారు.
4.అంటరానివారు ఏవరు ?వారు ంటరాని వారు ఏందుకయ్యారు ??
5.బుద్దుడు-ఆయన ధమ్మ ప్రబోధం.
డా.అంబేడ్కర్ అభిప్రాయాలు ఎంత సమంజామైనవి , చరిత్ర బద్దమైనవి , ఎంత కాలనుగుణమైనవి అనేది తెలుసుకోవాలంటే ఆయన ప్రతిపాధింఛిన సిద్దాంతాలను అధ్యయనం చేయడం తప్పనిసరి...!!

ఇట్లు

వలపర్ల సన్ని మహర్ 

Monday 31 August 2015

భారతదేశంలో కులం-డా.అంబేడ్కర్

భారతదేశంలో కులం-డా.అంబేడ్కర్




                           భారతదేశంలో కులం అనేది పుట్టి ఏరగడానికి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రధాన కారణం అంటారు డా.అంబేడ్కర్ గారు.తోలుత ఉన్న నాలుగు వర్ణాలు కాలక్రమేణా 400 కులాలు , ఉఒఅకులాలుగా విడిపోయాయి.కులవ్యవస్థను కూకటివేళ్ళతో పెళ్ళగించి నిర్మూలించాలని ఆయన ఆశించారు.భారతద్దేశంలో సామాజిక అస్థవ్యస్థకి ముఖ్య కారణం ఈ కులమే.భారత సామాజిక వ్యవస్థ పునాదినే కులం బలహీన పరిచింది. ఏ కులానికాకులం ఒక ప్రత్యేక విభాగం.అందువల్ల ప్రతి కులంలోను కోన్ని భయాలు , నిషేధాధాలు . తత్ఫలితంగా ఇతరులతో కలవకుండా విడివిడిగా ఉండడం అనే లక్షణాలు కోకోల్లలుగా ఉన్నాయి.భారతదేశంలొ కులం , సమాజంలొని విభిన్న వర్గాల మధ్య పరస్పర సంభంధాలను పెంపోంధించలెక పొగా భిన్న వర్గాల ప్రజల మధ్య ద్వేషం , అసూయ , తిరస్కారం వంటి భావనలు ప్రేరేపించాయి.
                                   
                                అశాస్త్రీయం , అసంబద్దం , తర్కవిరుద్దం అయినవి , నమ్మశక్యం కానివి , ప్రచార6లోనికి తేఛిన హిందూ పురాణాలు , ఇతిహాసాలు , మానవ చరిత్రకు ముఖ్యంగా నిమ్న జాతులకు తీరని అఒఅకారం చేశాయి.హిందు పురాణ కర్తలే ఈ కులాల స్రుష్టికర్తలని డా.అంబేడ్కర్ గారి అభిప్రాయం.వారే క్రుత్రిమ సంస్థలను రూపోంధించారు.హిందు సాహిత్యం ,అంతా వంశ వ్రుక్షాల వర్ణనలతో నిండి ఉంటుంది అగ్రవర్ణాల వారు ఉన్నత వంశాలకు చెందిన వారని నిరూపించే ప్రయత్నం అది.బ్రాహణ సాహిత్యం కింది కులాలను ఉద్దేశ్యపూరకంగా అదుపులోను , పేదరికంలోను ఉంచడం వల్లనే హిందువులు తమ సామాజిక అంతస్థులకు భంగం రాకుండా కాపాడుకున్నారు.హైందత్వపు నీడనే ఉంటూ అగ్రవర్ణాలవారి సాంస్క్రుతిక  స్థయికి ఎదగకుండా చూసెందుకు , హిందువులు కావాలనే నిమ్నకులాలను నాశనం చేశారు.
                           

