Monday 11 May 2015

డా.అంబేడ్కర్ కళాశాల చదువు



   డా.అంబేడ్కర్ కళాశాల చదువు
అది...1907 వ సంవత్సరం
చీకటిని-ఆకటిని-అహించి-సహించి
అవమానాలను-ప్రేలాపనలను
శాపాలను-ప్రకోపాలను-భరించి-భరించి
అడుగులో-మడుగులో-అడుగడుగులో
వేంటబడి-వేధించే-సాధించే
అంటరానితనపు తుంటరి
హైన్యానికీ-దైన్యానికీ
భారంగా-ఘోరంగా
బలి అవుతూ-వెలి అవుతూ
పీడిత-తాడిత జననేత
అంబేడ్కర్ మెట్రుక్యులేషన్ పరీక్ష పాస్ అయిన
సంవత్సరమది-వాంత మది
నిజవర్తనులు-ప్రముఖ సంఘ సంస్కర్తలు
శ్రీ బోలే-క్రుష్ణాజీ అర్జున్ కేలూస్కర్ లు
అంబేద్కర్పై అభినందనలూ-ఆశీసులూ
కురిపించిన వర్షమది...
మట్టిలో నుండి-మాణిక్యం పుట్టినట్టు
బురదలో నుండి పంకజం వేలిసినట్టు
దళిత జనాళి నడుమ
అంబేద్కర్ అవతరించాడు...
దీనుల పాలిట జేగంటలు మొగించాడు
తన చుట్టూ వున్న బాధలను-బంధనాలను
ఆకటినీ-చీకటినీ అధిగమించి
ఓక్కోక్క మెట్టు ఏక్కి ఏక్కి
ఒక్కోక్క మెట్టు ఎదిగి ఎదిగి
హైస్కూల్ స్థాయిని    అధిగమించి
కళాహాల చదువులకై గమించాడు-పురోగమించాడు
ఇంకా-ఇంకా చదవాలనే ఆసక్తి
అంబేడ్కరులో మరింత శక్తిని పేంచింది
ఫలితమే ఎల్ఫిన్ స్టన్ కాలేజీలో చేరాడు
కళాశాల విధ్యార్ధిగా మారాడు
నూనుగు మిఆల ఆ చిరుప్రాయంలో
చదువే అతని ధ్యేయం-చదువే అతని ఆహారం
జ్ణానాన్ని-విజ్ణానాన్ని అంపాధించుకోవాలనే తపన
ప్రజ్ణను-పాటవాన్ని
సముపార్జించుకోవాలనే ఆలాపన
అదోక అనూహ్య అనిర్వచనీయ
అధ్యయన – ఆధన
విజ్ణానమనే ఆయుధాన్ని పట్టి-పదును పెట్టి
తన చుట్టూవున్న తిమిరంతో సమరం చేఇ
అన్యాయలకు-అక్రమాలకు
అపశ్రుతులకు-అస్ప్రుశ్యతకు
నిలయమైన-వలయమైన
ఈ సమాజాన్ని సమూలంగా సంస్కరించి
అంతా ఒక్కటే అనే భావాన్ని కలిగించాలి
తన జాతి ప్రజలకు వెలుగు ఇవ్వాలి
తన పీదిత ప్రజలకు ఒక చక్కని మార్ద్గాన్ని చూపాలి.
ఇది ఒక్కటే అంబేడ్కర్ ముందు నిరంతరం కళ్ళ ముందు కదులుతున్న ఆలోచనలు , ఇలా చేప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అంబేడ్కర్ గారి మార్గాలు , మరి ముఖ్యంగా నా దళిత ( మాల ) ప్రజలు ఇది గమనించి మీ మార్గములను , నిర్దేశకాలను ముందే చూసుకోండి....
                         ఇట్లు

             మీ అంబేడ్కర్ యువత ఐనఓలు

No comments:

Post a Comment