Monday 31 August 2015

అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్

  1. అంటరనితనం ఆవిర్భావం-డా.అంబేడ్కర్




అంటరానితనం అనేది ఏలా పుట్టీంది అనే అంశంపై సామాజిక మ్శాస్త్రజ్నులు చరిత్రకారులు , పురాణాలలో దిట్టలైన వారిలో పాతతరం వారు కాని , ఆధునుకులు గాని ఏకాభిప్రాయానికి రాలేకపోయారు.ఈ విషయంలో ఏన్నో వివధాలు , అసందిగ్ఠత అభిప్రాయ బేధాలువక్రీకరణలు చోటు చేసుకున్నాయి.అంటరానితనం మూలం ఏక్కడ అనేది తేలుసుకునేందుకు శాశ్త్రవేత్తలు , చ్రిత్రకారులు , ఇంకా వేతుకుతూనే ఉన్నారు.హైందవ పురాణ గాధల్లోను , బ్రహ్మణ సాహిత్యంలోను చతుర్వార్ణాల ప్రస్తావన మాత్రమే ఉంది.
పంచమ వర్ణంగా విభజించబడిన అంటరానితనం ప్రస్తావన ఎక్కాడా లేదు.అంటరాని వారు “ అవర్ణులు “ ( వర్ణం లేని వారు ) గా పరిగణించబడి “అంత్యవాసులు ( చివరకు ఉండేవారు ) అయ్యారు.అంటరానితనం ఆవిర్భావానికి సంభంధించిన సిద్దాంతంలో చారిత్రక , మనోవైజ్నానిక అంశాలను అవగాహన న్చేవుకోనేందుకు డ.అంబేడ్కర్ గారు కింది వివరణలను ఇఛారు.
1.హిందువులు , అశ్ప్రుశ్యులు , మధ్య జాతి బేధం లేదు.
2.అంటరానితనం ఏర్పడకముందు హిందువులకు , అంటరానివారికి మధ్య తేడా ఒక తెగ లోని వారికి తెగ నుండి విడిపోయిన వ్యక్తులకి ( Broken Man ) మధ్య ఉండే తేడా వంటీదే.ఈవిడిపోయిన వ్యక్తులే తరువాత అశ్ప్రుశ్యులు అయ్యారు.
3.అంటరానితనానికి జాతి ప్తాతిపదికన కానట్లే వ్రుత్తి కూడ ప్రాతిపదికన కాదు.
4.అంటరానితనం ఎర్పడడానికి 2 మూలాలు ఉన్నాయి.
(అ) విడగోట్టబడిన వ్యక్తులు  ( విశీర్ణ మానవులు లేదా బ్రోకేన్ మేన్ ) బౌద్దులు అన్న అనుమానంతో బ్రాహ్మణులకి వారిపట్ల కసి , ఎవగింపు.
(ఆ) ఇతరులు ఎన్నడో మానివేసిన విడిపోయి మనుషులు గోడ్డుమాంసం తినే అలవాటు మానకపోవడం.
5.అంటరానితనానికి మూలమేక్కడొ కనుగోనేటప్పుడు “ అంటరానివారికి “ అపరిశుద్దులకు మధ్య తేడా ఏమిటో తేలిసి ఉండాలి.సాంప్రదాయమైన హిందు రచయితలంతా అపరిశుద్దులు.అందరిని అంటరాని వారిగా గుర్తించారు.ఇది పొరపటు.అంటరానివారు వేరు , అపరిశుద్దులు వేరు.
6.ధర్మసూత్రాలు రూపోదిన కాలంలో అపరిశుద్దులు ఒక వర్గంగా రూపోందించారు.అంటరానివారు ఆ తరువాత  కాలంలో ( కీ.శ.400 ) ఆవిర్భవించారు.

                           డా.అంబేడ్కర్ గారు గోవధకి , అంటరానితనానికి సంభంధం ఉందని అంటారు/కీ.శ.4ఊ నడు గుప్తుల కాలంలో గోవధకు దండన మరణశిక్ష. ఆ విధంగా పశుమాంసం తినే శూద్రులు అపరిశుద్దులే కాదు అంటరానివారు కూడ అయ్యారు.అంటరానితనం గుర్తించి ముక్తాయింపుగా  అంబేడ్కర్ గారు ఇలా అన్నాడు “ అంటరానితనం “ ఇంచుమించుగా కీ.శ,400 కాలంలో ఎర్పడి ఉంటుంది అని మనం నమ్మవఛు.భారతదేశ  చరిత్రనే పూర్తిగా మార్చివేసింది.అయినా దీనిని చరిత్ర విధ్యార్ధులు తగిన శ్రద్దతో అధ్యయనం చేయక నిర్లక్ష్యం చేస్తునారు.
    ఇట్లు
వలపర్ల సన్ని మహర్


1 comment: