Tuesday 21 April 2015

డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి బాల్యం:



డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి బాల్యం:
ఆ ప్రవక్త భక్తి సూత్ర మార్గానికి వశులు-
రాంజీ సక్పాల్ కు సంతానామా అదికము ,
కోడుకుళ్ళు –కూతుళ్ళూ అనేకం ,
అందులో అంబేడ్కర్ చివరివాడు ,
దళిత జనానికి వరంగా లభించినవాడు ,
సంఖ్యాపరంగా 14 వ వాడు ,
పదునైన వాడు , తేలివైనవాడు , అలొచనపరుడు ,
ఏప్రిల్ 14 న పుట్టినవాడు ,
సవత్సరమా 1891 ,
అంబేడ్కర్ అసలు పేరు భీమరావ్ ,
ఇంటిపేరు అంబావదేకర్ ,
అంబావదేకర్ ను , ఇంటిపేరుగా మార్చి ,
స్కూల్ రికార్డ్ లో రాశాడు ,
ఆనాటి ఉపాధ్యాయుడు....!!!
అంబేద్కర్ బాల్యామా ,
కష్టాల పుట్ట ,
విధ్యాభ్యాసమా !
అవరోధాల గుట్ట ,
చదువు కున్న తీరు తేన్నులు  పరికిస్తే ,
నిస్తేజం అల్లుకుంటుంది-తనువు నిలువేల్లా దహిస్తుంది ,
మనసున్న మనిషి కంట తడి పేట్టక మానడు ,
అసమానతకు-అంటరానితనానికి నేలవైన ,
ఈ..........??????
కుటిల చరిత్రపై విల్లు ఏక్కిపేట్టక మానడు ,
తరగతి గదిలో –దూరంగా
ఓక మూల , భయంతో –భారంతో-అవమానంతో ,
ఆ బాలభానుడు కూడ తేఛుకున్న చినిగిన చిన్న గోనే గుడ్డ ,
ఆ గుడ్డను అడ్డంగా పరుచుకోని ,
ఆ పైనే కూర్చునేవాడు ,
మదిలో పుట్టేడు బాధ ,
పంతుళ్ళు చేప్పె అ, ,ఇ లు దిద్దుకునే వాడు ,
అక్షరాలు నేర్చుకునేవాడు ,
అంతేనా అంటే ??
కళ్ళూ ఉండి గుడ్డివాడు అన్నట్టు ,
దేనిని చూడకూడదు ,
ఏవరిని తాకకూడదు ,
నోరు ఊండి లేనట్టు ,
ఏది అడగకూడదు-ప్రశ్నించకూడదు ,
ఊపాధ్యాయులు చేప్పిందే వినాలి ,
మూగగా – మౌనంగా –మనోవేధనగా ,
ఉపాధ్యాయులు
మహర్ బాలుడిని ప్రశ్నలు అడిగేవారు కాదు ,
సహనంతో –కనీసం సానుభూతితోనైన చూసేవారు కాదు ,
చిన్నారి చేతులతో రాసిన ,
ప్రశ్నలను –సమాధానలను సరి చేసే వారు కాదు ,
క్లాసులో పిల్లలా ఇంక సరేసరి,
అది…..
అజ్ణానమో-విజ్ణానమో ,
అహంకారమో-అవివేకమో,
ఏమో కాని ,
వాళ్ళు విర్రవీగేవారు ,
పోట్టేళ్ళుళా పేట్రేగేవారు ,
ఈ....
మహర్ విధ్యార్ధితో ,
 మాట్లాడితో మైల పడిపోతామని భయపడేవారు ,
ఔను మరి ,
వారు వారి వారసుల నుంచి ,
నేర్చుకున్న సంప్రదాయం ,
తరతరాలుగా పోగుచేసుకున్న సంపద అది ,
దాహం అయితే సైగ చేయాలి ,
అంతే కాని పిలవకూడదు ,
అలా పిలిస్తే ఇంక కోపోద్రికులు అవుతారు మరి.....
ఇలా గడిచింది చేప్పుకుంటూ పోతే చాలా ఉంది...మీకు చేప్పే ప్రయత్నంలోని భాగమే ఇది , కనీసం ఇప్పటికైన మనవారు గమనించి ముందుకు సాగుతారని అశిస్తున్నాను...!!!
             ఇట్లు

మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment