Thursday 9 April 2015

మాల కవులు



బోయి భీమన్న



            
బోయి భీమన్న
Boyi bheemanna.jpg
బోయి భీమన్న
జననంబోయి భీమన్న
19 సెప్టెంబరు 1911
మామిడికుదురు, తూర్పు గోదావరి జిల్లా
మరణం2005 డిసెంబర్ 16
వృత్తిఉపాధ్యాయుడు


బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి,కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుపద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటిదురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు.

బాల్యం-విద్యాభ్యాస

1911 సెప్టెంబరు 19 న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో భీమన్న పుట్టాడు. నాగమ్మ మరియు పుల్లయ్య ఇతని తల్లిదండ్రులు. వీరికి పంచపాండవుల వలె ఐదుగురు మగపిల్లలు మరియు ఒక ఆడపిల్ల జన్మించారు. పుల్లయ్య తన మగపిల్లలకు వరుసగా ధర్మరాజు, భీమన్న, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టాడు. భీమన్న 1935లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణుడై 1937లో బి.ఇడి. పూర్తి చేశాడు. గుడిసెలు కాలిపోతున్నాయ్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వరించింది. 2001లో భార త ప్రభుత్వం భూమన్నను పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. 2005 డిసెంబర్ 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

ఉద్యోగం

విద్యాభాసం చేసిన తర్వాత బోర్డు హైస్కూలులో చరిత్రను బోధించే ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ అనువాద విభాగం డైరెక్టర్ గా, రిజిస్ట్రార్ ఆఫ్ బుక్స్ గా 1964 వరకు పనిచేశాడు.

రచయితగా

బోయి భీమన్న ప్రముఖ రచయిత. ఈయన సుమారు 70 పుస్తకాల్ని రాసినట్లు తెలుస్తోంది. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశాడు. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది. ఆకాశవాణి లో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశాడు. వీటన్నింటితో పాటు అంబేడ్కర్‌ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశాడు. వీరు వ్రాసిన ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది.

