Wednesday 15 April 2015

దళితులు-వారి జీవన బ్రతుకులు

      దళితులు-వారి జీవన బ్రతుకులు

దళితులు సకల సంపదలకు స్రుష్టికర్తలు.
శ్రమ వారి చిరునామా ,
ఆకలి అవమానం,
పేదరికం వారి తోబుట్టువులు.
శ్రమను నమ్ముకున్న జనాలు శతాబ్దాల తరబడి ఆకలి బాధలతో అల్లాడిపోతున్నారు .64 సంవత్సరాల స్వతంత్ర భారతంలో దళితుల సంక్షేమం అటకేక్కింది.పంచవర్ష పణాలికలు ఘనంగా తయారవుతున్నా అందులో లెక్కలు మించి బడ్జేట్ అంకేలు లిఖితమవుతున్నా , దళితుల అభివ్రుద్ది మాత్రం ఏక్కడ వేసిన గోంగళి అక్కడే ఉందన్న చందంగా మారింది.
మారని దళితుల బతుకులు :
ఊరుకు, అభివ్రుద్దికి ఆమడ దూరంలో ఉంటున్న దళిత వాడలు , ఈ రాష్ట్రంలో సుమారు 60 వేలకు పై మాటే , గిరిజన తందాలు , గూడేలు 20 వేలకు పై మాటే . రాష్ట్ర జనాభాలో దళితులు 16.2% , గిరిజనులు 6.6 % . శాతం మొత్తంమీద 23% శాతం మంది వున్నారు . నేటికి 20 లక్షల కుటుంబాలకు పక్కా గ్రుహలు లేవు.60% మంది అవాసాలకు రక్షిత మంచినీటి సౌకర్యం లేదు.
దళితుల దరి చేరని ప్రభుత్వ పథకాలు
రాష్ట్రప్రభుత్వం హట్టహాసంగా ప్రారంభించీన ఏ పథకము కూడ దళితుల దరి చేరదంలేదు.వేఛించిన నిదులు ఖర్చు చేయడంలేదు.షేడ్యుల్డ్ కులాల అభివ్రుద్ది కొసం ఏర్పాటు చేసిన  “ షేడ్యుల్డ్ కులాల సహకార సంస్థ “ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్వీర్యమైపోతుంది.కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచే “ NSFDC “ పత్తా లేకుండా పోయింది.ఘనంగా నడిపిస్తున్నామని చేప్పుకుంటున్న 20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమం దళితుల ముంగిట తోంగిచూడలేదు.
             అందరికి ఊచిత విధ్యను అందిస్తున్నామని ప్రకటనలు చేసే ప్రభుత్వాలకు దళితులకు విధ్య అవసరమం అన్న జ్నానం కోరవడం దురద్రూష్టకరం. 1 నుంచి 10వ తరగతి వరకు మధ్యలోనే చదువుమానేసిన దళితులు 70% , గిరిజన్నుల్లో 80% అని ప్రభుత్వ లేక్కలే చేబుతున్నాయి.
అమలుకు నోచుకోని ఎస్సీ సబ్ ప్లాన్ :
ఎస్సీ , ఎస్టీల అభివ్రుద్ది కోసం 1980వ సంవత్సరంలో అప్పటి ప్రధాని “ ఇందిరా గాంధీ “  సబ్ ప్లాన్ పథకాన్ని ప్రవేశ పేట్టారు.ఇది ప్రణాళికావ్యంలో మరోక ప్రణాళిక అని అర్ధం. రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రుత్వశాఖలు , కేంద్రలోనొ అన్ని మంత్రిత్వశాఖలు వారి వారి బడ్జేట్లలో సబ్ ప్లాన్ నిధులు ఖఛితంగా ఖర్చుచేయాలి. వీపి.సింగ్ , రాజీవ్ గాంధీల మంత్రువర్గంలో పనిచేసీన నారాయణ్ , పీవి.నరసింహారావు మంత్రువర్గంలో సాంఘీక సంక్షేమ మంత్రిగా పనిచేసిన సీతారాం కేసరి రాష్ట్రప్రభుత్వాలకు లేఖలు రాసారు.
       దళితుల పేదరిక నిర్మూలన లక్ష్యంగా 6వ పంచవర్ష ప్రణాలిక కాలం నుంచే సబ్ ప్లాన్ నిధుల కేటాయింపు నకు శ్రీకారం చుట్టారు.
గంగలో కలిసిన గవర్నర్ల సిఫార్సులు:
కే.ఆర్. నారాయణ్ రాష్ట్రపతిగా వున్నా కాలంలో దళితుల , గిరిజనుల పేదరికం వారి సంక్షేమంపై సుధీర్ఘంగా చర్చించి నివేధిక సమర్పించాలని ఆదేశించారు.2000 సంవత్సరంలో 7 గవర్నర్లతో ఓక ఊన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి , ఆ కమిటీకి చైర్మన్ గా మహరాష్ట్ర గవర్నర్ “ పీసి . అలేగ్జాండర్ ను “ నియమించారు.ఈ కమిటీ దేశం మొత్తం పర్యటించి  దళిత , గిరిజనుల సమస్యలను తెలుసుకోని నివేధికని తయారుచేసి 2001 లో రాష్ట్రపతికి అందచేసారు.

