Wednesday 15 April 2015

డా.అంబేడ్కర్ కోసం

డా.అంబేడ్కర్  కోసం

ఒక పోద నుండి మరోక పొదకు ఎగిరివెళ్తూ
ఒక సరి కోత్త ఆశావాహా కాంతి రేఖల్ని 
వెదజల్లుతూ సంచరించే సీతాకోక చిలుకవూ నువ్వే
రైలు పట్టాల లాగా నేలంతా పరుచుకుంటూ విస్తరిస్తూ
విశ్వవిధ్యాలయాల పునాదులు కుదుపేస్తున్నది నువ్వే
స్వేఛ నుండి స్వేఛలోకి ప్రవహించే మానవీయ గీతానివీ నువ్వే
పైరు పంటల పోలాల నుండి జనసమూహాల నుండి 
నిరసన ఊరేగింపుల నుండి 
ప్రజా పోరాటల నుండి
మాలోకి నడచి వఛు 
మా రధ సారధిగా కదలివఛు 
ఒకే ఒక్కడివి నువ్వే 
బాబా సాహేబ్
మమ్మలని ఎన్నడూ ఎడబాయక మాతోనేవుండి
మా సంకేళ్ళను తెంచగల 
ఏకైక వ్యక్తివి నువ్వే
నువ్వు మాత్రమే..
నువ్వు మాత్రమే...
బాబా సాహేబ్ గారికి మా పాధాభి వందనాలు…!!!

సరి కోత్త ఉదయం కోసం
అదే దు:ఖం
అదే ఆగ్రహం
అదే నిరాశా 
నిస్ప్రుహాల నీరవ ప్రపంచం
గాయమైనప్పుడు మౌనంగా ఉండదు కదా ???
నేత్తుటికణాల కీకారాణ్యాలతో 
కుంపటూలు రాజేస్తుంది
ప్రియతమా
ఇప్పుడు నీపాట
గాయపడ్డ చిరుతపులి ఆర్తనాధం కావాలి
తండ్రి
ఈ దేశానికి ఈ ప్రపంచానీకి 
ఒక సరి కోత్త సూరీఎడు కావాలి
మళ్ళోక్కసారి రారా
ఒక సరి కోత్త ఉదయం కోసం
కోత్త స్వప్నం కోసం
కోత్త ప్రపంచం కోసం
మీ బిడ్డలమైన మా కోసం
మన జాతి బిడ్డల కోసం
వేలుగులు నింపే 
రాజ్యాంగం అనే బూరను చేబూని
మళ్ళి మాలోకి
మాలో పడిచఛిన విప్లవ ఉద్యమాల కేరటం కోసం
మళ్ళోక్కసారి జన్మించవా
తండ్రీ....
నీకు మా వేల వేల వంధనాలు…!!!
          ఇట్లు

మీ అంబేడ్కర్ యువత

No comments:

Post a Comment