సాహితీ సేవ

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా. బోయి భీమన్న పేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు. నిజానికివన్నీ విశ్లేషిస్తే గాని, భీమన్న సమగ్ర సాహిత్య దృక్పథం స్పష్టం కాదు. ఈయనే కాదు, ఏ రచయిత దృక్పథాన్నైనా అంచనా వేయాలంటే, వివిధ పరిణామాలుగా సాగిన రచనలన్నింటినీ స్పృశించగలిగినపుడే ఇది సాధ్యమవుతుంది. అలా కాకుండా, దళిత పదాన్ని ప్రయోగించలేదనీ, దాన్ని వ్యతిరేకించాడనీ, భారతదేశంలో కులం లేదన్నాడనీ, ఆయన వర్గాన్నే సమర్ధించాడనీ, కులం గురించి వ్రాయలేదనీ వక్రీకరించే వాళ్లని చూసిన తర్వాత ఆయన సాహిత్యదృక్పథాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
ఇప్పటికే అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ర్టవ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగు తున్నాయి. వీటన్నింటికీ ఒక మార్గదర్శనాన్ని కల్గించిన గ్రంథం ఒకటి ఉంది. అది హైమావతి చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన ‘‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న’’ గ్రంథం. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే, ఆయన వ్రాసిన రచనల్లో పరిశోధకులకు, విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది.
భారతదేశంలోని ‘భిన్నత్వంలోని ఏకత్వం’ లాగే, భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందనీ, ఆయన కుల, మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది. భారతజాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించు కోవాలి. అంబేడ్కర్‌ విశ్లేషించిందీ, భీమన్న వ్రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నాడు. జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయవాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది.
ఒకప్పుడు ‘బ్రాహ్మణ’ శబ్దాన్ని చదువుకున్నవాళ్ళనీ, ఆలోచనాపరుల్నీ సూచించడానికి ప్రయోగించారు. సామాజిక నిర్మాణంలో చాతుర్వర్ణ వ్యవస్థలోకి చేరిన తర్వాత కుల సూచికగా మారిపోయింది. తమ తెలివితేటలతో ఆధిపత్యంలో ఉన్న వాళ్ళు, క్రమేపీ ఒక వర్గంగా తయారయ్యారు. ఈ ఆలోచనాపరులు ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని మతమని ప్రబోధిస్తూనే, ఆచార, వ్యవహారాల పేరుతో, కర్మ సిద్ధాంతం వైపు నడిపించుకొనిపోయిన హిందూమతం పైనే డా. అంబేడ్కర్‌ ముందుగా తన దృష్టిని కేంద్రీకరించాడు. కొన్ని వందలసంవత్సరాలుగా పాతుకుపోయిన హిందూమతంతో అవినాభావసంబంధాన్ని కలిగి ఉన్న వాళ్ళు, తమకు బోధించిన ధర్మశాస్త్రాల వల్ల మానసికంగా, అస్పృశ్యులుగా ఉండిపోవడానికైనా సిద్ధపడతారు.
పురాణేతిహాసాలు,సాంప్రదాయ సాహిత్యాల పేరుతో పాలకవర్గాలతో ‘ఆలోచనాపరులు’ కలిసి కొనసాగించిన కుట్ర ఫలితంగా, నేటికీ కులాధిపత్య సాహిత్యమే ఉత్తమసాహిత్యంగా కొనసాగిపోతోంది. దురదృష్టమేమిటంటే, నాటిభావజాలాన్ని నేటికీ కొనసాగించడాన్ని ఆ భావజాలం వల్ల నష్టపోయిన, ఇంకా నష్టపోతున్న వాళ్ళు వ్యతిరేకిస్తుంటే, నాటి ఆధిపత్య భావజాలానికి ప్రతినిధుల్లా వాటిని సమర్ధించేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అందుకనే తన ప్రజలంతా దేని వల్లనైతే మోసపోతున్నారో, దాన్నుండి రక్షించుకోవడానికి సామాజిక ఉద్యమాన్ని నడిపే బాటలో పయనించిన వాడు అంబేద్కర్‌. అలాంటి ఆశయాన్నే సాహిత్యంలో కొనసాగించిన రచయిత బోయి భీమన్న కూడా!
డా. బోయి భీమన్న సమగ్రసాహిత్యం పేరుతో మొదటి సంపుటిని తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇటీవలే విడుదల చేశారు. దీనిలో ‘పాటలలో అంబేద్కర్‌’ (పుటలు : 306- 462 ) ఉంది. దీనిలో అంబేడ్కర్‌ వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని వర్ణించిన 118 పాటలు ఉన్నాయి. దీనిలోనే భీమన్న అనేక పాటల్లో దళిత పదాన్ని ప్రయోగించాడు. కానీ, దళిత పదాన్ని వాడడం ఇష్టం లేదని ఆయన తన చివరి రోజుల్లో ప్రకటించాడు. దానికి అనేక కారణాలున్నాయి.
దాన్ని మరోసారి చర్చించుకుందాం. ‘దళిత జనులకంబేడ్కరు, ధర్మమె మతమన్నాడు, బౌద్ధధర్మమొకటేరా, భారతీయమన్నాడు’ అని ఒక చోట, ‘ దళితులనుద్ధరించని ధర్మం కుంటిదంటూ..’ ఒక పాటకు దళిత పదాన్ని శీర్షికలోనే పెట్టిమరీ మరోచోట వ్రాశాడు. దళితుల్ని ఈయన అవర్ణులు, పంచములు, హరిజనులనే పేర్లతో వర్ణించడం కనిపిస్తుంది. కులనిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం పాలేరు. 1988 నాటికి పాలేరు నాటకానికి ఏభై యేళ్ళైందని రచయితే చెప్పుకున్నాడు. అంటే, ఆ నాటకం 1938లో వ్రాసినట్లు స్పష్టమవుతుంది.
భీమన్న రాసిన ‘పాలేరు’ నాటకంలో వెంకన్న, వనబాలల ప్రేమకథలోను, 1959లో వ్రాసిన ‘రాగవాసిష్ఠం’ నాటకంలో గల అరుంధతి, వశిష్ఠుల ప్రణయ గాథలోను, మరికొన్ని రచనల్లోను కులాంతర వివాహాల పేరుతో కులనిర్మూలన అవకాశాల్ని చర్చించాడు. సమాజంలో కులం వల్ల గౌరవం పొందుతున్న కుటుంబం నుండి వచ్చిన వనబాల, కులం వల్ల సమాజం లో అవమానాలకు గురౌతున్న వెంకన్న పరస్పరం ప్రేమించుకుంటారు.
పాలేరుగా పనిచేయాల్సిన వాడు, అగ్రకులంగా గౌరవమర్యాదల్ని పొందుతున్న అమ్మా యిని పెండ్లి చేసుకోవాలంటే, ఎన్ని బాధలకు గురికావాల్సివస్తుందో, అన్నింటినీ అగ్రకుల, భూస్వామి కుబేరయ్య వల్ల పాలేరు వెంకన్న ఎదుర్కొంటాడు. చివరికి ‘ఉపకారి’ మాస్టారు సహాయంతో చదువుకుని, వెంకటే శ్వరరావుగా గౌరవం పొంది, డిప్యూటీ కలెక్టరుగా ఉన్నతోద్యోగం సాధిస్తాడు. ఉద్యోగిగా తన గ్రామానికే వచ్చి, భూస్వాముల దురాగతాలను చట్టబద్ధంగా అడ్డుకుంటాడు. అస్పృశ్యతను పాటించే వాళ్ళనీ, ప్రోత్సహించేవాళ్ళనీ నిరోధిస్తాడు. ప్రజాస్యామ్యబద్ధంగా దళితులు తమ హక్కుల్ని సాధించుకోవాలనే అంబేడ్కర్‌ ఆశయాన్ని దీని ద్వారా ప్రేరేపించాడు రచయిత.
సమాజంలోని వాళ్ళంతా చెడ్డవాళ్ళే కాదనీ, మంచివాళ్ళూ ఉంటారనేది భీమన్న సాహిత్యంలో కనిపించే ఒక విశిష్ట గుణం. ఈ పాలేరు నాటకంలో వనబాల కూడా అగ్రవర్ణానికి చెందిన కుంటుంబం నుండే వచ్చినా, సంకుచిత మూర్ఖ కులతత్వ వాదులు లేని వాళ్ళూ ఉంటారనే మరో పార్శ్వాన్ని కూడా చూపారు. వెంకన్న తండ్రి పుల్లయ్య తన తండ్రి బాటలోనే తానూ పయనించి, తన కొడుకునీ పాలేరుతనానికి పంపుతాడు. అలాంటి సేవ చేయడానికే తాము జన్మించామనే భ్రమను కల్పించి, కొన్ని తరాలుగా కర్మసిద్ధాంతం పేరుతో దళితుల్ని అగ్రవర్ణభూస్వాములు వంచించిన తీరుతెన్నుల్ని ఈ నాటకం ద్వారా వివరించారు.
నిజజీవితంలో అటు అంబేద్కర్‌, ఇటు భీమన్న ఇరువురి జీవితాల్నీ పాలేరు నాటకం స్ఫురింపజేసేటట్లుంది. ఇరువురూ కులం వల్ల అనేక అవమానాల్ని ఎదుర్కొన్నవాళ్ళే. ఇరువురూ చదువుకోవడం వల్లనే అనేకమంది దళితులకి ఆదర్శం కాగలిగారు. యాదృచ్ఛికంగా ఇరువురూ కులాంతర వివాహాలనే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని నిజజీవితంలో ఆచరించి చూపి మరీ ఆదర్శవంతులయ్యారు. రాగవాసిష్ఠంలో అరుంధతీదేవి మాహాత్మ్యాన్ని వివరించడానికి, పురాణేతిహాసాల్లోని కులాంతర వివాహాల్ని సృజనీకరణ ప్రతిభతో భారత జాతీయదృక్పథాన్ని ప్రదర్శించారు. దీనికి ఆర్యద్రావిడ వాదాల్ని కూడా నాటకంలో అంతర్భాగం చేశారు.
సనాతన సాంప్రదాయవాది భావాల్ని ‘ప్రాచీనుడు’ అనే పాత్ర ద్వారా వర్ణించారు. నిష్కళంకమైన ప్రేమకు సాంప్రదాయం ఎలా అడ్డంకిగా మారుతుందో వివరిస్తూనే, ఆ ప్రేమలో నిజాయితీ ఉంటే, అన్నింటినీ జయిస్తుందని నిరూపించారు. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు తోడ్పడతాయని చెప్పినట్లే, తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లల సామాజిక స్థితి గతుల్ని చర్చించవలసిన అవసరం ఉంది. నేడు కులాంతర వివాహాలు జరిగినా, మళ్ళీ తండ్రిది గానీ, తల్లిదిగాని కుల గుర్తింపేవస్తే, కులనిర్మూలన జరిగినట్లెలా అవుతుందో ఆలోచించాల్సిందే!
‘గుడిసెలు కాలిపోతున్నై’ (1973) కావ్యంలో ఏడాది కోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్తగుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది. చీమలను శ్రామిక దళితులకు, పాములను కులదోపిడీదారులకు ప్రతీకలుగా చేసి దానిలో వర్ణించారు. దళితుల మధ్య ఉండాల్సిన సమైక్యత ప్రబోధిస్తారు. ‘కూలిరాజు’ (1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు.‘ధర్మం కోసం పోరాటం’లో బహుజనులంతా రాజ్యాధికారదిశగా పయనించడానికి సూచనలు చేశారు. వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు మొదలైన వాళ్ళు దళితులేనని వాదిస్తూ, వాళ్ళు వ్రాసిన భారత, రామాయణ, భాగవతాలు తమవేనని చెప్పడంలో భీమన్న దృక్పథాన్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
హింసావాదానికి భీమన్న వ్యతిరేకి. దళితులందరూ శ్రామికులనే వారిని భీమన్న వ్యతిరేకించారు. కమ్యూనిస్టుపార్టీలో పనిచేసి, కులం, వర్గం వేరని వాదించిన కోనాడ సూర్యప్రకాశరావుకి పాలేరు నాటకాన్ని అంకితమిచ్చాడు. భీమన్న రచనల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మూడు ప్రధానాంశాల్ని గుర్తించాలి. ఆర్యఅనార్య సిద్ధాంతాన్ని అంబేడ్కర్‌ ఆలోచనతోనే ‘రాగవాసిష్ఠం’ లాంటి నాటకాన్ని వ్రాశాడు. రెండవది, వర్ణం విషయంలో భారతదేశంలో కులమనే అవగాహన చేసుకోవాలి. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ సమన్వయించినప్పుడు కుదరదు. దీన్ని కూడా అంబేడ్కర్‌ ఆంత్రోపాలజీ, సామాజిక శాస్త్రాల్ని ఆధారంగా చేసుకుని చెప్పిన సిద్ధాంతమే. దీన్నే భీమన్న కూడా తన రచనల్లో సమన్వయించాడు.
పాలేరు నాటకానికి వ్రాసిన ముందుమాటలో భీమన్న స్పష్టంగానే వర్గం, కులం పట్ల తన అభిప్రాయాల్ని ప్రకటించాడు. ‘భారత్‌లో వర్గపద్ధతి (ఛిజ్చూటట) లేదు. వర్ణవ్యవస్థ అంటే కుల వ్యవస్థ (ఛ్చిట్ట టడట్ట్ఛఝ) వుంది. ఇక్కడ కూలీలంతా అభ్యుదయం సాధించాలంటే ముందుగా అంటరానితనాన్ని తొలగించాలి’ అన్నాడు. వర్గపోరాటాలు జరుగుతున్న తీరుని విమర్శిస్తూ ‘నాయకులంతా దేశీయ స్థితిగతులను గుర్తించకుండా ప్రపంచ కార్మిక దృష్టిమాత్రమే కలిగిన ధనిక సవర్ణులు’ అని ప్రకటించాడు. ఇంత స్పష్టంగా కులనిర్మూలనను ఆశించిన భీమన్న సాహిత్యాన్ని వివిధ జాతీయసదస్సుల్లో కులం లేదన్నారని వక్రీకరిస్తున్నారు. మూడవది వర్ణాంతవివాహాల వల్ల కులనిర్మూన జరగడాన్ని ఆకాంక్షించారు. ఈ విషయాలన్నీ బాధ్యతగల సాహితీవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌ భావజాలానికి సాహిత్య ప్రతిఫలమే భీమన్న సాహిత్యమని గుర్తించాల్సి ఉంది.

కవితలు

  • అనాది కొసనుంచి అనంతతత్త్వంలోకి
  • రాగవైశాఖి
  • రాభీలు (కవితా సంకలనం).
  • గుడిసెలు కూలిపోతున్నై' కవితాసంపుటి 1975 (కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు లభించింది).
  • భీమన్న ఉగాదులు
  • భీమన్న కావ్యకుసుమాలు
  • మోక్షం నా జన్మహక్కు
  • చివరిమెట్టుమీద శివుడు
  • కూలీ శతకం
  • రాగోదయం
  • అకాండతాండవం
  • గిల్లిచెబుతున్నా
  • మధుబాల
  • దీపసభ

నాటకాలు

  • పాలేరు, నాటకం - 1938
  • కూలిరాజు
  • అసూయ
  • ప్రగతి
  • పడిపోతున్న గోడలు
  • రాగవాసిష్ఠం
  • ఆదికవి వాల్మీకి
  • వేదవ్యాసుడు
  • ధర్మవ్యాధుడు
  • బాలయోగి
  • చిత్రకళాప్రదర్శనం (నాటికల సంపుటి)
  • నవజీవన్ పత్రిక
  • చండాలిక (టాగూర్ రచించిన చండాలిక నాటికకు అనువాదము)

వచన రచనలు

  • ఏకపద్యోపాఖ్యానం
  • ఇదిగో ఇదీ భగవద్గీత
  • జన్మాంతరవైరం
  • పురాణాలలో హరి-గిరిజన మనీషులు
  • ధర్మం కోసం పోరాటం
  • అంబేద్కరిజం
  • అంబేత్కరమతం

పురస్కారాలు

బోయి భీమన్న సాహిత్య పీఠం
బోయి భీమన్న సాహిత్య పీఠం హైద్రాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించబడుతుంది.

2014 పురస్కార గ్రహీతలు

జీవన సాఫల్య పురస్కారం - డా. సి.నారాయణరెడ్డి (జ్ఞానపీఠ పురస్కార గ్రహీత), 2 లక్షల నగదు, ప్రసంశపత్రంభీమన్న 104వ జయంత్యుత్సవంలో భాగంగా 2014 సాహిత్య పురస్కారాల ప్రదానం సెప్టెంబర్ 19న తెలుగు విశ్వవిద్యాలయం లోని నందమూరి తారక రామారావుకళామందిరం జరిగింది. 
  • పద్య కవితా పురస్కారం - రసరాజు, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • గేయ కవితా పురస్కారం - గూడ అంజయ్య, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • వచన కవితా పురస్కారం - శీలా వీర్రాజు, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • నాటక పురస్కారం - పాటిబండ్ల ఆనందరావు, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • కథనవల పురస్కారం - డా. కేశవరెడ్డి, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • అనువాద పురస్కారం - డా. నలిమెల భాస్కర్, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం
  • ఉత్తమ రచయిత్రి పురస్కారం - పి. సత్యవతి, లక్ష రూపాయల నగదు, ప్రసంశపత్రం.