అగ్రకుల అహంకారానికి నిరసనగా ,
ఒక ఆత్నగౌరవ నినాదంగా ,
ఊరూరా దళిత కోయిల అంబేడ్కర్ పాట పడుతుంది ,
నివురుగప్పిన నిప్పులా వున్నా దళిత చైతన్యం ఒక్కసారిగా ,
పాలకవర్గాల గుండేలదిరేలా ఎగిసిపడుతుంది ,
ముక్కలవుతున్నా దళిత చైతన్యాన్ని ,
పోగు చేద్దాం , ఒక మహోన్నత శక్తిగా ఏదుగుదాం ,
అంబేడ్కర్ ఒక ఆత గౌరవప్రతీకే కాదు ,
దళిత విముక్తి గీతం కూడ అని నినద్దిదాం ,
అంబేడ్కర్ ఒక విగ్రహంగానే కాక ,
అంబేడ్కర్ ఆలోచనలని మీదేసుకోని ,
జగమంతా అంబేడ్కర్ మయం అంటూ పల్లే పల్లేకు పోదాం....
                                                వీరుడు అంబేడ్కర్
వీరులు విగ్రహాల్లో కాదు , ప్రజల గుండేల్లో ఉంటారు,
ప్రజల గుండేచప్పుళ్ళలో వీరులు గర్వంగా నవ్వుతుంటారు ,
విగ్రహాలను ద్వంసంచేస్తే వీరులు మాయమైపోరు,
అది మరో విస్పోటనానికి నిప్పంటిస్తుంది ,
విగ్రహాలు కూల్చెస్తే వీరులు చఛిపోరు ,
ఆ విగ్రహాలను తమ రక్తంతో నిర్మించుక్కున్న జాతి జనుల ఊపిరిలో ఉంటారు.
అణగదోక్కటం , అవమానించటం ,
మీ సంస్క్రుతు కావోఛు.
రెఛగోట్టడం , చిఛుపేట్టడం , మీకు చేతనైన విధ్య కావోఛు.
కూలిన విగ్రహాల్లోచి...కోట్ల పిడికిళ్ళు మొలకేత్తటం ఇక అందరం చూస్తాం.
వీరులు జనంలో ఉంటారు..జనం జరిపే రణంలో ఉంటారు...వీరుడు అంబేడ్కర్
  
 అగ్రకుల మనువాద కుట్రలను ఎడమకాలితో తన్ని నిత్య అవమానాలకి , అణిచివేతలకి , అవహేళనకి గురవుతున్న బ్రతుకులలో వేలుగులు నింపిన డా.బి.ఆర్.అంబేడ్కర్ను , కోందరు దుండగులు కేవలం విగ్రహాం మాత్రమే అనుకున్నారు.అంబేడ్కర్ కేవలం దళితులకే పరిమితం కాదని , దేశం మొత్తం గర్వించదగ్గ మేధావి అంటూ చిలుక పలుకులు పలికే మన అగ్రకుల పాలకులు అంబేడ్కర్ ను అవమానపరిచిన నిందితులను శిక్షించకుండా నీతిమాలిన బ్రతుకులు బ్రతుకుతున్నారు.
             అంబేడ్కర్ విగ్రహం చలనంలేని రాతిబోమ్మ కాదు.ఈ దేశంలోని కోట్లాదిమంది పీడిత ప్రజలను విముక్తివైపు నిరంతరం నడిపించే, కర్తవ్యాన్ని నిర్దేశించే ఓక సజీవ శక్తి.నిత్యం అవమానాలకి , అణీచివేతలకి గురవుతున్న బ్రతుకులలో అంబేడ్కర్ వో అంటరాని వసంతం.అంబేడ్కర్ వో వేలుగు , ఆలోచన , ఆచరణ కూడ.
             అసమాన , అసమానవీయ అనైతిక సమాజాన్ని మార్చాలనుకున్న సామాజిక చరిత్ర తత్వవేత్త అంబేడ్కర్.నూతన చరిత్ర నిర్మాణానికి దారేసిన దార్శనికుడు.దుర్మార్గపు బ్రహ్మణ భావాజాలన్ని బజార్లో కీడ్చుకోఛి తుపుక్కున వుమ్మేసిన భారతీయ శాస్త్రవేత్త.పరిపాలన నుండి స్వతంత్రం సంగతి తర్వాత,ముందు మా బానిస బ్రతుకుల గురించి తేలచండని నిలేసిన నాగరికుడు.
               ఈ దేశం దుర్మార్గానికి , దౌర్జానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ చాటింపేసిన డెరింగ్ పోలిటికల్ హీరో అంబేడ్కర్.అందుకే అంబేడ్కర్ ఈ రోజు దళితుల జీవన జెందా అయ్యాడు.అగ్రకుల ఆధిపత్యానికి నిరసనగా “ మాల మాదిగల “ పల్లేలలో నిలువేత్తు విగ్రహమయ్యడు.అంబేడ్కర్ అటు సాంప్రదయ బ్రాహ్మణిజానికి , ఇటు వర్గం ముసుగులో కులం ప్రస్తావన దాటవేసిన మార్కిస్టులకి సవాలుగా నిలిచాడు.
                   భారతీయ పత్యామ్నాయ వుద్యామాలకి పదును పేట్టిన కోత్త వోరవడయాడు.అంబేడ్కరిజం ఓ సాంస్క్రితిక విప్లవం.విప్లవం.అంబేడ్కరిజమంటే కుల నిర్మూలన.స్వేఛా సమానత్వంతో కూడిన సహజీవనం.సామాజీక న్యాయంతో ఓ మానవీయ సమాజాన్ని పునర్మీంచడం.అందుకే అంబేడ్కర్ దళితుల అంతరాత్మ అయ్యాడు , ఆరాధ్యుడయ్యాడు.ఈ ఆలోచనే అగ్రకుల పేత్తందారుల్లో , పాలకవర్గాల్లో భయం పుట్టించింది.
            దళితుల ఆత్మగౌరవంతో అగ్రకుల ఆధిపత్యాన్ని , కండకావరాన్ని ప్రశ్నించిన ప్రతిసారి దళితుల మీద దాడులు జరుగుతునే ఉన్నాయి.అగ్రకుల పార్టీలు అభద్రతా ,ఆనిశ్చితిలో వుండి దళితుల మధ్య చిఛుపేట్టి , వారిని సంఘటితం కాకుండా చూసుకుంటూనే వారిని విడివిడిగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను చెస్తున్నాయి.
               అంబేద్కర్ కోసం
ఒక పోద నుండి మరోక పొదకు ఎగిరివెళ్తూ
ఒక సరి కోత్త ఆశావాహా కాంతి రేఖల్ని
వెదజల్లుతూ సంచరించే సీతాకోక చిలుకవూ నువ్వే
రైలు పట్టాల లాగా నేలంతా పరుచుకుంటూ విస్తరిస్తూ
విశ్వవిధ్యాలయాల  పునాదులు కుదుపేస్తున్నది నువ్వే
స్వేఛ నుండి స్వేఛలోకి ప్రవహించే మానవీయ గీతానివీ నువ్వే
పైరు పంటల పోలాల నుండి జనసమూహాల నుండి
నిరసన ఊరేగింపుల నుండి
ప్రజా పోరాటల నుండి
మాలోకి నడచి వఛు
మా రధ సారధిగా కదలివఛు
ఒకే ఒక్కడివి నువ్వే
బాబా సాహేబ్
మమ్మలని ఎన్నడూ ఎడబాయక మాతోనేవుండి
మా సంకేళ్ళను తెంచగల
ఏకైక వ్యక్తివి నువ్వే
నువ్వు మాత్రమే..
నువ్వు మాత్రమే...
             బాబా సాహేబ్ గారికి మా పాధాభి వందనాలు

     సరి కోత్త ఉదయం కోసం
అదే దు:ఖం
అదే ఆగ్రహం
అదే నిరాశా
నిస్ప్రుహాల నీరవ ప్రపంచం
గాయమైనప్పుడు మౌనంగా ఉండదు కదా ???
నేత్తుటికణాల కీకారాణ్యాలతో
కుంపటూలు రాజేస్తుంది
ప్రియతమా
ఇప్పుడు నీపాట
గాయపడ్డ చిరుతపులి ఆర్తనాధం కావాలి
తండ్రి
ఈ దేశానికి ఈ ప్రపంచానీకి
ఒక సరి కోత్త సూరీఎడు కావాలి
మళ్ళోక్కసారి రారా
ఒక సరి కోత్త ఉదయం కోసం
కోత్త స్వప్నం కోసం
కోత్త ప్రపంచం కోసం
మీ బిడ్డలమైన మా కోసం
మన జాతి బిడ్డల కోసం
వేలుగులు నింపే
రాజ్యాంగం అనే బూరను చేబూని
మళ్ళి మాలోకి
మాలో పడిచఛిన విప్లవ ఉద్యమాల కేరటం కోసం
మళ్ళోక్కసారి జన్మించవా
తండ్రీ....
నీకు మా వేల వేల వంధనాలు

                అగ్నిపునీతునికి అశ్రు నివాళి
నక్షత్రాలను
నేలకూల్చలనుకోవడం
అవివేకం

వేలుతురుకు
మైల పూలమాలనుకోవడం
సుద్ద చపలత్వం

మేరుపుని గుండేల్లో
దాచుకోవాలి
గుప్పేట్లో బంధించాలనుకోవడం
వేర్రితనం

నిప్పుని జ్యోతిలా
వేలిగించుకోవాలి కాని
చేలగాటాలాడకూడదు

బాబా సాహేబ్
మనిషి వరుసలో మొదటివాడు
మనిషిని మనిషితో
కడిగిన తోలిమేధావి

పూజనీయులంతా
రాలిపడలేదు
మనలోనుండి
మన్నులో నుండి మొలిచినవారే

పూజగది పాలరాతి
విగ్రహాలకు ప్రాణముండదు
ఆయన మాహామూర్తి మత్వం సజీవం

ఊరి వేలుపలే సూర్యడు ఉదయిస్తాడు
కోండల్లో కూడ నివశిస్తాడు
కరుణ పదానికి
ఆయన పర్యాయపదం

ఇప్పుడు సముద్రాన్ని మధిస్తే
అమ్రుతం రాదు
అంబేడ్కర్ ఉబికి వస్తాడు
సేవించినవాడు మనిషిలా జీవిస్తాడు
కాకులు పేంటతిని
పుణ్యమూర్తుల
తలలమీద రేట్టలేస్తాయి
మనిషి అన్నమే తినాలి కదా ???