                             భారతదేశంలో కులం సామాజిక సంభంధాలను చేడగోట్టింది.షేడ్యూల్డ్ కులాల వారు మనుషుకు కాదన్నంతటి నిక్రుష్ణ స్థితికి దిగజార్చింది.కింది కులాల వారిని దోపిడి చేసేందుకు కులం అగ్రవర్ణాల వారి చేతిలో బ్రహ్మస్త్రం అయింది. అగ్రవర్ణాలకి చేందిన మేధావులకి కుతంత్రం వలన భారతదేశంలో నీతికి నీడ లేకుండా పోయింది.కులం ప్రజాసేవ ద్రుక్పథాన్ని చంపేసింది.ధర్మకార్యాలు చేయాలనే భావనను నాశనం చేసింది.ప్రజాభిప్రాయం అనేదానికి తావు లేకుండా పోయింది.హిందువు ద్రుష్టిలో ప్రజలంటే తన కులం మాత్రమే .తన కులాఅనికి మాత్రమే తను విధేయుడిగా బాధ్యత వహిస్తాడు.సవర్ణుడైన ప్రతి హిందువు తీవ్రమైన కులాభిమాని.తనకులం కోసం దేనికైనా తెగిస్తాడు.బ్రాహణమత , సామాజిక విలువలు మానవత్వం , సౌబ్రాతత్వం , సమానత్వం , న్యాయాలకు వ్యతిరేఖతను ప్రబోధిస్తాయి.డా.అంబేడ్కర్ గారు ఏమంటారో చూడండి.


అసహాయులైన వారిని దోపిడి చేసే6దుకు కులం ఎప్పుడూ పోంచి ఉంటుంది.ఆచారపరులైన హిందువులంచేతిలో ఆయుధం కులం.సంస్కరణలను భ్రష్టు చేయడానికి  , సంస్కర్ణలను భాధించేంధుకు పనికోఛే శక్తి మతం.

ఇట్లు

వలపర్ల సన్ని మహర్

అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్

  1. అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్




అంటరానితనం అనేది ఏలా పుట్టీంది అనే అంశంపై సామాజిక మ్శాస్త్రజ్నులు చరిత్రకారులు , పురాణాలలో దిట్టలైన వారిలో పాతతరం వారు కాని , ఆధునుకులు గాని ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.ఈ విషయంలో ఏన్నో వివధాలు , అసందిగ్ఠత అభిప్రాయ బేధాలువక్రీకరణలు చోటు చేసుకున్నాయి.అంటరానితనం మూలం ఏక్కడ అనేది తేలుసుకునేందుకు శాశ్త్రవేత్తలు , చ్రిత్రకారులు , ఇంకా వేతుకుతూనే ఉన్నారు.హైందవ పురాణ గాధల్లోను , బ్రహ్మణ సాహిత్యంలోను చతుర్వార్ణాల ప్రస్తావన మాత్రమే ఉంది.
పంచమ వర్ణంగా విభజించబడిన అంటరానితనం ప్రస్తావన ఎక్కాడా లేదు.అంటరాని వారు “ అవర్ణులు “ ( వర్ణం లేని వారు ) గా పరిగణించబడి “అంత్యవాసులు ( చివరకు ఉండేవారు ) అయ్యారు.అంటరానితనం ఆవిర్భావానికి సంభంధించిన సిద్దాంతంలో చారిత్రక , మనోవైజ్నానిక అంశాలను అవగాహన న్చేవుకోనేందుకు డ.అంబేడ్కర్ గారు కింది వివరణలను ఇఛారు.
1.హిందువులు , అశ్ప్రుశ్యులు , మధ్య జాతి బేధం లేదు.
2.అంటరానితనం ఏర్పడకముందు హిందువులకు , అంటరానివారికి మధ్య తేడా ఒక తెగ లోని వారికి తెగ నుండి విడిపోయిన వ్యక్తులకి ( Broken Man ) మధ్య ఉండే తేడా వంటీదే.ఈవిడిపోయిన వ్యక్తులే తరువాత అశ్ప్రుశ్యులు అయ్యారు.
3.అంటరానితనానికి జాతి ప్తాతిపదికన కానట్లే వ్రుత్తి కూడ ప్రాతిపదికన కాదు.
4.అంటరానితనం ఎర్పడడానికి 2 మూలాలు ఉన్నాయి.
(అ) విడగోట్టబడిన వ్యక్తులు  ( విశీర్ణ మానవులు లేదా బ్రోకేన్ మేన్ ) బౌద్దులు అన్న అనుమానంతో బ్రాహ్మణులకి వారిపట్ల కసి , ఎవగింపు.
(ఆ) ఇతరులు ఎన్నడో మానివేసిన విడిపోయి మనుషులు గోడ్డుమాంసం తినే అలవాటు మానకపోవడం.
5.అంటరానితనానికి మూలమేక్కడొ కనుగోనేటప్పుడు “ అంటరానివారికి “ అపరిశుద్దులకు మధ్య తేడా ఏమిటో తేలిసి ఉండాలి.సాంప్రదాయమైన హిందు రచయితలంతా అపరిశుద్దులు.అందరిని అంటరాని వారిగా గుర్తించారు.ఇది పొరపటు.అంటరానివారు వేరు , అపరిశుద్దులు వేరు.
6.ధర్మసూత్రాలు రూపోదిన కాలంలో అపరిశుద్దులు ఒక వర్గంగా రూపోందించారు.అంటరానివారు ఆ తరువాత  కాలంలో ( కీ.శ.400 ) ఆవిర్భవించారు.

