Thursday 9 April 2015

దళిత క్రైస్తవులు



దళిత క్రైస్తవులు;
దళితక్రైస్తవులకు SC రిజర్వేషన్ ఒక రాజకీయ ఎత్తుగడ. ఒకవైపు ఇప్పటికే మాల-మాదిగల చిచ్చును రావణకాష్టంలా రగిలిస్తున్న రాజశేఖర్ రెడ్డి అసలు సమస్యని పక్కదారి పట్టిస్తూ చిన్నగీత పక్కన పెద్దగీత గీసాడు. ఇదే అదనుగా హిందుత్వవాదులు ఈ సమస్యని ఒక రాజ్యాంగాన్ని interpret చేసే సమస్యగా కాకుండా, మతపరమైన సమస్య చేసిపారేశారు. దీంతో అసలు చర్చ చాలా చోట్ల తప్పుదోవపడుతోంది.
సమస్య రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది కాదు.
సమస్య దళితులకు ఇంకా రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా కాదు.
సమస్య జనాభాప్రాతిపదికన వర్గీకరణ చెయ్యాలా వద్దా అనేది కాదు.
సమస్య క్రైస్తవ దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది కాదు.
సమస్య క్రైస్తవదళితులకు రిజర్వేషన్ కల్పిస్తే హిందూమతానికి అన్యాయం జరిగిపోతుందా అనేది అస్సలు కాదు.

సమస్య క్రైస్తవ దళితులకు SC కేటగిరీలో రిజర్వేషన్ కల్పించాలా వద్దా అనేది మాత్రమే.
మాల-మాదిగల విభేధం నేపధ్యాన్ని తీసుకుంటే; advantage ఉన్న మాలలు ఎక్కువశాతం రిజర్వేషన్ లాభాలు పొందుతున్నారని. సంఖ్యాపరంగా ఎక్కువున్నప్పటికీ మాదిగలు ఆ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోలేకున్నారనే వాదన ఆధారంగా మాదిగలు వర్గీకరణను కోరారు.మాల-మాదిగలిద్దరూ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, దళితక్రైస్తవులకు రిజర్వేషన్ కల్పిస్తే మళ్ళీ అదే జరుగుతుంది. కాన్వెంట్ చదువులు,ఆర్థికపరమైన బలిమి కలిగిన దళితక్రైస్తవులు రిజర్వేషన్లో సింహభాగాన్ని ఎగేసుకెళ్తే నష్టపోయేది మాల-మాదిగలే.
ఇప్పటికే దళితక్రైస్తవులు BC స్థాయిలో 1% రిజర్వేషన్ కి అర్హులు. దళితక్రైస్తవులకు ప్రత్యేకంగా మరికొంత శాతం అదనంగా పెంచి రిజర్వేషన్ కల్పిస్తే వచ్చేనష్టం లేదుగానీ, SC కేటగిరీలో ఇస్తామంటే మాత్రం దళితులకు అన్యాయం జరిగినట్లే.ఈ చర్చల్లో మతపరమైన కోణం ఒక అనవసరమైన అపోహ మాత్రమే.
ప్రస్తుత సమాజం;

గాలి పీల్చరాదు, నీరు త్రాగరాదు, నేల తాకరాదు, నిప్పు ముట్టరాదు, బాట నడువరాదు.... ఒకేఒక్క మాట ఇలపై జీవించరాదు అని కుాడ మిారు చెప్ప వచ్చు..ఎందుకంటే మిాకు వాగడమే తెలుసు...వాక్శుద్ది తెలియదని మాకు మాత్రమే తెలుసు. బాబాసాహెబ్ డా.భీమ్ రావ్ అంభేడ్కరుని దయతో పొందిన జ్ఞానం తో నేడు అక్షరాన్ని శాసంచే స్థాయిలో దళితులున్నారనే ఇంగిత జఞానం కలవాడెవడైనా ఈరోజు మిాలా వాగడు...
నిద్రపోతున్న జనాన్ని మేల్కొల్పినందకు చాల చాల థేంక్స్...జైభీమ్ గ(గు)రుడా!!!
దళితులకు ఆలయ ప్రవేశం నిషిద్దం అని వాగాడట ఎవడో సామిజీ.... !??

2 comments:

  1. ఇక్కడ దళిత క్రైస్తవుల అంశం మతపరమైన కోణంలో చూడరాదని చెప్పారు, అది వాస్తవం. అయితే ఇంతకు దళిత క్రైస్తవులు ఎవరు? వీరు మాలా మాదిగలు కారా? మాలా మాదిగలు క్రైస్తవ మతం పుచ్చుకుంటే కులం నుండి వేలివేస్తారా? ఇదేమైనా బీహార్ , యూపి. లాంటి రాష్ట్రాలలో జరిగే 'కాప్' (కుల పెద్దల ) పంచాయతి లాంటివా? వారిని కులంలో కలుపొద్దు అంటే కలపడం తీసేయడం ఏంటి? మా కులం పుట్టుకతో రాలేదా? మతం అంటే మార్చుకోవచ్చు కులం ఎలా మారుతుందో కొంచెం వివరించాలి. మతం ఏదైనా కులం ఎక్కదికిపోదు. 1950లో ఆనాటి పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ మతమార్పిడిని నిరోధించడానికి పన్నిన కుట్రే నేటి ఈ అలజడికి కారణం, దళిత మేధావులు అది తెలుసుకోకుండా వింత వాదనలు, విచిత్ర పోకడలు చేస్తున్నారు. మాలా మాదిగలు క్రైస్తవ మతం తీసుకొని చదువుకున్నారు గనుక వారిని ఎస్.సి.లలో చేరిస్తే అన్ని అవకాశాలు వారికే వస్తవి అని పిచ్చివాడి తీరు మాట్లాడుతున్నారు, మరి ఇప్పుడు రిజర్వేషన్ అనుభవిస్తున్నవారు ఒకటి గమనించాలి, ఇప్పుడు చదువుకున్నవాడికి కాకుండా చాదువురానివాడికి అవకాశాలు కల్పిస్తున్నారా? ఏమి మాడ్లాడుతున్నారు? కొంచెం అర్ధం అయ్యేలా మాట్లాడాలి. మాలా మాదిగలను మత పరంగా విభజిస్తున్నరు, దానిని గమనించాలి. క్రైస్తవ మతంలో వున్నా వారు కులపరంగా మాలా మాదిగలే. మిగతావారితో పాటు అంటే హిందూ దళిత్, సిఖ్ దళిత్, బౌద్ధ దళిత్ లతో పాటు సమానంగా అవకాశాలు పొందుకునే అర్హత వారికివుంది. ఇది నేను చెప్పడంలేదు రాజ్యాంగం చెపుతుంది, అది వ్రాసిన అంబేద్కర్ చెపుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. Yes you are right I don’t know who wrote above Article it is utterly false and entirely baseless

      Delete