అగ్ని పునీతుడ్ని అవమానించిమా
పనికత్తులకు పనిచేప్పోద్దు

            బహుజన గుండే గుహల్లో
ఇవాళ ప్రపంచం
కుటిల కౌటిల్య రాజకీయ
ద్వేషాగ్నిలో రగిలిపోతుంది
దుర్మార్గపు దుర్నీతి
అమానుష వలయాలుగాకమ్ముకోన్నది...
ఓ ఆనంత జీవన తథాగతా
ఓక్కసారి ఈ నెలపై మళ్ళి పుట్టావా ??
మరణంలేని నీ స్వేచా
సమాతా సందేశంతో
ఈ చీకటి చరిత్ర మరకలను
నీ అహింసా వర్షంతో కడిగి వేయవా ??
తదాగతుడ్ని
తన గుండేల్లోకి అవాహాన
చేసుకున్న మహనీయుడు కదా అంబేద్కర్
చారిత్రక విభాత సంధ్యల్లో
కుమిలిన గుండేల్లోంచి పైకి లేచి
రేపరేపలాడే ఆదర్శాల పతాకవు కద నువ్వు..
చీకటి యుగాల నుండి
రక్తసిక్త యుగాల నుండి
సరికోత్త తేజంతో
కోత్తయుగాలకు
బాటలు వేసిన
దిక్సూచివి కదా నువ్వు
బుద్దుడంటె కేవలంగాంధార సంప్రదాయంలో ఉన్న
అరమోడ్పు కన్నుల సౌదర్యం కాదు
మానవుడే కేంద్రంగా విస్తరించిన
నిశబ్ధ విప్లవం..
ఇప్పుడిక
అంబేడ్కర్ విగ్రహం కూడ
ఉధ్యమం చేస్తుంది..
మత మౌడ్య మూర్ఖుల్లారా
మనువాద కుట్రదారుల్లారా
అంబేడ్కర్ విగ్రహాల్లో లేడురా
అశేష బహుజన గుండే గుహల్లో
సజీవంగ జీవించి ఉన్నాడురా
    
  దేవుడు అంబేడ్కర్
అమ్మ కడుపులో నేనుప్పుడు
ఉరుములు మేరుపులతో ఆకాశం
అఛం అమ్మీలా బాధతో
మేలితిరిగి పోతున్నప్పుడు
గుడిసె చూరు నుంచీ ఏకధాటిగా నీళ్ళు
మంటీని మింటిని ఏకం చేస్తున్న ధార..

ఏం చేయాలో తేలియని నిస్సహాయత
ఏం చేద్దామన్నా అడుగేయని
మోకల్లోతు బురద
ఆరిపోతున్న దీపానికి చేతులడ్డం పేడూతూ
ఆరీపోయే దీపంలా అమ్మీ..

తడుచుకుంతు ఏ కాకి వేళ్ళిందో కాని
బుఛమ్మ రానే వచిందిబుడ్డీ దీపం గుడ్డి వేలుతురులో
అనుభవమే కాంతై
నలుదిక్కూల ప్రకాశించి
జీవి భూమి మీద పడ్డ శబ్దం

ఎవరో నా నాలుక పైన తేనే రాశారు
నా చేవిలో పేరు ఊదారు
ఎవరికి తేలియదు కాని
నా నాలుక స్ప్రుశించిన మొదటి పేరు
పేరునా చేవులు విన్న పవిత్రమైన పేరు
బాబా సాహేబ్ అంబేడ్కర్

నాదిప్పుడు పేరటి తోటకూరకంటే
వేగంగా పేరిగి ఆటలాడే వయసు
నాతోపాటే వేంకడు కూడ ఆడుకోవఛని
అమాయకంగా అనుకోనే మనసు
కాని వాడు నాతో ఆడు కోవడానికి
వఛిన మోదటి రోజే నన్న
మేడ పట్టి బయటకు నేట్టబడ్డాను
అంటరానివాడిగా

అలా అంటరానివాడీగా పుట్టి
మనుషుల ఊహకు కూడ అందనంత ఏత్తు
ఏదిగేటట్టు చేసిన మహనీయూడు
జన్మించిన కులంలో పూట్టాను

మనిషిని మనిషిగా తీర్చి దిద్దిన
“ మహర్ “ కులంలో జన్మించాను
ఇవాళ ఆ కుల దైవం
మరణీంచిన రోజున
నిలువేత్తు ఉప్పేనలా
ఏగిరిపడుతున్న కేరటంలా లేచాను
లేచానునీకు నివాళు అర్పించడానికి
అందుకో మా ఘనమైన నివాళులు...