                           డా.అంబేడ్కర్ గారు గోవధకి , అంటరానితనానికి సంభంధం ఉందని అంటారు/కీ.శ.4ఊ నడు గుప్తుల కాలంలో గోవధకు దండన మరణశిక్ష. ఆ విధంగా పశుమాంసం తినే శూద్రులు అపరిశుద్దులే కాదు అంటరానివారు కూడ అయ్యారు.అంటరానితనం గుర్తించి ముక్తాయింపుగా  అంబేడ్కర్ గారు ఇలా అన్నాడు “ అంటరానితనం “ ఇంచుమించుగా కీ.శ,400 కాలంలో ఎర్పడి ఉంటుంది అని మనం నమ్మవఛు.భారతదేశ  చరిత్రనే పూర్తిగా మార్చివేసింది.అయినా దీనిని చరిత్ర విధ్యార్ధులు తగిన శ్రద్దతో అధ్యయనం చేయక నిర్లక్ష్యం చేస్తునారు.
    ఇట్లు
వలపర్ల సన్ని మహర్


Monday 11 May 2015

బౌద్దం-ధర్మం



                                        బౌద్దం-ధర్మం
                                   ఒకప్పుడు భౌద్ద భారతంగా పేరోందిన భారతదేశం 14 వ శతాబ్ధంలో భౌద్దం దేశం నుండి నిష్క్రమించడంతో అది హిందు దేశంగా మారింది.భారతీయ హన జీవితంలో బౌద్దం అంతర్వాహినిగా ప్రవహిస్తున్నా పైకి మాత్రం నామరూపాలు లేకుండా పోయింది.మళ్ళీ 1891వ సంవత్సరంలో అనగారికి దమ్మపాల గారు మనదేశంలో మహాబోధి సోసైటీని కలకత్తాలో స్థాపించడంతో బౌద్ద పునురుత్తాన మహాయజ్ణం ప్రారంభమైంది.ఆ తరువాత ఎంతోమంది ముఖ్యంగా రాహుల సాంక్రుత్యాన్ , జగదీష్ కాశ్యప , ఆనంద కౌశల్యాయన , లక్ష్మీ నరసు వంటి వారు క్రుషి చేయగా ఆ క్రుషి అభినవ    “ బుద్దుండంబేడ్కరుడు నాగపూర్ దీక్షా భూమిలో 1956 వ సంవత్సరంలో అక్టోబరు 14 వ “ తేదీన ఒకే వేధికపై . ఒకే రోజున , ఒకేసారి 10 లక్షల మందితో బౌద్ద దీక్షను తీసుకోవడంతో పరాకాష్టకు చేరింది.ఇటువంటి ఘటన ప్రపంచంలో ఏప్పుడు , ఏక్కడ కూడ జరగలేదు , ముందు ముందు కూడ జరుగబోదు , అలాంటి విశ్వసనీయమైన అంశాన్ని తేరమీదకు వఛింది , యావత్తు ప్రపంచ మోత్త కూడ విస్మయానికి గురైంది.
                                ఆ తరువాత మన తేలుగు రాష్ట్రంలో 2000 సంవత్సరానికి కోంచెం అటూ-ఇటూగా ప్రారంభమైనది చెప్పవఛు.ఆంధ్ర అశోకుడు చెన్నూరు అంజనేయరెడ్డి గారు సికింద్రాబాద్ , మహేంద్ర హిల్స్ మీద బౌద్ద కళ ఉట్టి పడేలా కోట్లాది వ్యయంతో ఆనంద బుద్దవిహారాను నిర్మించడంతో బౌద్ద పునురుత్తానం ఒక రూపం తీసుకుందని చెప్పవఛు.2006 సంవత్సరంలో మొదటి రెండు వారాల పాటు అమరావతిలో జరిగిన కాలచక్రంతో బౌద్దం పేరు మారుమ్రోగింది , బౌద్దమత గురువు అయినటువంటి “ దలైలామ “ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
                     సాహిత్యపరంగా చూస్తే అంతకముందు రచయితలంతా బౌద్దేతివ్రుత్తాలను తీసుకోని తమ ప్రతిభాప్రపత్తుల అవ్యక్తీకరణ కోసం రచనలు సాగించారే కాని బౌద్ద మౌలిక బోధనలపై తమ ద్రుష్టిని సారించలేదు.
             మంగళగిరి నుండి శ్రీ క్రుష్ణార్జున బోధిగారి పత్రిక సంఘమిత్ర , ఇది తరువాత రూపుమార్చుకోని బుద్ద భూమిగా వెలవడం సంతోషకరం , వీటిల్లో మంచి బౌద్ద సైద్దాంతిక విషయాలు ప్రచురితం కావడం ఆనంద దాయకం.
                                  ఇట్లు

                మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

డా.అంబేడ్కర్ కళాశాల చదువు



   డా.అంబేడ్కర్ కళాశాల చదువు
అది...1907 వ సంవత్సరం
చీకటిని-ఆకటిని-అహించి-సహించి
అవమానాలను-ప్రేలాపనలను
శాపాలను-ప్రకోపాలను-భరించి-భరించి
అడుగులో-మడుగులో-అడుగడుగులో
వేంటబడి-వేధించే-సాధించే
అంటరానితనపు తుంటరి
హైన్యానికీ-దైన్యానికీ
భారంగా-ఘోరంగా
బలి అవుతూ-వెలి అవుతూ
పీడిత-తాడిత జననేత
అంబేడ్కర్ మెట్రుక్యులేషన్ పరీక్ష పాస్ అయిన
సంవత్సరమది-వాంత మది
నిజవర్తనులు-ప్రముఖ సంఘ సంస్కర్తలు
శ్రీ బోలే-క్రుష్ణాజీ అర్జున్ కేలూస్కర్ లు
అంబేద్కర్పై అభినందనలూ-ఆశీసులూ
కురిపించిన వర్షమది...
మట్టిలో నుండి-మాణిక్యం పుట్టినట్టు
బురదలో నుండి పంకజం వేలిసినట్టు
దళిత జనాళి నడుమ
అంబేద్కర్ అవతరించాడు...
దీనుల పాలిట జేగంటలు మొగించాడు
తన చుట్టూ వున్న బాధలను-బంధనాలను
ఆకటినీ-చీకటినీ అధిగమించి
ఓక్కోక్క మెట్టు ఏక్కి ఏక్కి
ఒక్కోక్క మెట్టు ఎదిగి ఎదిగి
హైస్కూల్ స్థాయిని    అధిగమించి
కళాహాల చదువులకై గమించాడు-పురోగమించాడు
ఇంకా-ఇంకా చదవాలనే ఆసక్తి
అంబేడ్కరులో మరింత శక్తిని పేంచింది
ఫలితమే ఎల్ఫిన్ స్టన్ కాలేజీలో చేరాడు
కళాశాల విధ్యార్ధిగా మారాడు
నూనుగు మిఆల ఆ చిరుప్రాయంలో
చదువే అతని ధ్యేయం-చదువే అతని ఆహారం
జ్ణానాన్ని-విజ్ణానాన్ని అంపాధించుకోవాలనే తపన
ప్రజ్ణను-పాటవాన్ని
సముపార్జించుకోవాలనే ఆలాపన
అదోక అనూహ్య అనిర్వచనీయ
అధ్యయన – ఆధన
విజ్ణానమనే ఆయుధాన్ని పట్టి-పదును పెట్టి
తన చుట్టూవున్న తిమిరంతో సమరం చేఇ
అన్యాయలకు-అక్రమాలకు
అపశ్రుతులకు-అస్ప్రుశ్యతకు
నిలయమైన-వలయమైన
ఈ సమాజాన్ని సమూలంగా సంస్కరించి
అంతా ఒక్కటే అనే భావాన్ని కలిగించాలి
తన జాతి ప్రజలకు వెలుగు ఇవ్వాలి
తన పీదిత ప్రజలకు ఒక చక్కని మార్ద్గాన్ని చూపాలి.
ఇది ఒక్కటే అంబేడ్కర్ ముందు నిరంతరం కళ్ళ ముందు కదులుతున్న ఆలోచనలు , ఇలా చేప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంబేడ్కర్ గారి మార్గాలు , మరి ముఖ్యంగా నా దళిత ( మాల ) ప్రజలు ఇది గమనించి మీ మార్గములను , నిర్దేశకాలను ముందే చూసుకోండి....
                         ఇట్లు