                       కత్తి పద్మారావు


కత్తి పద్మారావు, తెలుగు కవి, దళితవాద ఉద్యమకారుడు, హేతువాది, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ దళితమహాసభ స్తాపకుడు.
పద్మారావు, గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని ఈతేరు లో 1953 జులై 27న దళిత మాల కుటుంబంలో పుట్టారు. అమ్మ మాణిక్యమ్మ, నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. వారు సంవత్సరంలో ఆరు నెలలు ఈతేరులో వ్యవసాయ కూలీలుగానూ, మిగిలిన ఆర్నెల్లూ చీరాలలోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ)లో కార్మికులుగా పనిచేసేవారు. తాత కట్టా రాఘవులు, చీరాల ఐఎల్‌టీడీలో మేస్త్రి. పేరాలలోని శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణ హైస్కూలులో చదివారు. చీరాల పౌర గ్రంధాలయం, పొన్నూరు కాలేజీలోని లైబ్రరీ లో చదివారు. పొన్నూరులోని శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో చేరారు. లక్ష్మీపార్వతిఐ. వెంకట్రావుకె. కృష్ణకుమారి మొదలైన వాళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో ఈయనకు సహాధ్యాయులు. తరువాత పొన్నూరు కాలేజీలోనే తన గురువుగారు కొండవీటి వెంకటకవి స్థానంలో లెక్చరర్‌గా పనిచేశారు.
పద్మరావు హేతువాది, హేతువాదం పత్రిక నడిపారు. తన కుమారునికి కులాంతర వివాహం (చేతన్-నళిని) చేశాడు. "ఏ మతంలోనైనా హేతువాదం ఉండాలి. సంస్కృతం చదువుకోబట్టే అంబేద్కర్, లోహియా ఉద్యమకారులయ్యారు. సంస్కృతంలో షట్దర్శనాలన్నీ హేతువాదమే చెబుతాయి" అని భావించాడు. ఈయన తను బ్రాహ్మణులను వ్యతిరేకించనని, బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తానను, ఎస్సీల్లో కూడా ఎదిగిన తర్వాత మిగిలిన వారిని తొక్కేసే బ్రాహ్మణవాదం ఉంది. దాన్నే వ్యతిరేకిస్తానని చెప్పుకున్నాడు.
పద్మారావు ప్రజారాజ్యం పార్టీలో చేరాడు.

పురస్కారాలు

  • 1992లో అంబేడ్కర్‌ అవార్డు
  • 2003లో సినారె సాహితీ పురస్కారం
  • 2006లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ అవార్డు
  • 2006లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ అవార్డు
  • 2006లో బోయి భీమన్న ట్రస్ట్‌ అవార్డు
  • 2008లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌
  • 2010లో ‘మహాకవి’ బిరుదు

భావాలు

  • ఎంపీలంతా తమ పెట్టుబడులు, నివాసాలు హైదరాబాద్‌లో పెట్టుకుని కోస్తా, సీమలను నిర్లక్ష్యం చేశారు.
  • మేం హైదరాబాద్ రాలేం, దోచుకోలేం. మాకు ముఖ్యపట్టణం అవసరం. సమైక్య రాష్ట్రం, కలిసుందామనడం యాసిడ్ దాడే. తెలంగాణ వచ్చినా రాకపోయినా ఆంధ్రా రావాలి.
  • ఇపుడు దళితులు మధ్యతరగతి వాళ్లయ్యారు.పలుసార్లు పోటీ చేస్తేనే ప్రజలు ఎప్పుడో ఓసారి పలుకుతారు.
  • మాల-మాదిగల సమస్య తెలంగాణ వస్తే సమసిపోతుంది.

                  కలేకూరి ప్రసాద్



కలేకూరి ప్రసాద్
కలేకూరు ప్రసాద్.jpg
జననంఅక్టోబర్ 251964
కంచికచెర్లకృష్ణా జిల్లా,
మరణంమే 172013
ఒంగోలు
వృత్తికవి, సినీ గీత రచయిత, దళితోద్యమ కవి
మతంహిందూ

జీవిత విశేషాలు

కలేకూరి ప్రసాద్ (యువక) ప్రముఖ కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు. జననాట్యమండలివిప్లవ రచయితల సంఘంలో పనిచేశారు.
ప్రసాద్ 1964 అక్టోబర్ 25వ తేదీన కృష్ణా జిల్లాకంచికచెర్లలో జన్మించాడు. ఆయన తల్లి తండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావులు ఇద్దరూ ఉపాధ్యాయులే. కలేకూరి ప్రసాద్‌ తమ గ్రామంలో కంచికచర్ల కోటేశు అనే యువకుడ్ని పెత్తందార్లు సజీవదహనం చేయడంతో చలించిపోయి పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో చేరారు. పార్టీ రాజకీయ పాఠశాలల్లో బోధకుడిగా పని చేశారు. కారంచేడులో దళితుల మారణకాండతో దళిత ఉద్యమాల్లో పని చేశారు.
శ్రీరాములయ్య సినిమాలో వాడిన భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో.. పాట కారంచేడు ను ఉద్దేశించి రాసినదే. అదే సమయంలో పీపుల్స్‌వార్‌ నుంచి విభేధించి బయటకు వచ్చిన కె.జి.సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో జరిగిన పలు ప్రజా, దళిత ఉద్యమాల్లో పనిచేశారు. టంగుటూరులో నవవధువు ఇందిర హత్యకు గురైన సమయంలో ఆయన రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియని ఓ చిరునవ్వా.. పాట రాసి మహిళా ఉద్యమానికి వూపిరిలూదారు. డర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నారు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారని కలేకూరి పలు సందర్భాల్లో చెప్పేవారు.
యువక అనే కలం పేరుతో కలేకూరి ప్రసాద్‌ రాసిన కవితలు ఎంతోమందిని కదిలించాయి. మండుతున్న చుండూరుదళిత కవిత్వం లాంటి కవితా సంకలనాల్లో ఆయన కవితలు చోటుచేసుకున్నాయి. ప్రసాద్‌ రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు. 'కర్మభూమిలో పూచిన ఓ పువ్వా'.. 'భూమికి పచ్చాని రంగేసినట్టూ',చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా తదితర గీతాలు బహు ప్రాచుర్యం పొందాయి. ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చారు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది. కొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశారు. చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నారు.