         అంబేడ్కర్ లక్షణం
అంబేడ్కర్ లక్షణం ???
కన్నీటికి కాపలా కాయడం కాదు
దు:ఖాన్ని అమ్ముల పోది చేయటం
అణచివేతల సమాజాన్ని
ఎగిసి ఎడమ కాలితో తన్నడం
నరకబడ్డ చోట
నిప్పుల గుండం నుంచి
ఏగిరి దూకడం
కాలం పరివేధనని చెవొగ్గి విని
మర ఫిరంగులు ధరించి యుద్దం చేయడం
నంగి నంగి మాటలు చేప్పడం కాదు
సాహీత్య పీటాల ముటాల అడుగులకు
మడుగులోత్తడం కాదు
వీరుల పాదాల గురుతులను తలకేత్తుకోవడం
అట్లా నిటారుగా
నిలబడాలనుకుంటున్న మనిషి
నిప్పుల గుండేల నుండి దూకి బయటలు వస్తున్న
దైవమే మన బాబా సాహేబ్ అంబేడ్కర్ గారు...

డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి ర్యాలి

ఏమని చేప్పను ,
ఏమని వర్ణింతును ,
మాటలలో చేప్పలేని విధంగా ,
వర్ణించలఏని విధంగా ,
ప్రతి అడుగడుగున ,  
నీ నామా స్మరణే ,
 ప్రతి అణువణువున నీ ఊపిరే ,
ప్రతి క్షణాన నీ జైభీం స్మరణే ,
నిన్నే తలుచుకుంటు ,
మదరాసు పట్టణానికే మకుటాయమానంగా నిలిచేనయా
నీ శ్రద్దాంజలి ర్యాలి మహోత్సవం ,
మదరాస హార్బర్లో చరిత్ర పుటలలో నిలేచే విధంగా సాగేనయా నీ జీవన ర్యాలి ,
 వేలాది హ్రుదయాలలో నీ నామా స్మరణతో సాగిన నీ హోమాగ్ని ,
శోకతప్త హ్రుదయాలతో నిన్నే ఉహీంచుకుంటు ,
నిన్ను ఏడబాయము అనుకుంటూ ఊరేగనయా ,
నీవు బౌతికంగా దూరమైన మాగుండే గుహల్లో ఏప్పటికి నిలేచేవుంటావు….
           - జై బాబా సాహేబ్ అంబేడ్కర్

అందుకో దండాలు బాబా సాహేబ్ అంబేడ్కరా ,
అంబరానా ఉన్నట్టి చుక్కలు గురవంగో ,
ముందుగా నిను తలచి పాటలు పాదేము ,
నీ తల్లి భీమాబాయి ,
నీ తండ్రి రాంజీ ,
నీ ఊరు అంబవాడ ,
నీ జిల్లా రత్నగిరి ,
ఏప్రిల్ 14 నీ పుట్టిన రోజంటా ,
దళిత జాతి పీడితులకు పండుగ రోజంటా ,
మనుస్మ్రుథిని తగులబేట్టి ,
మనువాదాన్ని మంటగలిపి ,
కుల రక్కసి విషపు కోరలపై ,
నీవు జరిపిన పోరాటం..చిరస్మరణీయం

అందుకోండి మా విప్లవ నీరాజనాలు


బాబా సాహేబ్ అంబేడ్కర్ వ్యక్తి కాదు ,
ఒక వ్యవస్త ,
ఆయన వ్యవస్త కూడ కాదు ,
మహోన్నతమైన శక్తి ,
ఆయన శక్తి కూడ కాదు ,
ఇక ఉధ్యమం , ఉప్పేన
ఒక ఉవ్వేతూన ఎగిసి పడే కేరటం ,
ఒక విప్లవ జ్వాల ,
ఒక తత్వవేత్త, సామాజికవేత్త ,
చరిత్రకారుడు , రాజనీతిజ్నుడు ,
ఆర్ధికశాస్త్ర నిపుణుడు ,
ఒక అసమాన్యమైన అలోచనకారి ,
బహుముఖ ప్రజ్నశాలి ,
ఇలా చేప్పుకుంతూ పోతే ,
చరిత్ర మొత్తం కూడ ,
బాబా సాసాహేబ్ పేరుతో నిలిచిపోతుందేమో అని
నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ,
“చరిత్ర తేలియనివాడు చరిత్ర స్రుష్టించలేడు చరిత్ర తేలుసుకోని వాడిని చరిత్ర తన కాల గర్భంలో కలిపేస్తుంది “
అన్న మీ మాటలు మాకు మా మదిలో ఏప్పుడు మేదిలాడుతునే ఉంటాయి….భీమయ్య





