Monday 20 April 2015

పంచములు చరిత్ర : 3వ భాగం




పంచములు చరిత్ర : 3వ భాగం
స్వతంత్రానంతర కాలములో కులవివక్షలకు సజీవ సాక్షాలు:
*కేస్ట్ పీలింగ్స్ లేవంటూ, అగ్రకుల పేరెంట్స్ , తమ పిల్లలు మాత్రం మాల,మాదిగోళ్ళ పిల్లలతో స్నేహం చెయ్యొద్దు అంటారు. ఒక వేళ, మాల మాదిగ స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చినా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. రివర్స్ లో అగ్రకుల పిల్లలు, దళితుల ఇంటికి వెళ్ళినా, భోజనం ఆఫర్ చేసినా, భోంచెయ్యరు. అలా చేస్తే, వాళ్ళ అమ్మా నానలు ఊరుకోరు. ఎట్టి పరిస్తుతులలో మాదిగ మాలోళ్ళను బి.సి. లను లవ్ మ్యారేజ్ లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయ కూడదని బలంగా కోరుకుంటారు. కొందరైతే చస్తారు లేదా చంపుతారు.
* గత వందల వేల సంవత్సరాల కాలంలో అగ్రకుల జులుం తో సంపాదించిన సొమ్ము తో వ్యాపారాలు చేసి బాగ సంపాదించి వాళ్ళ కులపోళ్ళకే మళ్ళి మళ్ళి అవకాశములు, వాళ్ళ కంపెనీ లలో ఉద్యోగాలు ఇస్తూ ఇప్పిస్తూ వాళ్ళే పైకొచ్చి వాళ్ళ వాళ్ళనే పైకి తెస్తూ ఉంటారు. ఉదాహరణకు, “ఈనాడులో అంతా కమ్మమయం, “సాక్షిఅంతా రెడ్డిమయం, సినీ పీల్డ్ అంతా కమ్మ,కాపు మయం అక్కడక్కడ బ్రాహ్మణులు కూడాను. ఇక కాంట్రాక్ట్ లలో, చంద్రబాబు పాలన అయితే కమ్మ కాంట్రాక్టర్స్, కమ్మ మంత్రులు, వై.ఎస్.ఆర్, పాలన లో అయితే రెడ్డి కాంట్రాక్టర్స్, రెడ్డి మంత్రులు.వ్యపారాలు, పరిశ్రమలు, వ్యవసాయ భూములు అన్ని మళ్ళి ఈ అగ్రకులస్తులదే. ఆపైన "వాటిస్ దిస్ కేస్ట్ పీలింగ్స్... అవి ఎప్పుడో పోయాయి. అటువంటివి ఏమీ లేవు బ్రదర్" అంటారు.
ఒక అపార్ట్ మెంట్ లో మిగతా 19 మంది అగర్కులస్థులైతే.., ఎస్.సి. ఫేమిలీ కి 20 వ ఫ్లాట్ అమ్మనుకాక అమ్మరు. రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, రాజులు, బ్రాహ్మనులు వైశ్యుల ఇండ్ల లో పక్క పోర్ష్ ను ను అద్దెకు ఇవ్వండయ్యా! మా ఆఫీసు కి దగ్గరగా ఉంటుందంటే మీరు మాల మాదిగోళ్ళు బి.సి. లు కాబట్టి ఇవ్వం అంటారు. అదే అగ్ర కులస్తులకు అనుకూలంగా ఉంటే దళితుల ఇండ్ల లో బాగానె అద్దెకు దిగుతారు.
*మనిషి కనపడగానే.. రూపం చూస్తారు..కులం మీద ఒక నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే గత వందల వేల సంవత్సరాల కాలంలో నిమ్న కులస్తులు తిన్న తిండి లో వెరీ-లో విటమిన్స్ ఫుడ్ వలన జెనెటిక్ సమస్యల వలన మాకు ఒక రూపం ఇచ్చారుగా! లేదా పేరడుగుతారు కులం తెలుసుకోవడం కోసం, అప్పడికి వర్కవుట్ కాకపోతే ఇంటి పేరడుగుతారు. నీ మాట చూస్తారు, నీ వేషం చూస్తారు. ఫైనల్ చేస్తారు నీ కులాన్ని... ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అన్నా! నీకు దిమ్మ తిరిగి పోతుంది... మైండ్ బ్లోయింగ్ అంటారే అదనమాట.. అన్ని అవకాశాలు వచ్చినట్లే ఉంటుంది.. కాని ఏది రాదు...
*ఈ తేడాలతో చిన్నప్పటి నుంచీ ఇంకేమి ఆత్మవిశ్వాసం... ఇంకేమి పైకి రావడం... ఇదంతా జరిగిన తారువాత.. మనలను ఏమంటారో తేలుసా! మీరంతా అంతే... ఎన్ని అవకాశములు ఇచ్చినా పైకిరావడం చేత కాదు అని అంటారు..
* అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది.

* ఇవన్ని మాట్లాడితే, ఈ దళితులకు పనీ పాట లేదు, ఊరికే కుల వివక్ష అంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడుతారు అని అంటరు. నాలాంటి వాళ్ళని "కుల ఉగ్రవాది" అని ముద్ర వేసి ఖాయం చేస్తారు. దీనికి పరిష్కారం: ఏక వాక్య తీర్మానం : మళ్ళి అంబేద్కర్ పుట్టుకు రవాలి. ఒక్కరు కాదు. వంద మంది. కాదు,కాదు.. వెయ్యి మంది అంబేద్కర్లు పుట్టుకు రవాలి.( రాజు పాగోలు గారి నుండి )

                                       ఇట్లు
                      మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

           

2 comments:

  1. well explained.....mee mobile no chepthara

    ReplyDelete
  2. నువ్వు ఖచ్చితంగా మాలవాల్ల గురించే చెప్పతలుచుకున్నావు.ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా పొలం పనులు చేసి.రైతులకు వ్యవసాయ కూలి పని చేసారు కాబట్టి ముఖం అందవిహీనంగా మారింది.నల్లగా వున్న కాకులను మాలకాకి అంటారు.మాదిగలు ఎక్కువగా నీడపట్టున వుంటూ చెప్పులు తయారు చేస్తారు.కాబట్టి వారి ముఖంలో మెలనిన్ తక్కువగా వుండి ఆకర్షణీయంగా వుంటారు.నువు చెప్పిన జెనెటిక్ సిద్దాంతం తప్పు.గొల్లలు ముదిరాజులు మాదిగలు ఒకే తల్లికి పుట్టారు.అని అంటుంటే నువు మాత్రం.పంచమసిద్దాంతాన్ని పట్టుకుని వూగులాడతున్నావ్.మనదంతా ద్రావిడ జాతి.మన తాత జాంబవంతుడి వారసులే ఈ మానవులు.ఆదినారయణుడు ముల్లోకాలను సమస్తజీవరాసులను సృష్టించిన తర్వాత జాంబవంతుడుని ఆదిశక్తిని సృష్టించాడు.వారు సంగమించగా బ్రహ్మ విష్ణువు శంకరులు పుట్టారు మరల బ్రహ్మ ఆదిశక్తితో సంగమించగా సరస్వతీదేవి.విష్ణువు ఆదిశక్తితో సంగమించగా లక్ష్మీదేవి,శివుడు ఆదిశక్తితో సంగమించగా పార్వతి దేవి పుడతారు.బ్రాహ్మ సంతతివారే బ్రాహ్మణులు.క్షత్రియులు.వైశ్యులు.శూద్రులు.విష్ణువు కొడుకు మన్మథుడు.శంకరుడి కొడుకులు కార్తికేయుడు.వినాయకుడు...ఇది తెలిసిన మాలలు,మాదిగలు ఎవరైనా శూద్రులలో వుండమంటే వుంటారా?అందుకే వారు 5వ కులంలో చేరారు.శివుని పేరు చెప్పి అడుక్కునే వారు 5వ కులంలో వున్న జంగం వారు.శూద్రులలో బుడబుక్కలవాళ్లు.కానీ కష్టపడి పనిచేసే మాల మాదిగలను వేరేజాతిగా చూశారు.అడక్కతినేవారిని అక్కున చేర్చుకున్నారు గానీ గొడ్డుమాంసం తినే మాల మాదిగలను మాత్రం శివాలయంలో ప్రవేశించనీయలేదు.ఎందుకు అని అడిగితే శివుడికి పశుమాంసం తినేవారంటే నచ్చదు.అని చెబుతారు.పోనీ రామాలయంకు వెలదామంటే మా రాముడు క్షత్రియులు అతను మాంసం తింటారు.కానీ గొడ్డుమాంసం తినడు అంటారు.అసలు గొడ్డుమాంసం రుగ్వేదం కాలంలోనే బ్రాహ్మణులు క్షత్రియులు.వైశ్యులు తిన్నారు.ఈ కాలంలో తినేవారిని అంటరానివారిని చేశారు.అంటే బ్రాహ్మణులు రంగులుమార్చేవారని ఇక్కడే అర్థం అయింది.ఇప్పటికైనా చరిత్రను పూర్తిగా చదవండి.చదివించండి.పోరాడితే పొయ్యేదేమిలేదు.అంటరానతనం తప్ప.మాదిగలు మీ చరిత్రను తెలుసుకోండి.మీ తండ్రి ఆదినారాయణుడు మీరు ఎవరికీ పుట్టలేదు.అందుకే మిమ్మల్ని హరిజనులు అన్నారు.ఓం నమోనారాయణాయ.

    ReplyDelete