ధిక్కార పతాక కలేకూరి

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ వేలఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదనే చంపబడ్డాను తనెవరో, తన మూలాలేమిటో గుర్తించిన ఒక మూలవాసి చేసిన సాధికార ప్రకటన ఇది. పిడికెడు ఆత్మ గౌరవం కోసం, తనదైన జీవితం కోసం మరణం గొంతు మీద కాలేసి నిలదీసిన వైనమిది.
కవిగా, కార్యకర్తగా నాయకుడిగా, గాయకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, పాత్రికేయుడుగా, మధుపాత్రికేయుడుగా, ప్రేమికుడిగా, కాముకుడిగా, సాయుధుడుగా, నిరాయుధుడుగా ఒక కొత్త రూపాన్ని ఆవిష్కరించుకుంటూ పోయిన బహురూపి. సిద్ధాంతపరంగా విప్లవవాదిగా మొదలై దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని రెండు కళ్ళు చేసుకుని దృష్టికోణాన్ని విస్తరించుకున్నాడు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్ట్ డైరెక్టర్ (మహబూబ్‌నగర్)గా, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ సంచాలకుడుగా,స్వచ్ఛంద సంస్థలకు సలహాదారుడుగా ఎన్నో పాత్రలు నిర్వహించాడు. ఎక్కడా కుదురుగా నిలవకపోవడం అతని ప్రత్యేకత.అతను స్వేచ్ఛావాది అరాచక వాది. ఒక మూసలో ఇమిడేరకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంకెళ్ళకు, ప్రేమలకు, పెళ్లిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్టే చిక్కి లిప్తపాటులో తప్పించుకుపోగల అపర పాపియాన్.-పైడి తెరేష్ బాబు
కలేకూరు ప్రసాద్ 2013 మే 17 న ఒంగోలులో మరణించారు.

దళిత ఉలి... కలేకూరి (25-Oct-2014)
ఊరి పేరు వినగానే గుర్తుకొచ్చే మొదటి పేరు ఆరికుట్ల కోటేశు. రెండో పేరు కలేకూరి ప్రసాద్‌. కోటేశు అగ్రవర్ణ భూస్వామ్య అహంకారపు మంటల్లో కాలిపోతే, కలేకూరి అగ్రవర్ణ పునాదుల్ని, దురహంకారపు భావజాలాన్ని కాల్చటానికి దళితోద్యమ మంటల్ని రాజేశాడు. పైపైకి ఎగద్రోశాడు.
ఒకరిది అంటరాని ప్రేమ. మరొకరిది పిడికెడు ఆత్మగౌరవపు ధిక్కార జెండా. పులి చంపిన లేడి కోటేశు అయితే, పులిని వెంటపడి తరిమిన పోట్లగిత్త కలేకూరి.
కలేకూరి అంటే ఒక చేతిలో సిగరెట్‌, రెండో చేతిలో పుస్తకం. ఆ పుస్తకంలో కవితలల్లిన నాలుగు కాగితాలు. ఆయన ఆస్తిపా స్తులు కూడా అవే. తదుపరి కాల్చే సిగరెట్‌ను కూడా దాచుకోడు. పొద్దుపోతున్నా అన్నం గూర్చి ఆలోచించడు. జేబులో పదిరూపాయలు ఉన్నా, చేతిలో ఒక్క సిగరెట్‌ముక్క ఉన్నా ఎదుటివారికి ఇవ్వ టమే తెల్సు.
ఆయనకు టీ కొట్టే మీటింగ్‌ హాలు. నాపరాయి కుర్చీనే వేదిక. ఇంటి ముందున్న మట్టి దిమ్మె బహిరంగ సభ. వాటిపై అట్లాగే కూర్చుంటాడు. అక్కడికక్కడే కవితలు రాసేస్తాడు. కాదు కాదు రాజేస్తాడు. చుట్టూ చేరిన జనం మధ్యనే వాటిని చదివి వినిపిస్తాడు. తన కవితలు ప్రజా కవితలు ఔనో, కాదో పరీక్షించుకుంటాడు. విప్లవోద్యమ రాతలన్నీ అలానే రాసాడు. దళిత ధిక్కార గానాన్నీ అలానే ఆలపించాడు. తీరా, అవి జనబాహువుల్లో వజ్రాయుధాలై దూసుకుపోతుంటే, శత్రుశిబిరాల్ని తునాతునకలు చేస్తుంటే, గుండె నిండుగా నవ్వుకుంటాడు. మరోమారు గట్టిగా కవితల్ని నెమరువేస్తూ పులకించిపోతాడు. చెరబండరాజు రాసిన ‘నన్నెక్కనివ్వండి బోను’లా, శ్రీశ్రీ రాసిన ‘అర్థనిమిలితానేత్రాల భయంకర బాధల పాటల పల్లవి’లా, గద్దర్‌ కాలిగజ్జెల ఘీంకారంలా, వంగపండు ‘జముకు చిరుతపులి చిందుల్లా’... కలేకూరి ‘పిడికెడు ఆత్మగౌరవపు’ మాట, ‘భూమికి పచ్చాని రంగేసిన’ పాట జనంలో సజీవ కావ్యాలయ్యాయి. ‘ఎద్దు కొమ్ముల నడుమ ఎర్ర పొద్దు’లయ్యాయి. కలేకూరి రాతల్లో ధిక్కారం తప్ప, లొంగుబాటు కనిపించదు.
తొలినాళ్ళలో నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమంలో పనిచేశారు. కారంచేడు ఘటన తరువాత తెలుగు నేలంతా పరుచుకున్న పదునెక్కిన పాట, చిక్కనౌతున్న పాటల్లో ప్రధాన భూమిక అయ్యాడు. మార్క్సిజం, అంబేద్కరిజం మేళవింపుతో దేశ భవిష్యత్తు రాయాలని ఉపదేశించాడు.
ుపోతుల బాలకోటయ్య
సీనియర్‌ జర్నలిస్ట్‌
(నేడు కలేకూరి ప్రసాద్‌ జయంతి)
ఢిల్లీ పాలన గల్లీకి.. చర్చావేదిక
సువిశాల భారతదేశానికి 15వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తమదైన పంథాలో చొచ్చుకుపోతున్నారు. ఈ నాలుగు నెలల కాలంలో దేశంలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని తీరును ప్రతిబింబింపచేసాయి. పెట్రోలు, గ్యాసు ధరలు 2, 3 సార్లు తగ్గటంతో మధ్యతరగతి వర్గాలు మురిసిపోతున్నాయి. విదేశాంగ విధానంలో ప్రధాని మోదీ వ్యవహార శైలిని ప్రపంచదేశాలన్నీ ప్రశంసిస్తున్నాయి. గంగానది ప్రక్షాళనతో పాటు నదుల అనుసంధానం కార్యక్రమానికి నడుం బిగించడంతో యావత్తు దేశం పులకించిపోతున్నది. తాను అంబానీ, ఆదాని వంటి పారిశ్రామిక వేత్తల గుప్పిట్లో బందీని కాదని పెట్రోలు, గ్యాసు ధరలు తగ్గించటం ద్వారా నిరూపించారు. జనధన యోజన ద్వారా సామాన్యులకు బ్యాంకులు అందుబాటులో ఉండాలని సంకల్పించారు. అన్నింటికంటే ముఖ్యంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమం యావత్‌ ప్రజల మన్నన పొందుతున్నది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల సంక్షేమ సంఘం సహకారంతో, అభిమానులు నడుం బిగించారు. ఇందుకు సంబంధించి రేపు హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న ఆర్‌టీసీ కళ్యాణమండపంలో ‘ప్రజల వద్దకు ప్రధాని పాలన’ అంశం మీద చర్చావేదికను ఏర్పాటు చేశారు. పలువురు పార్టీ పెద్దలు కొంతమంది బార్‌ కౌన్సిల్‌ పెద్దలు, మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరవుతారు. అభిమానులకు కొన్ని చట్టాలపై అవగాహన కల్పించడానికి బార్‌కౌన్సిల్‌ సీనియర్‌ న్యాయవాదులు, పాత్రికేయులు, సామాజికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