             మీ అంబేడ్కర్ యువత ఐనఓలు

Tuesday 21 April 2015

వైవాహిక జీవనం



వైవాహిక జీవనం
బాజాలు  లేవు-రుచికర కాజాలు లేవు
బాకాలు లేవు-భువనైక జూకాలు లేవు
కరతాళాలు లేవు-తప్పేట మేళాలు లేవు
చామంతుల దండలు లేవు
సన్నజాజుల చెండులు లేవు
అఛట ముఛట గోలిపే
పఛటి తోరణాలు పందిరి లేదు
వేచటి దరహాఅపు యింతుల అందడి లేదు
హితులు లేరు-పురోహితులు లేరు
అయినా అక్కడ - ఆ రాత్రి
ఒక పేళ్లి జరిగింది-కనువిందు కలిగింది
పేళ్ళా ??? ఏవరి పేళ్ళి ??
ఏమిటి ఆ కథా అంటారా ???
ఇజం అనుకునేవారు-కాదు ఇది నిజం
వింత అనుకునేవారు – కాదు
సంతలో జరింది ఆ పేళ్ళి
చరిత్ర పుటల్లో ఏక్కింది ఆ పేళ్ళి
మేరుపు మేరిస్తే మురుస్తాం
వాన కురిస్తేతే కేరింతలతో అరుస్తాం
హరివిల్లు ఆకాశంలో విరిస్తే
వింతగానో – వినోదంగానో చుస్తాం
మిన్ను వోరిగిందంటే
మన్ను కరిగిందంటే –వింతేముందంటాం
కాని ఆ పేళ్ళి
సంతలో జరిగిందంటే
అవును అది
బోంబాయిలోని “బైకుల్లా “ ప్రాంతం
నిత్యం జరుగుతుంది అక్కడ ప్రజల
సౌకర్యర్ధం సంత
బూసర బూసరగానే యధావిధిగానే
ఆ రోజు జరిగింది సంత...
చరిత్రకు మిగిల్చింది ఒక వింత
ఆ “ బైకుల్లా మార్కేట్టే “ వివాహ వేదిక
మూసివున్న దుకాణాల
బుల్లి బుల్లి అరుగుల అలంకారాలు , లమణి తోరణాలు
వరుడు.....
భారత భాస్కరుడు.....” అంబేడ్కరుడు ”
వదువు....
రతనాల బాల.... “ రమాబాయి “
వరుడి వయసు 17 ,
ఆ మౌన వధుబు వయస్సు అందులో సగం
బైకుల్లా బజారులోని చిరుచిరు అరుగులే
అతిధులకు ఆసనాలు-ప్రియ సింహాసానాలు
నలిగిపడి ఉన్న గులాబీ రేకులే
ఆహ్వానితులకు రసా స్వాదనాలు
మరి భరతమాత-ఈ తనయుని పేళ్ళికి
మురిసిందో-ముప్పేరగోన మేరిసిందో
అమ్రుతపు జల్లు కురిపించిందో
ఆనంద డొలికలో వూగిందో ఏమో కాని
ఆ చలిలో- ఆ గిలిలో- ఆ రాతిరిలో
వచిన మేచిన ఆత్మీయులు , అతిధులు
వధువరుల చుట్టూ గుంపులు గుంపులుగ
ఆరుబయట అంబరంగా కూర్చోని
ఆశీస్సులు ఇఛారఅఖింతలు పోశారు
పేళ్ళి జరిగింది-కనువిందు జరిగింది
రమాబాయి అంబేడ్కరుకు తగిన సతి
సాత్వికురాలు సమభావ దర్శకురాలు
సతతం సహనం-సంస్కారం
మూటకట్టుకోని జీవించిన ఇల్లాలు
పీడితజాతి నేత
నవభారత నిర్మాత-అంబేడ్కర్
వెనుక నిలిచివెలుగు నిచిన
మణి – శిరోమణి
వారి వైవాహిక  జీవనంలో
“ రమేష్ “ –  “ రాజరత్న “
“ గంగాధర్ “ – “ యశ్వంత్ “ లు పుట్టారు
వేబడేంబడే ముగ్గురు గిట్టారు....
తరతరాల రోధనలో – వేధనలో
వారికి ఇంక ఆహ కలుగలేదు
అకాల మరణ గ్రస్తులు ( యశ్వంత్ తప్ప )
ప్రియ పెన్నిధులను కోల్పోయి
తమస్సును గుండెల నిండా నింపుకున్న
తండ్రి అంబేద్కర్ గారు...
నిర్వేద భావన భరితుడు
ఘన చరిత్రుడు –మన అంబేద్కరుడు....
ఇన్ని కష్టాలను అనుభవించి తన జీవితాన్ని మనకోఅం త్రుణపాయంగా పేట్టినవాడు ఆత్మగౌరవానికి ప్రతీకైన  నీలి జేండాను రేపరేపలాడించడంలో తనకి సాటె అని నిరూపించాడు...అంబేడ్కర్ గారు
భోధించు !                                       పోరాడు !!                                                     సమీకరించు !!!
                                            విప్లవ భినందనలతో

                      ఇట్లు
            మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి బాల్యం:



డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి బాల్యం:
ఆ ప్రవక్త భక్తి సూత్ర మార్గానికి వశులు-
రాంజీ సక్పాల్ కు సంతానామా అదికము ,
కోడుకుళ్ళు –కూతుళ్ళూ అనేకం ,
అందులో అంబేడ్కర్ చివరివాడు ,
దళిత జనానికి వరంగా లభించినవాడు ,
సంఖ్యాపరంగా 14 వ వాడు ,
పదునైన వాడు , తేలివైనవాడు , అలొచనపరుడు ,
ఏప్రిల్ 14 న పుట్టినవాడు ,
సవత్సరమా 1891 ,
అంబేడ్కర్ అసలు పేరు భీమరావ్ ,
ఇంటిపేరు అంబావదేకర్ ,
అంబావదేకర్ ను , ఇంటిపేరుగా మార్చి ,
స్కూల్ రికార్డ్ లో రాశాడు ,
ఆనాటి ఉపాధ్యాయుడు....!!!
అంబేద్కర్ బాల్యామా ,
కష్టాల పుట్ట ,
విధ్యాభ్యాసమా !
అవరోధాల గుట్ట ,
చదువు కున్న తీరు తేన్నులు  పరికిస్తే ,
నిస్తేజం అల్లుకుంటుంది-తనువు నిలువేల్లా దహిస్తుంది ,
మనసున్న మనిషి కంట తడి పేట్టక మానడు ,
అసమానతకు-అంటరానితనానికి నేలవైన ,
ఈ..........??????
కుటిల చరిత్రపై విల్లు ఏక్కిపేట్టక మానడు ,
తరగతి గదిలో –దూరంగా
ఓక మూల , భయంతో –భారంతో-అవమానంతో ,
ఆ బాలభానుడు కూడ తేఛుకున్న చినిగిన చిన్న గోనే గుడ్డ ,
ఆ గుడ్డను అడ్డంగా పరుచుకోని ,
ఆ పైనే కూర్చునేవాడు ,
మదిలో పుట్టేడు బాధ ,
పంతుళ్ళు చేప్పె అ, ,ఇ లు దిద్దుకునే వాడు ,
అక్షరాలు నేర్చుకునేవాడు ,
అంతేనా అంటే ??
కళ్ళూ ఉండి గుడ్డివాడు అన్నట్టు ,
దేనిని చూడకూడదు ,
ఏవరిని తాకకూడదు ,
నోరు ఊండి లేనట్టు ,
ఏది అడగకూడదు-ప్రశ్నించకూడదు ,
ఊపాధ్యాయులు చేప్పిందే వినాలి ,
మూగగా – మౌనంగా –మనోవేధనగా ,
ఉపాధ్యాయులు
మహర్ బాలుడిని ప్రశ్నలు అడిగేవారు కాదు ,
సహనంతో –కనీసం సానుభూతితోనైన చూసేవారు కాదు ,
చిన్నారి చేతులతో రాసిన ,
ప్రశ్నలను –సమాధానలను సరి చేసే వారు కాదు ,
క్లాసులో పిల్లలా ఇంక సరేసరి,
అది…..
అజ్ణానమో-విజ్ణానమో ,
అహంకారమో-అవివేకమో,
ఏమో కాని ,
వాళ్ళు విర్రవీగేవారు ,
పోట్టేళ్ళుళా పేట్రేగేవారు ,
ఈ....
మహర్ విధ్యార్ధితో ,
 మాట్లాడితో మైల పడిపోతామని భయపడేవారు ,
ఔను మరి ,
వారు వారి వారసుల నుంచి ,
నేర్చుకున్న సంప్రదాయం ,
తరతరాలుగా పోగుచేసుకున్న సంపద అది ,
దాహం అయితే సైగ చేయాలి ,
అంతే కాని పిలవకూడదు ,
అలా పిలిస్తే ఇంక కోపోద్రికులు అవుతారు మరి.....
ఇలా గడిచింది చేప్పుకుంటూ పోతే చాలా ఉంది...మీకు చేప్పే ప్రయత్నంలోని భాగమే ఇది , కనీసం ఇప్పటికైన మనవారు గమనించి ముందుకు సాగుతారని అశిస్తున్నాను...!!!
             ఇట్లు

మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు