Wednesday 15 April 2015

అంబేడ్కర్ భక్తులమే...! మహర్లము , ( ఆంధ్రప్రదేశ్ లో మాలలు )



అంబేడ్కర్ భక్తులమే...! మహర్లము , ( ఆంధ్రప్రదేశ్ లో మాలలు )





ఈ రోజు డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి పేరిట pay back to society అంటు, ఉద్యోగులు నాకు మొసం చేశారు అంటు , ఉద్యోగుల దగ్గర చందాలను చేసి, ధంధాలు చేసే కొన్ని సంఘాలు మహార్ లను అంబేడ్కర్ భక్తులు అంటూ విమర్శలు చేస్తా ఉన్నారు అవును ఇది చరిత్ర ఎరిగిన సత్యమే మహార్ లకు అంబేడ్కర్ మీదా భక్తే లేకుంటే మీరు ఈ దేశంలో రాజ్యాంగబద్దంగా హక్కులు పొంది మహార్లను విమర్శించే భావ ప్రకటన హక్కు పొందేవారు కాదు అనే నిజం తెల్సుకొండి.
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు తన అస్పృశ్య సమాజము యొక్క హక్కుల కొరకు పోరాటం చేస్తున్నప్పుడు ఈ బ్రాహ్మణవాద వ్వవస్త తన పై అనేకసార్లు హత్యయత్నానికి ప్రయత్నం చేసింది , అప్పుడు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి , ఈ బ్రాహ్మణవాద కుట్రలను ఛేదించి మీ వరకు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారిని అందించింది ఈ అంబేడ్కర్ భక్తులే అనే నిజం తెల్సుకొండి.
ఈ బ్రాహ్మణవాద వ్వవస్త తమ ప్రజలకు నీటికి, కుటికి , గూటికి కులం పేరిట దూరం ఉంచినపుడు , బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు చేపట్టిన, మహద్ చెఱువు నీటి పోరాటంలో , కాళారామ మందిరం ప్రవేశ పోరాటంలో ఈ వ్యవస్థ తమ పై రాళ్ళతో దాడి చేసినప్పుడు ఆ గాయాలను లెక్కచేయకుండా ఈ వ్యవస్థ పై పోరాటం చేసి మనం త్రాగే నీటి హక్కును కల్పించింది ఈ అంబేడ్కర్ భక్తులే అనే నిజం తెల్సుకొండి.
ఈ విధంగా డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ప్రతి పోరాటంలో బాబాసాహెబ్ గారికి రక్షణగా ఉంటూ ,డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి బౌద్ధ ధమ్మ పోరాటంలో పాల్గొన్నది 6 లక్షల మంది అంబేడ్కర్ భక్తులే అనే నిజం తెల్సుకొండి.
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి తర్వాత తను స్తాపించిన రిపబ్లికన్ పార్టీకి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1964 సంవత్సరంలో భూమి లేని శ్రామిక వర్గాల భూ పోరాటంలో డిల్లీలో పాల్గొన్న2.40లక్షల మంది అంబేడ్కర్ భక్తులను జైలులో నిర్భంధించింది అప్పటి ప్రభుత్వం. ఈ పోరాటంలో RPI అధ్యక్షుడు యన్.శివరాజన్ తో పాటు 13 మంది అంబేడ్కర్ భక్తులు మరణించారు. ఈ అంబేడ్కర్ భక్తుల పోరాటమే మీరు అనుభవిస్తున్న భుములు అనే నిజం తెల్సుకొండి.
డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి రచనలలో Riddles in Hinduism రచనను ఈ వ్యవస్థ అడ్డుకుంటే
తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ రచనను మీ వరకు అందించింది ఈ అంబేడ్కర్ భక్తులే అనే నిజం తెల్సుకొండి.



ఇట్లు
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

1 comment:

  1. ఇది నేను రాసినటువంటి ఆర్టికల్

    ReplyDelete