                                            ప్రజాయుద్ధనౌక గద్దర్ 


గద్దర్ అసలుపేరు గుమ్మడి విట్టల్ రావు, ఆయన మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో 1949 లో జన్మించారు, ఆయన తల్లి తండ్రులు లచ్చమ్మ, శేషయ్యలు, ఆయనొక నిరుపేద, దళిత కుటుంబంలో జన్మించారు, ఆయన తల్లి తండ్రులు రోజు కూలిలుగా పని చేసి కుటుంబాన్ని పోషించేవారు, ఆయన మాధ్యమిక విధ్యాబ్యాసం మొత్తం నిజామాబాదు జిల్లా బోధనలో జరిగింది, ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు.
 
 
              1969 తెలంగాణా ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు, భావ వ్యాప్తికోసం ఆయన ఊరురు తిరిగి ప్రచారం చేసారు, దీనికొరకు ఆయన బుర్రకథ ను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు, ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. 1971 లో బి నరసింగ రావు ప్రోత్సాహంతో ఆయన తన మొదటి పాట ఆపర రిక్షా అనే పాట రాసారు, ఇది అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది, ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్, ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
 

                  1972 లో జన నాట్య మండలి ఏర్పడింది, ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు, దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది, అయితే 1975 లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసారు అయన కెనర బ్యాంకు లో క్లార్క్ గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల. ఆయన మొదటిసారి మాభూమి సినిమాలో వెండి తెరపై కనిపించారు, సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు.

                     1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు.  1985 లో కారంచేరు లో జరిగిన దళితుల హత్యలకు వ్యతిరేకం గా ఆయన కదం తొక్కారు, జన నాట్య మండలిలో చేరారు, జన నాట్య మండలి నక్సలైట్ ల అనుభంద సంస్థ. ఆయన అనేక గ్రామాలు  తిరుగుతూ తన పాట ద్వార, ఆయన ఎంచుకున్న ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వార గ్రామీణ ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్య పరిచి వారిని ఉద్యమం వైపుగా మల్లిన్చగలిగారు. ఆయన ఇంటి పై పోలీసులు దాడి చేసారు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు, అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఆయన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వరకు అనేక రాష్ట్రాల్లో తన ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్య పరిచారు.
 
 
       ఆయన కింద గోచి దోతి , పైన గొంగళి ధరించి ఉండేవారు. ఆయన పాడే పాటలకు ప్రజలు విచ్చు కత్తుల్ల మారేవారు, దళితులు పేదలు అనుభవిస్తున్న కష్ట,నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు, ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డి లు గా రికార్డ్ అయ్యి అత్యదికం గా అమ్ముడుపోయాయి. ఆయన ఒక హీరో అయ్యారు.
 
 
                మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్య మంత్రి గా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యం లో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
 
 

                    
 
 1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు, ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి, అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు, అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం, ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది.
 
 
                      ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, మరియు వరవర రావు లను తమ దూతలుగా పంపారు.నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రం గా నిరసించారు.
 
 
            ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమ" అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట, ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించారు. ఇటివల ఆయన మరోసారి జై భోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించరు, పొడుస్తున్న పొద్దు మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు, ఈ పాట అద్భుత విజయం సాధించింది, సినిమా నడిచినన్ని రోజులు థియేటర్ లలో జనం ఈ పాట రాగానే నృత్యాలు చేసారు.





గోరటి వెంకన్న

వికీపీడియా నుండి
గోరటి వెంకన్న
Gorati venkanna.jpg
గోరటి వెంకన్న
జననంగోరటి వెంకన్న
1963 (age 49–50)
ఇతర పేర్లుగోరటి వెంకన్న
ప్రసిద్ధిపాటల రచయిత, కవి,గాయకుడు
గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాటలకు మూలాధారాలు. మా టీవీ లో ప్రసార మవుతున్న రేలా రె రేలా కార్యక్రమానికిసుద్దాల అశోక్ తేజ తో కలిసి న్యాయనిర్ణేత గా వ్యవహరిస్తున్నాడు. 1963 లో మహబూబ్ నగర్ జిల్లా గౌరారం (బిజినపల్లి) లో ఆయన జన్మించాడు.నాన్న పేరు నర్సింహ.అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడగలగటం జరిగింది.[1]
రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలుపంచుకోసాగాడు. అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు.
రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో
అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగేకుబుసం సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
రచనలఎవరికో కొన్ని వర్గాల వారికి మత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో ' రేలపూతలు ' ఒకటి ఇక 'రేల పూతల' పరిమళాలలోకి వెళ్తే... ప్రపంచీకరణ మాయా మబ్బులు పల్లెలను సైతం కమ్మేసి, కుమ్మేస్తున్నప్పుడు, కుల వృత్తులు ద్వంసమై, మూలకు పడుతున్నప్పుడు, పల్లెలను మింగి పట్టణాలు బలుస్తున్నప్పుడు, మానవత్వపు విలువలు మృగ్యమైపోతున్నపుడు కవి హృదయం వేదనతో రగిలి, పాటగా రూపుదాల్చి, ఈ 'రేల పూతలు' పూశాయి. ఎంకన్న పాట పల్లె చుట్టూ ప్రదిక్షణ చేస్తుంది. పల్లె అందాలు, పల్లెలోని అమాయకుల అనుబందాలు, వారి జీవితాల్లోని సుఖం- దుఃఖం, కష్టం -నష్టం, వేదన, పోరాటం ఒకటేమిటి అన్నీ కరిగి గోరటి గొంతులో పాటలై మొలకెత్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో అతని దృష్టి నుండి ఏ వస్తువు తప్పించుకోలేదు. సెలకల్లో ఆడే పిల్లల నుంచి ఆకాశంలో ఎగిరే కొంగల దాకా అన్నీ తన పాటల్లోకి రావాల్సిందే. ఒక వైపు ప్రకృతి పల్లెతో కరువు కాటకాల ఆటలు ఆడి హింసిస్తే, మరో వైపు బహుళ జాతి కంపెనీలొచ్చి కుల వృత్తుల సడుగులు ఇరుగదన్ని మూలకు కూర్చోబెట్టాయి . పల్లె యొక్క ఈ దీనావస్తను చూసి, కవి - "పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలో తల్లి బందీయై పోతుందో" అని ఆవేదన చెందుతాడు. పల్లె విద్వంసం గురించి ఇంత విషాద భరితంగా పాడిన మరే కవి మనకు కనించడంటే అతిశయోక్తి కాదేమో! ఈ పాటెంత కీర్తి గడించిందో! ఈ పాటతో కవికెంత ఖ్యాతి దక్కిందో! జగద్విఖ్యాతమే. ఉన్న దానితో సంతృప్తి చెందడం పల్లె ప్రజలకు, అణగారిన జీవులకు అలవాటే కదా! అందుకే కవి అంత వేదనలోనూ ఆ పల్లెల్లోనే ఉన్న ఏదో సౌందర్యాన్ని అన్వేషించి, చూసి, దానికి ముగ్ధుడై పరవశించిపోతాడు. లేకుంటే- " గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలొంచి / సెరువు నీళ్ళను ముద్దాడి మురిసే/నల్ల తుమ్మ చెట్లను..." చూసి -"నా పల్లె అందాలు సూసితే కనువిందురో" అని చెప్పగలడా? "సాళ్ళు దున్నిన ఎర్రని దుక్కిల సంధ్య పొద్దు వాలి వొదిగినప్పుడు" సెలుక ఎంత అందంగా ఉంటుందో చూపగలడా? నేటి జనం నాగరికులైపోతున్నారు. అక్రమాల వక్రమార్గాలను అన్వేషిస్తున్నారు . కాని ఈ లోకం పోకడ తెలియని వారు ఇంకా పల్లెల్లో అక్కడక్కడ మిగిలే ఉన్నారు. అలాంటి వారిలో గోరటి సృష్టించిన 'యలమంద' ఒకడు. వాడికి "లోకం ఎటుపోతున్నా", గొర్ల మందే వాడి లోకం. అందుకే వాడు "తోడున్న గోర్లు" " యాడాదికోసారి లారెక్కుతుంటె" యాడికోతున్నాయని తల్లినడుగుతాడు, తండ్రినడుగుతాడు" "కన్నీళ్ళు రాల్చుతాడు" అని కరుణ రసాత్మక దృశ్యాన్ని మనకు చూపి మన చేతా కన్నీళ్ళు తెప్పిస్తాడు కవి. 'పాట పాడేటి పిల్లలు' పాటతో కవి ఒక్కసారిగా మనల్ని బాల్యంలోకి లాక్కెల్తాడు. వయసు పెరిగే కొద్ది మనుషులకు జ్ఞానం పెరగడం ఏమో! కాని, స్వార్థం పెరగటం మాత్రం ఖాయం. ఏ స్వార్థం ఎరుగని ఆ బాల్యమెంత మధురమో! అన్పిస్తుంది - ఈ పాట చదివినప్పుడు. కసాయి పుత్రులు తల్లి ..."గుండెలపై తన్నినా" ఆ పుత్రులను సైతం "తన గుండె గూటిలో" భద్రంగా దాచుకుంటుందని అమ్మ ప్రేమనూ చూపగలడు కవి. ఈ కవికి ప్రకృతిని చూసి పరవశించటం, దీనావస్థను చూసి కరిగిపోవటమే కాదు, అన్యాయాన్ని చూసి రగిలిపోవటం తెలుసు. కళ్ళెర్రజేయటం తెలుసు. కాబట్టే "ఎరుపు బట్టలు తెద్దామా!... ఎరుకలి బరుగుల తీసుక దొరల ఎంటపడి తరుముదమా!" అని అనగలుగుతున్నాడు. "పెన్నుల మీద మన్ను గప్పితే / గన్నులై మొలకెత్తుతాయిరో" అని హెచ్చరిక చేయగలుగుతున్నాడు. పరుల వైపు వేలెత్తి చూపటం ఇప్పుడు ప్రతివాడికి తెలిసిన సులభసూత్రం. కాని మన వాళ్ళ లొసుగులు బయట పెట్టె సాహసం ఎవరూ చేయరు. ఆ పని గోరటి చేస్తాడు. అందుకే ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే గతాన్ని మరిచిన తనోడిని "ఎందిరో మనోడిట్ల ఎందుకిట్ల మారెరో" అంటూ దుమ్ము దులిపే పాట ఎత్తుకోగలడు. "తెలుగుగంగ నీళ్ళు అలుగెల్లిపోతుంటే/ పలుగు రాళ్ళు తేలి పాలమూరు ఏడ్చింది". అని తన మాతృభూమి దీనావస్థను చూపుతాడు. ఇంకా ఈ సంకలనంలో వామపక్ష భావజాలంతో, ఉద్యమాల నేపథ్యంతో, దళితవాద కోణాల్లో రాసిన పాటలూ ఉన్నాయి. ఆ పాటలన్నీ పల్లె నాడిని, వాడిని పట్టి చూపుతాయని అనుటలో సందేహం లేదు. అందుకే గోరటి పాలమూరు పల్లె బంగారం. అతని పాటలు పాలమూరు రేగల్లల్లో పూసిన "రేల పూతలు".రేల పూతలు

భావాలు అనుభవాలు

  • మా మండల కేంద్రం తెలకపల్లి 'తెలకడు' అనే దళిత శివయోగి పేరు మీద ఏర్పడింది. ఇక మా ఊరు ఈశాన్యాన మేలబాయి, తూర్పున ఏనుగోళ్ల కంచెం, వాయవ్యానికి జైన గుట్ట (దీన్ని ఇప్పుడు అందరూ జన్నాయిగుట్ట అంటున్నారు) ఉత్తరానికి రామగిరిగుట్ట, దుందుభి నది ఉన్నాయి. తాపీ ధర్మారావు రాసిన 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' పుస్తకం మీద శిల్పం బొమ్మ ఉంటుంది కదా, అది మాకు సమీపంలోని మామిళ్లపల్లిలోని దేవాలయం మీద ఉండే శిల్పమే. మాది చాలా విశిష్టమైన ఊరు.
  • చెన్నదాసు అనే యోగి మా ప్రాంతంలో తిరుగుతూ మా నాన్న తరంలో సాలె, మాల, మాదిగలందరికీ అష్టాక్షరి మంత్రోపదేశం చేశారట. ఉదయాన్నే స్నానం చేసి పూజ చెయ్యడం అన్నీ అలవడ్డాయి. ఎవరి ఇల్లే వారికి ఆలయమయ్యింది గనక ఊళ్లోని ఇతర దేవాలయాలకు వెళ్లే అవసరం పడలేదు మాకు. చేతి నిండా ఎవరి పని వారికున్నప్పుడు కులంతో పనేముంది? కులం పేరుతో ఎక్కువతక్కువలు మా ఊళ్లో ఎప్పుడూ లేవు. 'ఏం రెడ్డీ..' 'ఏం వెంకన్నా' అనుకోవడమే తప్ప, ఎవరూ ఎవర్నీ 'అరే, ఒరే' అనడం లేదు. పైగా అందరూ వరసలతో పిలుచుకునేవారు.
  • మా నాన్నకు పది యక్షగానాలు, కనీసం ఐదు శతకాలు, ఇతరత్రా పద్యాలు, వందకు పైగా జానపద గేయాలు - అవన్నీ నోటికి వచ్చు. ఏదైనా ఒకసారి వింటే చాలు, ఆయనకు నోటికి వచ్చేసేది. మా అమ్మానాన్నలు ఏ మాట చెప్పాలన్నా దాన్ని ఒక సామెతగానో, పద్యంగానో... చాలా కవితాత్మకంగా చెప్పేవారు. రోజువారీ మామూలు సంభాషణల్లో సైతం ఎంతో సంస్కృతి, కవిత్వం ఉట్టిపడుతూ ఉండేవి. వాళ్ల నుంచే పాట నాకు వారసత్వంగా వచ్చింది.
  • మా ఊరి దగ్గరున్న దుందుభి వాగు అపర గోదావరి. వానాకాలం మొదలవక ముందే, ఆశ్లేష కార్తె నుంచే అవతలి ఇవతలి ఒడ్డులను ఒరిసి పారేది. అటూఇటూ మనుషుల రాకపోకలకు వీలయ్యేదే కాదు. అందువల్ల నన్ను మూడో తరగతి తర్వాత అవతలి ఒడ్డున ఉన్న రఘురాంపల్లి గ్రామంలో హాస్టల్లో వేశారు. మా ఊళ్లో స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పెరిగిన నేను అక్కడ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండలేకపోయేవాణ్ని.
  • ఇంకా తెల్లవారక ముందు, మూడున్నర గంటల సమయానికే మోట కొట్టే శబ్దాలు వినిపించేవి. వాటితో పాటు పాటలు, జారే నీళ్ల చప్పుడు, ఎద్దుల గిట్టల సవ్వడి - ఇవన్నీ చెవుల్లో దూరి గిలి పెట్టేవి. తెలవారుతూనే యోగి కీర్తనలు, భజనలు వినిపించేవి. తర్వాత రోజంతా బాలసంతులు, వీధి భాగవతులు, బుడబుడక్కలవాళ్లు - ఇలా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు. వాళ్లందరి నుంచీ పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఇక సాయంత్రం మళ్లీ భజనలు, మేళాలు జరుగుతూ ఉండేవి. ఆలోచిస్తే, మా ఊరివాళ్లు అన్నం తినికాదు, ఆటపాటలతో బతికారు అనిపిస్తుంది. ఆత్మానందాన్ని శారీరక బలంగా మార్చుకుని జీవించారు వాళ్లు. ఆ పల్లెటూరి జీవనశైలి రాగమై నా పాటల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నా పాటల్లో కనిపించేది నేను అనుభవించిన జీవితం కాదు. మా ఊళ్లో నేను చూసిన జీవితం. చిన్నప్పుడు సినిమాల ప్రభావం తక్కువ మాపైన. దగ్గర్లో ఉన్న కల్వకుర్తి , నాగర్‌కర్నూల్ వంటి పట్టణాల్లో కొత్త సినిమాలు విడుదలైన విషయాన్ని ఇక్కడ బళ్ల మీద తిరుగుతూ చెప్పేవారు. నాకు తెలియక ఆ బండిలోనే సినిమా చూపిస్తారని అనుకునేవాణ్ని చాలారోజులు. నేను చూసిన తొలి సినిమా 'వీరాంజనేయ యుద్ధం' అని గుర్తు.
  • ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఇచ్చినా తీసుకోకుండా గౌరవంగా బతికిన మా నాన్న ఒకసారి కరువును తట్టుకోలేక హైదరాబాద్‌లో పనికి వెళ్లాడు. అక్కడ బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, తలెత్తకుండా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయి ఏడ్చేశాను.



No comments:

Post a Comment