బాబా సాహేబ్ అంబేడ్కరా ,
పుస్తకమే లోకంగా పేరిగినా నువ్వు ,
దళితుల విముక్తి కోరకు ,
వారి జీవన ప్రమాణాల కోరకు ,
చిద్రమైన వారి బ్రతుకుల కోరకు ,
నీ జీవితాన్ని ,
సర్వస్వాన్ని త్రుజ్యచించి ,
చివరికి ,
మనువుల చేతిలో ,
మనువాద బ్రహ్మణ భావజాలాల ,
విషపు కోరల్లో చిక్కుకోని ,
మనువాదాన్ని మంటగలిపి ,
కులం పునాదులపై ,
పిడు గుద్దులు గుద్దిన ,
మహనీయుడా నీకు ,
కోటి కోటి ప్రణామములు ,
జాతి విముక్తి కోరకు ,
నీవు చేసిన ఉధ్యమాలు ,
మన జాతి బిడ్డల గుండేల్లో ,
ఇంకను , ఏప్పుడును ,
పదిలంగా ఉంటాయి ,
పేద , పీడిత ,
వైతాళిక , నిమ్న ,
దోపిడి చేయబడిన ,
దోపిడికి గురవుతున్న ,
ప్రతి దళిత , ఆదివాసి ,
బహుజన మనుషుల ,
గుండే గుహల్లో నిలిచి వున్నారు...
                 -జోహార్ బాబా సాహేబ్ అంబేడ్కర్

బహుముఖ ప్రజ్నశాలి అయిన అంబేడ్కర్ ఈ దేశంలోని కుల వ్యవస్తపై చాల లోతుగా అధ్యయనం చేసాడు.
కులాలు వాటి మూలాలు మనిషిని ,
 దేశంలోని వ్యవస్తను ఏంతగా నిర్వీర్యం చేస్తున్నాయి
అంటే బహుసా బాబా సాహేబ్ అంబేడ్కర్ అధ్యయనం చేసినంతగా
 మరే ఇతర నాయక్య్డు అధ్యయనం చేయలేదు
 అయనకు అంతగా వాటిపై అవగాహాన స్పష్టత ఉంది.
వాస్తవానికి ఈ దేశంలో హేఛు తగ్గులు వున్నప్పటికి
మనిషికి కూడు , గుడ్డ ,
అందరి జన్మ హక్కు
అది అందరికి సమానంగా జరగాలి అన్నది ఆయనగారి స్వప్నం.
ఆయన దాదాపు 50 కు పైగా పుస్తకాలు రాసాడు ,,
ఏందుకు మీరు పేదరికాన్ని ,
మీ బానిసత్వాన్ని , ప్రాపంచిక కష్టాలను ,
మీ దైననీయమైన , నీచమైన ,
అసహ్యకరమైన జీవితాలని
మరింత హీన పరుచుకుంటున్నారు ,
 అంతకంటే ఈ లోకంనుండి నిష్క్రమించడం మేలు.
ప్రతి ఒక్కరు మీ హక్కులేమిటో తేలుసుకోవాలి ,
చీకటైన మీ జీవితాలలో వేలుగులు నిండాలి.
భారతదేశ 20వ శతాబ్ద రాజకీయనాయకులలో
అంబేడ్కర్ అగ్రగణ్యుడుగా నిలుస్తాడు,
డా-అంబేడ్కర్ మేధావి ,
 ఏనలేని ప్రతిభావంతుడు ,
వక్త , రచయిత , ఆదర్శవాది ,
విద్యవేత్త , కార్యదక్షుడు ,
ఇన్ని సలక్షణాలు ఒకే వ్యక్తిలో పాదుకోవడం అత్యంత అరుదు , భారతదేశ అద్రుష్టం.
 కాని అలాంటీ మహనీయూదను కేవలం దళిత వర్ణాల ప్రతినిధిగా చూడడం భారతదేశ దురదుష్టకరం..సమాజంలోని తరతరాలుగా పేరిగిపోయిన నూనత భావాన్ని పోగోట్టడంకోస సమానత్వ భావాన్ని పేంపోదించడం కోసం ఆయన ఏంతగా శ్రమించాడో మనకు అందరికి తేలుసు.
                జోహార్ బాబా సాహేబ్ అంబేడ్కర్

              ఇట్లు
మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు







1 comment: