Monday 11 May 2015

బౌద్దం-ధర్మం



                                        బౌద్దం-ధర్మం
                                   ఒకప్పుడు భౌద్ద భారతంగా పేరోందిన భారతదేశం 14 వ శతాబ్ధంలో భౌద్దం దేశం నుండి నిష్క్రమించడంతో అది హిందు దేశంగా మారింది.భారతీయ హన జీవితంలో బౌద్దం అంతర్వాహినిగా ప్రవహిస్తున్నా పైకి మాత్రం నామరూపాలు లేకుండా పోయింది.మళ్ళీ 1891వ సంవత్సరంలో అనగారికి దమ్మపాల గారు మనదేశంలో మహాబోధి సోసైటీని కలకత్తాలో స్థాపించడంతో బౌద్ద పునురుత్తాన మహాయజ్ణం ప్రారంభమైంది.ఆ తరువాత ఎంతోమంది ముఖ్యంగా రాహుల సాంక్రుత్యాన్ , జగదీష్ కాశ్యప , ఆనంద కౌశల్యాయన , లక్ష్మీ నరసు వంటి వారు క్రుషి చేయగా ఆ క్రుషి అభినవ    “ బుద్దుండంబేడ్కరుడు నాగపూర్ దీక్షా భూమిలో 1956 వ సంవత్సరంలో అక్టోబరు 14 వ “ తేదీన ఒకే వేధికపై . ఒకే రోజున , ఒకేసారి 10 లక్షల మందితో బౌద్ద దీక్షను తీసుకోవడంతో పరాకాష్టకు చేరింది.ఇటువంటి ఘటన ప్రపంచంలో ఏప్పుడు , ఏక్కడ కూడ జరగలేదు , ముందు ముందు కూడ జరుగబోదు , అలాంటి విశ్వసనీయమైన అంశాన్ని తేరమీదకు వఛింది , యావత్తు ప్రపంచ మోత్త కూడ విస్మయానికి గురైంది.
                                ఆ తరువాత మన తేలుగు రాష్ట్రంలో 2000 సంవత్సరానికి కోంచెం అటూ-ఇటూగా ప్రారంభమైనది చెప్పవఛు.ఆంధ్ర అశోకుడు చెన్నూరు అంజనేయరెడ్డి గారు సికింద్రాబాద్ , మహేంద్ర హిల్స్ మీద బౌద్ద కళ ఉట్టి పడేలా కోట్లాది వ్యయంతో ఆనంద బుద్దవిహారాను నిర్మించడంతో బౌద్ద పునురుత్తానం ఒక రూపం తీసుకుందని చెప్పవఛు.2006 సంవత్సరంలో మొదటి రెండు వారాల పాటు అమరావతిలో జరిగిన కాలచక్రంతో బౌద్దం పేరు మారుమ్రోగింది , బౌద్దమత గురువు అయినటువంటి “ దలైలామ “ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
                     సాహిత్యపరంగా చూస్తే అంతకముందు రచయితలంతా బౌద్దేతివ్రుత్తాలను తీసుకోని తమ ప్రతిభాప్రపత్తుల అవ్యక్తీకరణ కోసం రచనలు సాగించారే కాని బౌద్ద మౌలిక బోధనలపై తమ ద్రుష్టిని సారించలేదు.
             మంగళగిరి నుండి శ్రీ క్రుష్ణార్జున బోధిగారి పత్రిక సంఘమిత్ర , ఇది తరువాత రూపుమార్చుకోని బుద్ద భూమిగా వెలవడం సంతోషకరం , వీటిల్లో మంచి బౌద్ద సైద్దాంతిక విషయాలు ప్రచురితం కావడం ఆనంద దాయకం.
                                  ఇట్లు

                మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

1 comment: