Wednesday 15 April 2015

దళితులు అస్థిత్వం

               దళితులు అస్థిత్వం


ఎప్పుడూ పట్టించుకోనీ,గుర్తించనూలేని 
దేశ ఆర్ధిక సామాజిక వెనుకబాట్లు
నిలబడలేవు చాలరనే మొండి వాదాలు
శరణార్ధులు వల్లించే అంద అద: భావాలు
ఆధర్శ ప్రాయమైన అంధ విశ్వాసాలు 
కర్మలతో,పునర్జన్మలతో పోసిన ప్రాణాలు 
పశుప్రాయపు బ్రతుకులకై పరిష్కారాలు 
అంబేడ్కరుని మానవతా సౌబ్రాతృత్వాలు
దేవుని స్థానాలలో నీతులు నిలవలేనపుడు
మోక్షార్ధ అభిలాషా శిద్దాంతలే నడిపించేది
ఉత్పత్తీ, క్షయా పంపిణీల నియమాలు
శ్రామిక బజారులో స్వేచ్చకు పోటీ పెట్టేది
హక్కులు,ఆత్మ గౌరవం నిబడాలంటే
దేశ శాసనం మత రహితం కావాలని
స్వతంత్రత్వం,సహొదరత్వం,సమానతత్వం
శిరోధార్యంగా త్రిగుణ శిద్దాంతం చేయాలని
ఆధి దేవుని ఆర్ధిక స్వబావపు నిచ్చన మెట్లు 
విప్పిచూపిన వ్యదార్ద జీవన యదార్ద వాదం
మనిషికీ మనిషికీ మద్య సంబందమే నీతంటే 
పునాదులు నిలకడే ఉపరితలల వెలుగుదల
ఆస్థినీ,ఆయుదాన్నీ,అక్షరాన్నీ ప్రకటించ రాని
హరించుకు పోయిన మానవ హక్కులు రావు
యాచనతొ,దానికి పోరాటమే ఏకైక మార్గం
లోకానికి భీం రావ్ గొంతు వేలెత్తి ప్రకటిస్తుంది.

ఏమని చేప్పను ,
ఏమని వర్ణింతును ,
మాటలలో చేప్పలేని విధంగా , 
వర్ణించలఏని విధంగా , 
ప్రతి అడుగడుగున , 
నీ నామా స్మరణే ,
ప్రతి అణువణువున నీ ఊపిరే , 
ప్రతి క్షణాన నీ జైభీం స్మరణే , 
నిన్నే తలుచుకుంటు ,
మదరాసు పట్టణానికే మకుటాయమానంగా నిలిచేనయా 
నీ శ్రద్దాంజలి ర్యాలి మహోత్సవం , 
మదరాస హార్బర్లో చరిత్ర పుటలలో నిలేచే విధంగా సాగేనయా నీ జీవన ర్యాలి ,
వేలాది హ్రుదయాలలో నీ నామా స్మరణతో సాగిన నీ హోమాగ్ని , 
శోకతప్త హ్రుదయాలతో నిన్నే ఉహీంచుకుంటు , 
నిన్ను ఏడబాయము అనుకుంటూ ఊరేగనయా ,
నీవు బౌతికంగా దూరమైన మాగుండే గుహల్లో ఏప్పటికి నిలేచేవుంటావు…. 

No comments:

Post a Comment