Monday 20 April 2015

వర్ఘీకరణ వద్దు దళితుల ఐక్యత వద్దు facebook page;

వర్ఘీకరణ వద్దు దళితుల ఐక్యత వద్దు facebook page;
ప్రియ దళిత సోదరుల లారా.... ఈ రోజు మన ఈ గ్రూప్ 5000 సభ్యుల మైలు రాయి ని దాటింది,ఇది చాలా శుభ పరిణామం, మనమందరం ఆనందించదగిన విషయం, ఎందుకంటే అసలు సమస్యే కానటువంటి విషయాన్ని,సమస్య గా ఊహించుకుంటూ,ఒకరి వెనుకబాటుకు అన్యాయంగా,సాటి దళితుడిని కారణంగా చూపిస్తూ,వాళ్ళ మీద అసూయ పెంచుకుంటూ,ద్వేషాన్ని పెంచుకుంటూ గత 20 సంవత్సరాలు గా వర్గీకరణ,వర్గీకరణ,అంటూ వితండవాదం చేస్తున్న కొందరు మూర్ఖ దళితుల వలన మన దేవుడు అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తోంది,అలాగే ఇలాంటి వారి వలన అంబేద్కర్ గారు కన్న కల అయినటువంటి దళితులకు రాజ్యాధికారం అందని ద్రాక్ష గా మారి పోతుంది..అలాంటి వాళ్ళు ఇప్పటికయినా మారాలి,దళితుల ఐక్యత కోసం కలిసి రావాలి, నాకు తెలిసినంత వరకు వర్గీకరణ ని తీవ్రంగా వ్యతిరేకించే మాదిగ సోదరులు చాలా మంది ఉన్నారు,వాళ్ళు కూడా బయటికి రావాలి, మన ఈ గ్రూప్ లో కూడా వర్గీకరణ ని వ్యతిరేకించే మాదిగ సోదరులు ఉన్నారు...ఇది కూడా శుభ పరిణామం , అలాగే ఈ గ్ర్రూప్ లో ఏం జరుగుతుందో అని ఈ గ్రూప్ లో జాయిన్ అయి అంతా గమనిస్తున్న వితండవాదులు కూడా ఉన్నారు, ఉండనీయండి మనకు నష్టం లేదు.ఏమైనా మన అంబేద్కర్ గారి ఆశయ సాధన లో భాగంగా,దళితుల ఐక్యత కోరుకునే మన గ్రూప్ రోజు రోజు కు ముందుకు దూసుకెల్తూ,దళితుల మధ్య ఒక సానుకూల వాతావరణాన్ని స్రుష్టిస్తూ ఉంది..దీనికి మన సోదరుల సహకారం మరువలేనిది, మన సోదరుల సహకారం లేనిదే ఈ గ్రూప్ లేదు..ఇంకా అందరి సహకారం తో ఈ గ్ర్రూప్ ముందుకు వెళ్ళాలని మన దేవుడు అంబేద్కర్ గారిని కోరుకుంటూ..మన అందరికి జై భీం లు....
మరి ముఖ్యంగా డా.అంబేడ్కర్ అలోచన విధానానికి విరుద్దమైన వర్గీకరణ అనే సున్నితమైన అంశాన్ని గురించి బహు క్షుణ్ణంగా మన దళిత ప్రజానీకానికి వివరిస్తు , దళిత జనాన్ని తేలియచేస్తున్నటువంటి ఈ గ్రూపు అధికారులు విక్రమ్ మాల , ప్రుధ్వి మాల అన్నగార్లకు ప్రత్యేకించి మా అభినందనలు..

అసమానతలను పేంచిపోషిస్తున్న ఈ సామాజిక వ్యవస్తను కూలదోయాలి
                                                       -సీతారాం ఏచూరి ( ప్రజాశక్తి-05-10-2014)
               ఇట్లు

    మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment