Monday, 20 April 2015

కుల మూలలను నిషేదిద్దాము



కుల మూలలను నిషేదిద్దాము;
పిసరంత పాప పరిహారం ????సమానత్వం ???

ఎక్కడ కనిపిస్తుంది ? ఎలాగుంటుందది ??

జరిగిన మానవ తప్పిదాలకు క్షమాపణలుచెబుతుంది ప్రపంచం
మనం మాత్రం మత్తు విత్తులు జల్లి మళ్ళీ మళ్ళీ తప్పుతున్నాం

ఈ నాటికి జరుగుతుందేమిటి ??

కులమొక ఆయుదం గెలుపుకి - కొందరికి
కులమొక అవిటితనం ఓటమికి - మరికొందరికి

పుట్టుకతొ మొదలౌతుంది - అసమానత్వం
పెంపకం లొ , చదువు లొ - అసమానత్వం

పెళ్ళిలొ , ప్రెమ లొ ,పరువు లొ , పరపతి లొ
గుర్రమెక్క కూడదు ,గద్దె నేలకూడదు, గుడికెక్క కూడదు

దేవున్ని మ్రొక్కకూడదు ,ధైర్యం తొ మొగమెత్తకూడదు
నరికినా ,చంపి కాల్వల్లొ త్రొక్కినా శవాలుంటాయి సాక్ష్యాలుండవ్
ఆయుదాలుంటాయి,ఆధారాలే దొరకవు ,శిక్షలసలుండవ్
వోటు వెయ్య కూడదు , వాటా అడుగ కూడదు
నోటా వచ్చిందికదా,పరిశేలిస్తే కొత్త కోణాలు పుట్టుకొస్తున్నాయి
సమానత్వం .. నిండా అమలౌతుంది కదా !!!!!.
చరిత్రలొ కులం సామాజిక అవసరమా ?? అయితే
వర్తమానం లొ రిజర్వేషన్స్ కూదా సామాజిక అత్యవసరమే
నిరీక్షిచండి సామాజిక అవసరం తీరెదాక ,సమాజం ఆమొదించేదాక
పసి హ్రుదయాలను మలినం చెస్తుంది .
సామాజిక సర్వ సమస్యలకూ నిర్భాగ్యులే కారణమంటుంది
పుట్టినప్పటి నుండీ నూరి పొస్తున్న అకారణ ద్వేషం
భవిష్యత్ పై ప్రతిభావంతులకు భయం కలిగిస్తుంది
పుట్టిన కులాన్ని బట్టి ప్రటిభను కొలిచేది పరాన్నజీవి పవిత్రన్యాయం
ఆ ప్రతిభకు అసలుకారణం అభాగ్యుల స్వేధ జలం
స్వేధ జీవుల ప్రతిభ శ్రమైక జీవనం లొ కనిపిస్తుంది
చరిత్రలోకెళ్ళి చూడు , వెనుకబాటుతనపు విక్రుతత్వం కనిపిస్తుంది
క్రీ.శ 1 వశతాబ్ది నుండి చరిత్ర చెభుతుంది అవసరాన్ని
మను ధర్మం అనుకరిస్తున్నదేశం ఘోషిస్తుంది అసలు ఆవస్యకతను
పూనా ఒడంబడిక - పుర్తి పాఠం చెప్పెదే పిసరంత పాప పరిహారం.




       రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ, కులం నిర్మూలైంచబడాలంటే., కుల రిజర్వేషన్స్ తీసివెయ్యాలని ఆర్ధిక ఆదారిత రిజర్వేషన్లు ఉండాలంటారు.., ముందు కులం వచ్చి, కొన్ని వేల స్ంవత్సరాల తరువాత రిజర్వేషన్స్ వచ్చాయి. ముందు కులం నిర్మూలించబడాలి ఆ తరువాత ఆటొమెటిక్ గా రిజర్వేషన్స్ నిర్మూలించబదతాయి. మీరే అంటున్నారు, కులాలు , అంతరాలు చాలా వరకు తగ్గాయి అని, నేనంటున్నాను, అంతరాలు కొంచెం వరకు తగ్గాయని, అది కూడా రిజర్వేషన్స్ వలన, దళితులు జన జీవన స్రవంతి లో కలువ బట్టి.
                 ఇప్పుడు, ఫైనాన్సియల్లీ బ్యాక్ వార్డ్ అనేది అర్ధం లేదు. ఈనాటి, గ్లోబలిజేషన్ లో అగ్ర కులస్థులు వ్యాపారం చేస్తే, ప్రజలు వారికి లాభాలను వెండి పళ్ళెం లో పెట్టి మరీ ఇస్తున్నారు. ఒక సిటి లో వంద షాప్ లున్నాయి అంటే, తొంభై అయిదు అగ్ర కులస్థులవే, అలాగే పరిశ్రమలు, సినీ, కాంట్రాక్ట్ లు, మ్యానుఫేక్చురింగ్, భూములు వగైరాలు. ఇక్కడ, బ్రాహ్మణులు, మిగతా రెడ్డి కమ్మ కాపుల కంటే కొంచెం వెనుక బడి ఉన్నా దళిత, బి.సి. ఎస్.టి. ల కంటే మెరుగయిన జీవితం లో నే ఉన్నారు. కాబట్టి, డబ్బు సంపదించే వ్యాపారం లో సమాజమంతా అగ్ర కులస్తుల వేంటే ఉంటుంది. మీరు ఎదో ఒక ఉదాహరణ చూపించి దళితులంతా అభివృద్ది చెందారనే భ్రమ లో ఉన్నట్లున్నారు.
                  ఏ విషయములో నైనా, పర్సేంటేజ్ స్కేల్డ్ యూనిట్స్ చూడాలి. కాబట్టి, ఫైనాన్సియల్లీ బ్యాక్ వార్డ్ వాళ్ళ గురించి ఇక్కడ కుల అధారిత రిజర్వేషన్స్ కు ప్రత్యామ్నాయంగా చూపించ వద్దు. ఫైనాన్సియల్లీ బ్యాక్ వార్డ్ వాళ్ళ గురించి ప్రభుత్వాలు ఏదైనా చెయ్యాలి. దాని గురించి అడగండి. దయచేసి, ఊరికే కుల అధారిత రిజర్వేషన్స్ రద్దు చేసి దాని స్థానం లో ఫైనాన్సియల్లీ బ్యాక్ వార్డ్ రిజర్వేషన్స్ పెట్టండి అని అనొద్దు. అయితే, ఇక్కడ ఆల్రెడీ రిజర్వేషన్స్ ఎడా పెడా వినియోగించుకొని, మల్లి మల్లి వినియోగించుకోవడం క్షమించరాని తప్పు జరుగుతుంది. దానివలన నష్ట పోయేది నిమ్న వర్గాలల్లొ ఉన్న పేదలు. అగ్ర కులస్థులు మ్మత్రం కాదు. కాబట్టి, దాని గురించి మెమే పోరాటం చేస్తాము, చేస్తున్నము.
కుల సంకేళ్ళు తెగిపోయి కుల రక్కసి తన రూపం మార్చుకున్నపుడు మా బతుకుల తీరు::::

       గత వందల వేల సంవత్సరాల కాలంలో అగ్రకుల జులుం తో సంపాదించిన సొమ్ము తో వ్యాపారాలు చేసి బాగ సంపాదించి వాళ్ళ కులపోళ్ళకే మళ్ళి మళ్ళి అవకాశములు, వాళ్ళ కంపెనీ లలో ఉద్యోగాలు ఇస్తూ ఇప్పిస్తూ వాళ్ళే పైకొచ్చి వాళ్ళ వాళ్ళనే పైకి తెస్తూ ఆపైన "వాటిస్ దిస్ కేస్ట్ పీలింగ్స్... అవి ఎప్పుడో పోయాయి. అటువంటివి ఏమీ లేవు బ్రదర్" అంటారు.

      కేస్ట్ పీలింగ్స్ లేవంటూ, తమ పిల్లలు మాత్రం ఎట్టి పరిస్తుతులలో మాదిగ మాలోళ్ళను బి.సి. లను లవ్ మ్యారేజ్ లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయ కూడదని బలంగా కోరుకుంటారు. కొందరైతే చస్తారు లేదా చంపుతారు.

     ఒక అపార్ట్ మెంట్ లో మిగతా 19 మంది అగర్కులస్థులైతే.., ఎస్.సి. ఫేమిలీ కి 20 వ ఫ్లాట్ అమ్మనుకాక అమ్మరు. రెడ్డోళ్ళు, కమ్మోళ్ళు, రాజులు, బ్రాహ్మనులు వైశ్యుల ఇండ్ల లో పక్క పోర్ష్ ను ను అద్దెకు ఇవ్వండయ్యా! మా ఆఫీసు కి దగ్గరగా ఉంటుందంటే మీరు మాల మాదిగోళ్ళు బి.సి. లు కాబట్టి ఇవ్వం అంటారు. అదే అగ్ర కులస్తులకు అనుకూలంగా ఉంటే దళితూల ఇండ్ల లో బాగానె అద్దెకు దిగుతారు.

                మనిషి కనపడగానే.. రూపం చూస్తారు..కులం మీద ఒక నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే గత వందల వేల సంవత్సరాల కాలంలో నిమ్న కులస్తులు తిన్న తిండి లో వెరీ-లో విటమిన్స్ ఫుడ్ వలన జెనెటిక్ సమస్యల వలన మాకు ఒక రూపం ఇచ్చారుగా! లేదా పేరదుగుతారు కులం తెలుసుకోవడం కోసం, అప్పడికి వర్కవుట్ కాకపోతే ఇంటి పేరడుగుతారు. నీ మాట చూస్తారు, నీ వేషం చూస్తారు. ఫైనల్ చేస్తారు నీ కులాన్ని... ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అన్నా! నీకు దిమ్మ తిరిగి పోతుంది... మైండ్ బ్లోయింగ్ అంటారే అదనమాట.. అన్ని అవకాశాలు వచ్చినట్లే ఉంటుంది.. కాని ఏది రాదు...

               ఈ తేడాలతో చిన్నప్పటి నుంచీ ఇంకేమి ఆత్మవిశ్వాసం... ఇంకేమి పైకి రావడం... ఇదంతా జరిగిన తారువాత.. మనలను ఏమంటారో తేలుసా! మీరంతా అంతే... ఎన్ని అవకాశములు ఇచ్చినా పైకిరావడం చేత కాదు అని అంటారు..

అనుభవించిన వాఆళ్ళకు తెలుస్తుంది. 

                        ఇట్లు 
                మీ అంబేడ్కర్ యువసేన ఐనఓలు

No comments:

Post a Comment