Wednesday 15 April 2015

హైదరాబాద్ అంబేడ్కర్-బి.యస్.వేంకటరావు


హైదరాబాద్ అంబేడ్కర్-బి.యస్.వేంకటరావు



సామాజిక న్యాయ శిల్పి బి.యస్.వేంకట్రావు
1936 మే 30న జరిగిన ప్రథమ “ మహర్ “ సదస్సుకు అధ్యక్షత వహి%చే గౌరవ బి.యస్.వేంకట్రావు గారికి దక్కింది.డాక్టర్ బి.అర్.అంబేద్కర్ గారు స్వయంగా రైల్వే స్టేషన్ కి వేల్లి , స్వాగతం పలికి ఏనుగు అంబారీపై ఆయనను తీసుకువేళ్ళారు.ఆ సభలో వతలంతాకూడా బి.యస్ ను “ హైదరాబాద్ అంబేడ్కర్ “ గా ప్రశంశలందించారు.1947 లో లాయక్ అలీ మంత్రి వర్గంలో హైదరాబాది విధ్యామంత్రిగా చేరిన వేంకట్రావు ఏడున్నర దశబ్దాలక్రితమే దళితుల రిజర్వేషన్ల కోసం , భూములు కొసం , ఉధ్యమించిన నేత. విధ్యామంత్రిగా దళిత విధ్యార్దులకు స్కాలర్ షిప్ ల చేల్లింపుల కోసం సకల సంపదలను కుదువ పేట్టి , సర్వస్వం కోల్పోయి చివరికి రేండు గదుల ఇంట్లో గడిపిన అరుదైన అసాదారణ ప్రజా నాయకుడు మన వేంకటరావు గారు.
జాతిసంపద , అవకాశాలు , సౌకర్యాలు , వనరుల , పంపీణి సమంగా జరగాలనేది సామాజిక న్యాయసూత్రం.అయితే సామాజిక ,సామూహిక ప్రయేజనాలే కాక , వ్యక్తిగత స్వార్దం , కోద్దిమంది ప్రయేజనాలే సాఅమాజిక న్యాయంగా చలమణీ అవడం పేరిగిపోయింది.
హైదరాబాద్ అంబేడ్కర్
శిలలకు తన చేతితో ప్రాణం పోసి శిల్పాలుగా మలచిన వేంకట్ఱావు గారు తరతరాలుగా పేరుకుపోయిన సామాజిక రుగ్మతల చీడను వదిలించడానికి నడుం బిగించి సామాజిక న్యాయశిల్పిగా మారారు.వ్యక్తిగత సంపదను , కీర్తి ప్రతిష్టతలను గడ్డిపోచలా త్యజించి తన జాతి జనుల ఉద్దరణకు అంకితమైనారు.సికింద్రాబాద్ లోని న్యూబోయిగూడలో డిసేంబర్ 11 , 1898 న సాయన్న , ముత్తమ్మ దంపతులకు జన్మించారు.హైదరాబాద్ రాష్ట్రంలోని అంటరాని కులాల పక్షాన ఉధ్యమిస్తున్న భాగ్యరేడ్డివర్మ , దేశవ్యాప్తంగా నిమ్న కులాలా కోసం ఉధ్యమిస్తున్న డాక్టర్ అంబేడ్కర్ ల ప్రభావం వేంకట్రావును సామాజిక ఉధ్యమాల వైపు నడిపించింది.
నిజాం హయంలోనే దళితులకు రిజర్వేషన్లు.
సికింద్రాబాద్ లోని ఘాస్ నుండి మండి ప్రాంతంలో ఱోడ్డు వేడల్పు ద్వారా ఇళ్ళు కోల్పోయిన దళితుల పక్షాన నికబడి వారికి కోత్త ఇళ్ళను నిర్మింపచేయడానికి రాత్రింబవళ్ళు క్రుషి చేశారు.ఒకవైపు పేద దళితుల పక్షాన పోరాడుతూనే మరోవైపు ఆ కులాల విధ్యార్దులను సమీకరించారు.కౌన్సిలర్ గా ఉన్న వేంకటరావు 1940 డిసెంబర్ 15 న 10 డిమాండ్లతో కూడిన మోమోరాండం సమర్పించారు.అందులో దళిత కులాల విధ్యార్దులకు ఉచిత చదువు , పాత్యపుస్తకాలు , పారితోషికాలు కల్పించి , అర్హులైన వారిని విదేశాలలో చదువుకు పంపాలనేది 1వ డిమాండ్ , 7 దశాబ్దాల క్రితమే ఇలాంటి ఆలోచన చేయడం ఆశర్యకరం , అంతేకాదు ప్రభుత్వ ఉధ్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ను అప్పటి ప్రభుత్వం అంగీకరించింది.

          ఇట్లు

మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment